ఘాట్లవద్ద అప్రమత్తంగా ఉండాలి : జేసీ
విజయవాడ (కృష్ణలంక) :
కృష్ణానదిలో పెరిగిన వరద ఉధృతి దృష్ట్యా ఘాట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు రెవెన్యూ సిబ్బందికి సూచించారు. కృష్ణలంకలోని పలు ఘాట్లతో పాటు కరకట్ట ప్రాంతాలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఘాట్లలో స్నానాలు చేసేందుకు ఎవరిని దిగనీయొద్దని సూచించారు. ముంపునకు గురయ్యే నదిపరివాహ ప్రాంతాల్లో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.