‘దివాకర్ ట్రావెల్స్ పై కేసులు పెట్టాలి’
నల్లగొండ: టీడీపీ నాయకులు జేసీ సోదరులు పిచ్చి కుక్కల్లా మాట్లాడుతున్నారని, వారిని అడ్డం పెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తీరు మార్చుకోకుంటే జేసీ సోదరులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వుంటుందని హెచ్చరించారు.
నందిగామ బస్సు ప్రమాద బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు.