
పట్నా : బిహార్ మినహా తాము మరెక్కడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామ్య పక్షం కాదని బిహార్ సీఎం, జేడీ(యూ) నేత నితీష్ కుమార్ స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న జమ్ము కశ్మీర్, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ సొంతంగా పోటీ చేస్తుందని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు, ఎంపీలు సహా అగ్ర నేతలు హాజరైన జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని నితీష్ కుమార్ వెల్లడించారు.
రానున్న రోజుల్లో పార్టీ వివిధ రాష్ట్రాల్లో విస్తరించేందుకు అవసరమైన ప్రణాళికలపైనా ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. కాగా మోదీ క్యాబినెట్‌లో జేడీ(యూ) నుంచి కేవలం ఒక్కరికే మంత్రివర్గంలో బెర్త్‌ను కేటాయించడం పట్ల గుర్రుగా ఉన్న ఆ పార్టీ ఎన్డీయే నుంచి బయటకు రావచ్చనే ఊహాగానాలు సాగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment