jee (advanced)
-
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష- 2020 ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 28, 29 తేదీల్లో జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఢిల్లీ ఐఐటీ సోమవారం వెల్లడించింది. జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్సైట్ jeeadv.ac.inలో విద్యార్థులు రిజల్ట్స్ చూసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఐఐటీల్లోని బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకై నిర్వహించే ఈ పరీక్షకు లక్షన్నర మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పేపర్-1కు 1,51,311 మంది హాజరు కాగా, 1,50,900 మంది పేపర్ 2 పరీక్ష రాశారు. ఇక ఈ ప్రతిష్టాత్మక పరీక్షల్లో 352/396 స్కోర్ సాధించిన చిరాగ్ ఫలోర్ టాపర్‌గా నిలవగా, 315 మార్కులు సాధించిన కనిష్క మిట్టల్ బాలికల్లో ప్రథమ స్థానం సంపాదించారు. కాగా ఈనెల 6 (మంగళవారం) నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు జోసా ఏర్పాట్లు చేసింది. ర్యాంకర్లకు అభినందనలు తాము అనుకున్న ర్యాంకులు సాధించిన వారికి కేంద్ర విద్యాశాక మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంఖ్ అభినందనలు తెలిపారు. ర్యాంకులు సాధించిన వారు భవిష్యత్తులో ఆత్మనిర్భర్ భారత్ కోసం పనిచేయాలని ఆకాంక్షించారు. పరీక్షలను విజయవంతం నిర్వహించిన ఐఐటీ-ఢిల్లీని ప్రత్యేకంగా మంత్రి అభినందించారు. -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఐఐటీల్లో ప్రవేశాల కోసం గత నెల 28, 29 తేదీల్లో జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను విడుదల చేసేందుకు ఐఐటీ ఢిల్లీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఈనెల 6 (మంగళవారం) నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు జోసా ఏర్పాట్లు చేసింది. -
ఈ నెల 14న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఈ నెల 14న విడుదల చేసేందుకు ఐఐటీ (రూర్కీ) ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాలు వెల్లడైన వెంటనే ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం పొందే సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కసరత్తు చేస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ 16 నుంచే చాయిస్ ఫిల్లింగ్ (వెబ్ ఆప్షన్లు) ప్రారంభిస్తామని, 27న మొదటి సీట్ల కేటాయింపును ప్రకటిస్తామని ఎన్ఐటీ, ఐఐటీలకు జోసా తెలియజేసినట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల చేయడంతో పాటు చాయిస్ ఫిల్లింగ్‌కు వెబ్‌సైట్‌ను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 15 నాటికి ఏడు దశల కౌన్సెలింగ్‌ను నిర్వహించి ప్రవేశాలు పూర్తి చేసేలా చర్యలు చేపడుతోంది. మరోవైపు చాయిస్ ఫిల్లింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వరంగల్ ఎన్ఐటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.వి. రమణరావు తెలిపారు. -
జేఈఈ అడ్వాన్స్డ్ కు వంద మార్కుల కటాఫ్
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలు బుధవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా 12 లక్షలకుపైగా విద్యార్థినీ విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా సీబీఎస్ఈ బుధవారం సాయంత్రం వీటి ఫలితాలను విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి జనలర్ కేటగిరీ విద్యార్థులకు వంద మార్కులు కటాఫ్ గా నిర్ణయించింది. అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి ఓబీసీ విద్యార్థులకు కటాఫ్ మార్కులు 70 గా నిర్ణయించగా, ఎస్సీ విద్యార్థులకు 52, ఎస్టీ విద్యార్థులకు 48 గా సీబీఎస్ఈ ఖరారు చేసింది. దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశం పొందడానికి నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్షకు 2 లక్షల మందికి (అర్హత) స్కోర్ కార్డులను ప్రకటించినట్టు తెలుస్తోంది. అర్హత సాధించిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి ఆన్ లైన్ లో (http://jeeadv.nic.in) రిజిస్టర్ చేసుకోవాలని సీబీఎస్ఈ కోరింది. ఇకపోతే, ఇంటర్ వెయిటేజీ మార్కులను, జేఈఈ మెయిన్ పరీక్షలో వచ్చన మార్కులను (60% : 40% నిష్పత్తిలో) కలిపి ర్యాంకులను జూన్ నెల 30 వ తేదీలోగా ప్రకటించనున్నట్టు సీబీఎస్ఈ తెలిపింది. ఐఐటీల్లో కాకుండా దేశ వ్యాప్తంగా ఎన్‌ఐటీల్లోని బీఈ, బీటెక్, బీఆర్క్ వంటి కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఇంటర్ లో వచ్చిన మార్కులు, జేఈఈ మెయిన్ లో వచ్చిన మార్కులను కలిపి ర్యాంకులను ప్రకటిస్తారన్న విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్స్ పరీక్ష మొత్తం 360 మార్కులకు గాను గతేడాదికంటే కటాఫ్ మార్కులు ఈసారి తగ్గించారు. 2013లో 113 మార్కులు, 2014లో 115 మార్కులు , 2015 లో 105 మార్కులు కటాఫ్ గా నిర్ణయించారు. ప్రతిఏటా అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి 1.5 లక్షల విద్యార్థులను మాత్రమే ఎంపిక చేయగా, ఈసారి 2 లక్షల మంది విద్యార్థులను ఎంపిక చేయడంతో కటాఫ్ వంద మార్కులకు తగ్గించినట్టు తెలుస్తోంది. జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలు కోసం..