జేఈ లంచావతారం
బిల్లు మంజూరుకు రూ.23వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ రాజ్ జేఈ
రేపు కోర్టుకు హాజరుపర్చనున్న ఏసీబీ
నర్సీపట్నం: పంచాయతీరాజ్ నర్సీపట్నం మండల ఇంజినీరింగ్ అధికారి అవినీతి నిరోధకశాఖ అధికారుల వలలో చిక్కారు. కాం ట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ సోమవారం పట్టుబడ్డారు. ఏసీబీ డిఎస్పీ రామకృష ్ణప్రసాద్ విలేకర్లకు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. మండలంలోని కొత్తలక్ష్మిపురంలో రూ.5 లక్షలతో కాంట్రాక్టర్ రాజుమల్లు రోడ్డు, డ్రైనేజీ పను లు చేశారు. రూ.2లక్షలకు పైగా మొదటి బిల్లు చెల్లించారు. రెం డో బిల్లు మంజూరు చేయడానికి పంచాయతీ రాజ్ జేఈ సిహెచ్.వేణుగోపాల్ లంచం కావాలని రాజుమల్లును డిమాండ్ చేశారు. రూ.23,600లు చెల్లిస్తే కానీ బిల్లు మంజూరు కాదని చెప్పడంతో రాజుమల్లు ఏసీబీ అధికారులకు విషయం నివేదించాడు. దీంతో ఏసీబీ అధికారులు పన్నాగం వేశారు. అందులో భాగంగా ఉదయం ఫోన్ చేయగా మండల సర్వసభ్య సమావేశంలో ఉన్నానని, సాయంత్రం శారదనగర్‌లో ఉన్న ఇంటికి రావాలని రాజమల్లుకు జేఈ సూచించారు. జేఈ తన వద్ద అనధికారికంగా పని చేస్తున్న అసిస్టెంట్ కురచా నర్సింగరావు(శ్రీను) ద్విచక్రవాహనంపై సాయంత్రం ఇంటికి చేరుకున్నారన్నారు. రాజుమల్లు ఇచ్చిన డబ్బును నర్సింగరావు జేబులో పెట్టుకుంటున్న దశలో ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేశారు. జెఈ వేణుగోపాల్, నర్సింగరావులను విచారించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. వేణుగోపాల్‌ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశ పెడతామని తెలిపారు.