నేడు నామినేషన్ల ఉపసంహరణ
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులకు ఉపసంహరణ గడువు సోమవారం సాయంత్రం 3.00 గం టల వరకు ఉంది. ఈనెల 17 నుంచి కొనసాగిన నామినేషన్ల ప్రక్రి య 20న ముగిసింది. 21న పరిశీలన అనంతరం 10 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వారు జిల్లా ఎన్నికల అధికారి కిషన్‌కు 22న అప్పీల్ చేసుకోగా సంబంధిత అభ్యర్థుల నామినేషన్లను 23న కలెక్టర్ నేతృత్వంలో తిరిగి పరిశీలించారు.
ఇందులో మహబూబాబాద్ జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేసిన జెన్నారెడ్డి వెంకటేశ్వ ర్లు పోటీ చేసేందుకు కలెక్టర్ అనుమతిచ్చినట్లు రిటర్నింగ్ అధికారి ఈఎస్.నాయక్ తెలిపారు. ఉపసంహరణ కార్యక్రమం నేడు ఉద యం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల లోపు ఉం టుంది.. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించి జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.
ఉపసంహరణ పత్రాలు ఎవరికివ్వాలి
జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు జిల్లా పరిషత్‌లోని రిటర్నింగ్ అధికారి ఈఎస్.నాయక్‌కు, ఎంపీటీసీలుగా పోటీ చేసే అభ్యర్థులు మండల పరిషత్ కార్యాలయాల్లోని రిటర్నింగ్ అధికారులకు ఉపసంహరణ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఉపసంహరణ పత్రాలను నామినేషన్ వేసిన అభ్యర్థి వ్యక్తిగతంగా.. లేదా ప్రతిపాదకుడి ద్వారా నైనా అందించవచ్చు. ప్రతిపాదకుడి ద్వారా అందించే అభ్యర్థులు అతడి సంతకాన్ని అటెస్టెడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే పోటీలో ఉన్నట్లు పరగణించబడతారు.
నామినేషన్లు ఉపసంహరించుకున్న ఏడుగురు
జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో ఆదివారం ఏడుగురు ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈఎస్.నాయక్ తెలిపారు. వారిలో గూడూరు మండ లానికి చెందిన వేం శ్రీనివాస్‌రెడ్డి, రేగొండకు చెందిన మండల ప్రవర్థన, కోసరి మంజుల, పరకాలకు చెందిన కోరె రమేష్, జంగిలి రాజమౌళి, ములుగుకు చెందిన రుద్రోజు ఆనందాచారి, జఫర్‌గఢ్‌కు చెందిన బానోతు బుజ్జమ్మ ఉన్నట్లు తెలిపారు.