నిర్లక్ష్యం తగదు : జేసీ
విజయవాడ (వన్‌టౌన్) :
పుష్కర విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని జేసీ గంధం చంద్రుడు అధికారులకు సూచించారు. దుర్గాఘాట్‌ను ఆయన శనివారం పరిశీలించారు. తరువాత మెడికల్ సెంటర్‌ను, పిండ ప్రదానాల చేస్తున్న పరిసరాలను పరిశీలించి వివిధ స్థాయిల అధికారులతో పలు అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. చివరి మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు స్పందిస్తూ పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు.