ఆగ్రహమేల నోయి సింహా..!
దక్షిణాఫ్రికా సఫారీల్లో కొందరు సంచారులుంటారు. బాహ్యప్రపంచాన్ని పూర్తిగా మరచి జంతువుల జీవన శైలిని పరిశీలించడంలో, వాటి భావోద్వేగాలను క్లిక్‌మనిపించడంలో మునిగి తేలుతుంటారు వీళ్లు. ఇలాంటి వారిలో ఒక ప్రముఖుడు బ్రెండన్ జెన్నింగ్స్. సింహాల జీవనశైలి గురించి అధ్యయనం చేస్తూ, వాటి లైఫ్ స్టైల్‌ను ఫోటోలుగా మలిచే జెన్నింగ్స్‌కు ఇటీవల ఒక ఆసక్తికరమైన సీన్ కనపడింది.
తను చాలా రోజులుగా గమనిస్తున్న ఒక ఆడసింహం, మగ సింహం గొడవపడుతున్న దృశ్యాన్ని గమనించాడు. ఆలస్యం చేయక తన కెమెరాకు పని చెప్పాడు. అడవికి రారాజైన సింహం తన పార్ట్నర్తో గొడవ పడుతున్న దృశ్యాన్ని కళ్లకు కట్టాడు జెన్నింగ్స్. సింహాల సంసారంలో అప్పుడప్పుడు ఇలాంటి అలకలు, గొడవలు మామూలేనని జెన్సింగ్‌స వ్యాఖ్యానించాడు.