శ్రీజయనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం, తిథి శు.ఏకాదశి ఉ.10.05 వరకు
తదుపరి ద్వాదశి, నక్షత్రం భరణి ఉ.7.37 వరకు
తదుపరి కృత్తిక
వర్జ్యం రా.7.27 నుంచి 9.02 వరకు
దుర్ముహూర్తం ఉ.10.18 నుంచి 11.06 వరకు
తదుపరి ప.2.45 నుంచి 3.33 వరకు
అమృతఘడియలు ..లేవు
సూర్యోదయం : 6.35
సూర్యాస్తమయం : 5.34
రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు
ముక్కోటి ఏకాదశి
భవిష్యం
మేషం: పనులు చకచకా సాగుతాయి. దైవదర్శనాలు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. బంధువులు, మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
వృషభం: శ్రమ కొంత మేరకు ఫలిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది.
మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు.
కర్కాటకం: మీ కృషి ఫలిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
సింహం: పాతమిత్రులను కలుసుకుంటారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
కన్య: ముఖ్యమైన పనులు నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు పనిభారం.
తుల: మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
వృశ్చికం: పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.
ధనుస్సు: ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆలయ దర్శనాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం.
మకరం: ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. బంధువుల కలయిక. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.
కుంభం: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ముఖ్యమైన పనుల్లో
విజయం. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.
మీనం: ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో జాప్యం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
- సింహంభట్ల సుబ్బారావు
గ్రహం అనుగ్రహం : గురువారం 01, జనవరి 2015
Published Thu, Jan 1 2015 5:38 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM
Advertisement
Advertisement