గ్రహం అనుగ్రహం, శనివారం 3, జనవరి 2015 | Anugraham of the day on Jan 3, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, శనివారం 3, జనవరి 2015

Published Sat, Jan 3 2015 1:35 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

Anugraham of the day on Jan 3, 2015

 శ్రీజయనామ సంవత్సరం
 దక్షిణాయనం, హేమంత ఋతువు
 పుష్య మాసం; తిథి శు.త్రయోదశి ఉ.8.47 వరకు
 తదుపరి చతుర్దశి
 నక్షత్రం రోహిణి ఉ.7.25 వరకు
 తదుపరి మృగశిర
 వర్జ్యం ప.1.11 నుంచి 2.50 వరకు
 దుర్ముహూర్తం ఉ.6.36 నుంచి 8.04 వరకు
 అమృతఘడియలు రా.11.03 నుంచి 12.43 వరకు
 సూర్యోదయం:    6.36
 సూర్యాస్తమయం:     5.34
 రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
 యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు
 

భవిష్యం
 
మేషం: దనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
 
వృషభం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
 
మిథునం: నూతన పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగులకు పనిభారం.
 
కర్కాటకం:  ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. పనుల్లో అనుకూలత. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజకనంగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
 
సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభకు గుర్తింపు రాగలదు. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
 
కన్య
: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు కొద్దిపాటి మార్పులు.
 
తుల
: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
 
వృశ్చికం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
 
ధనుస్సు:
ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.
 
మకరం:
ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు తప్పవు.
 
కుంభం: మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
 
మీనం: ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.

 - సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement