వైటీసీ భవనాన్ని పరిశీలించిన జేసీ
మహబూబాబాద్ : మానుకోట పట్టణంలోని వైటీసీ భవనాన్ని సోమవారం జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ పరిశీలించారు. భవనం పరిసరాలను తిరుగుతూ చూశారు. ఈ భవనంలో ఏర్పాటు చేసే కలెక్టర్ కార్యాలయాన్ని సూచించేలా ప్రధాన రహదారిలో బోర్డు ఏర్పాటు చేయాలని, మార్గ మధ్యలో కూడా బాణం గుర్తుతో చిన్న చిన్న బోర్డులు పెట్టాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చే దారిలో ఉన్న బావులపై జాలి ఏర్పాటు చేయాలని చెప్పారు. కార్యాలయం ఆవరణ స్థలంలో ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేయాలని, భవనానికి రంగులు వేయించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత వైటీసీ భవనంలోని అన్ని గదులను తిరిగి పరిశీలించారు. భవనంలో కలెక్టర్ చాంబర్, జేసీ చాంబర్, డీఆర్ఓ, ఏఓ కార్యాలయాల పనులు జరుగుతుండగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయం తక్కువగా ఉన్నందున త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ జి.భాస్కర్‌రావు, తహసీల్దార్ కె.విజయ్‌కుమార్, ఆర్అండ్బీ ఈఈ పుల్లాదాస్ ఉన్నారు.