JDU National Executive Meet
-
అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరే..
పట్నా : బిహార్ మినహా తాము మరెక్కడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామ్య పక్షం కాదని బిహార్ సీఎం, జేడీ(యూ) నేత నితీష్ కుమార్ స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న జమ్ము కశ్మీర్, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ సొంతంగా పోటీ చేస్తుందని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, ఎంపీలు సహా అగ్ర నేతలు హాజరైన జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని నితీష్ కుమార్ వెల్లడించారు. రానున్న రోజుల్లో పార్టీ వివిధ రాష్ట్రాల్లో విస్తరించేందుకు అవసరమైన ప్రణాళికలపైనా ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. కాగా మోదీ క్యాబినెట్లో జేడీ(యూ) నుంచి కేవలం ఒక్కరికే మంత్రివర్గంలో బెర్త్‌ను కేటాయించడం పట్ల గుర్రుగా ఉన్న ఆ పార్టీ ఎన్డీయే నుంచి బయటకు రావచ్చనే ఊహాగానాలు సాగుతున్న విషయం తెలిసిందే. -
కేంద్ర ప్రభుత్వంలోకి జేడీ(యూ)
పట్నా: బిహార్ అధికార పక్షం జనతాదళ్ యునైటెడ్ పార్టీ అధికారికంగా నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమిలో భాగస్వామిగా మారిపోయింది. శనివారం జరిగిన పార్టీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడు నితీశ్ కుమార్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో కేంద్ర కేబినెట్ లోకి ప్రవేశించేందుకు జేడీ(యూ)కు మార్గం సుగమం అయ్యింది. మహాకూటమి నుంచి నిష్క్రమించి బీజేపీ కూటమితో నితీశ్ చేతులు కలిపిన విషయం తెలిసిందే. దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ తన వర్గీయులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇదిలా ఉంటే జేడీ(యూ) సమావేశం జరుగుతున్న సమయంలో శరద్ మద్ధతుదారులు, ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో నితీశ్ ఇంటి బయట భద్రతను భారీగా పెంచారు. లాలూ విసుర్లు... ఇది జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశం కాదని, బీజేపీ భేటీ అని, వాళ్లే ఎన్డీఏలో చేరుతున్నారంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎద్దేవా చేశారు. కుంభకోణాల నుంచి బయటపడేందుకు నితీశ్, సుశీల్ మోదీలు పబ్లిక్‌గా ముక్కు ముక్కు రాసుకుంటున్నారని లాలూ పేర్కొన్నారు.