Jiah Khan case
-
జియాఖాన్ కేసులో సంచలన తీర్పు
ముంబై: జియా ఖాన్ మృతి కేసులో ముంబై సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది. సూరజ్ వల్లే జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాల లేనందునా.. అతన్ని నిర్దోషిగా తేలుస్తూ విడుదల చేస్తున్నట్లు సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ పేర్కొన్నారు. దీంతో పదేళ్ల కిందటి నాటి ఈ కేసులో జియాఖాన్‌కు న్యాయం జరుగుతుందని భావించిన వాళ్లంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పును జియాఖాన్ తల్లి రబియా సవాల్ చేసే అవకాశం ఉంది. జియా ఖాన్ నేపథ్యం.. కేసు వివరాలు 👉 న్యూయార్క్‌లో పుట్టి పెరిగి.. ఇంగ్లీష్-అమెరికన్ నటిగా పేరు సంపాదించుకుంది నఫిసా రిజ్వి ఖాన్ అలియాస్ జియాఖాన్. 👉 బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘నిశబ్ద్’తో బాలీవుడ్లో లాంచ్ అయిన జియా.. చేసింది మూడు చిత్రాలే అయినా సెన్సేషన్‌గా మారింది. 👉 నిశబ్ద్తో పాటు అమీర్ ఖాన్ గజిని, హౌజ్‌ఫుల్ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది జియాఖాన్. అయితే.. 👉 2013, జూన్ 3వ తేదీన ముంబై జూహూలోని తన ఇంట్లో జియాఖాన్(25) విగతజీవిగా కనిపించింది. 👉 ఘటనా స్థలంలో దొరికిన ఆరు పేజీల లేఖ ఆధారంగా.. జూన్ 10వ తేదీన ముంబై పోలీసులు నటుడు సూరజ్ పంచోలిని ఆత్మహత్యకు ప్రేరేపించాడనే అభియోగంతో(ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం) అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. 👉 ఆదిత్యా పంచోలీ తనయుడైన సూరజ్ పంచోలీ, జియాతో డేటింగ్ చేశాడనే ప్రచారం ఉంది. 2012 సెప్టెంబర్ నుంచి వాళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారు. 👉 అయితే.. జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ మాత్రం తన కూతురిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని వాదిస్తోందామె. 👉 జియాను శారీరకంగా, మానసికంగా సూరజ్ హింసించాడని, ఫలితంగా నరకం అనుభవించిన తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలిపింది. 👉 2013 అక్టోబర్‌లో రబియా, జియాఖాన్ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన కోర్టు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 👉 2014 జులైలో.. మహరాష్ట్ర పోలీసుల నుంచి సీబీఐ కేసును టేకప్ చేసింది. 👉 సూరజ్ పాంచోలీ బలవంతంగా తన కూతురితో సంబంధం పెట్టుకున్నాడనేది రబియా ఆరోపణ. అంతేకాదు.. పోలీసులు, సీబీఐ ఈ కేసులో లీగల్ ఎవిడెన్స్‌ను సేకరించలేదన్నది ఆమె ఆరోపణ. 👉 సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేయడంతో.. విచారణ తమ పరిధిలోకి రాదని పేర్కొంటూ కేసును 2021లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానికి బదిలీ చేసింది ముంబై సెషన్స్ కోర్టు. 👉 అయితే సూరజ్ మాత్రం తాను అమాయకుడినని, జియా మరణంతో సంబంధం లేదని వాదిస్తున్నాడు. 👉 ఈ కేసులో 22 మంది సాక్ష్యులను ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టింది. గత వారం ముంబై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఇరుపక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ(శుక్రవారం, ఏప్రిల్ 28న) తీర్పు వెల్లడించనున్నట్లు సీబీఐ న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ స్పష్టం చేశారు. తీర్పు నేపథ్యంలో కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. చివరికి.. సాక్ష్యాధారాలు లేనందున కోర్టు పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది. ఇదీ చదవండి: 26 రోజులు నరకం చూశా: నటి -
నా కూతురి సూసైడ్‌కు ముందు ఆ నటుడు టార్చర్ పెట్టాడు: నటి తల్లి
రామ్‌గోపాల్ వర్మ నిశ్శబ్ద్ సినిమాలో అమితాబ్ సరసన నటించడంతో బాలీవుడ్లో ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది నటి జియా ఖాన్. 2013 జూన్ 3న ఆమె ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో చిత్రపరిశ్రమలో సంచలనం రేపింది. జియాఖాన్ ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలతో బాలీవుడ్ నటుడు ఆదిత్యా పంచోలి కుమారుడు సూరజ్ పంచోలీని పోలీసులు అరెస్ట్ చేయగా తర్వాత అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే ఇప్పటికీ జియాఖాన్ కేసులో తుదితీర్పు మాత్రం వెలువడలేదు. తాజాగా ముంబై స్పెషల్ కోర్టుకు హాజరైన జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ తన కూతురు ఆత్మహత్యకు ముందు సూరజ్ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ వాంగ్మూలమిచ్చింది. 'జియా.. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా నిలదొక్కుకుంటున్న సమయంలో సూరజ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా తనను పరిచయం చేసుకుని, ఆమెను కలిసేందుకు ప్రయత్నించాడు. కొంత భయం, మరికొంత అయిష్టంగానే 2012 సెప్టెంబర్‌లో తొలిసారిగా జియా అతడిని కలిసింది. అప్పుడు వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పంపింది. కానీ కేవలం ఫ్రెండ్స్ అనే చెప్పింది. ఆ తర్వాత సూరజ్ నెమ్మదిగా జియాను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆమె ఎప్పుడేం చేయాలనేది కూడా తనే డిసైడ్ చేసేవాడు. జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ 2012 అక్టోబర్‌లో వాళ్లిద్దరూ ఒకరింట్లో మరొకరు కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఆ తర్వాతి నెలలో నేను లండన్‌కు వెళ్లినప్పుడు నా కూతురు చాలా సంతోషంగా కనిపించింది. క్రిస్మస్ పండగ జరుపుకునేందుకు, తిరిగి సినిమాల్లో నటించేందుకు ముంబై వస్తానంది, కానీ అలా జరగలేదు. డిసెంబర్ 24న నాకు సూరజ్ నాకు మెసేజ్ చేశాడు. జియాఖాన్ మీద కోప్పడ్డాడనని, దయచేసి తనను క్షమించి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతూ మెసేజ్ చేశాడు. వాళ్లిద్దరూ ఏదో పెద్ద గొడవే పెట్టుకున్నారని అప్పుడర్థమైంది. అయితే జియా అతడిని క్షమించేసింది. అనంతరం వాళ్లిద్దరూ కలిసి గోవాకు వెళ్లారు. కానీ ఓరోజు నా కూతురు నాకు ఫోన్ చేసి తనకక్కడ ఉండాలని లేదని, ఆ ప్రాంతమే తనకు అదోలా ఉందని చెప్పింది. కారణం.. గోవాలో నా కూతురి ముందే సూరజ్ మిగతా అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసేవాడు. 2013, ఫిబ్రవరి 14న జియా లండన్ వచ్చేసింది. అప్పుడు తనను కలిసినప్పుడు ఏదో పొగొట్టుకున్నదానిలా దీనంగా కనిపించింది. ఏమైందని అడిగితే సూరజ్ తనను శారీరకంగా హింసించడమే కాకుండా, అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని, చాలా చెత్త చెత్త పేర్లతో పిలుస్తూ టార్చర్ చేస్తున్నాడని తన దగ్గర వాపోయింది' అని చెప్పుకొచ్చింది రబియా ఖాన్. కాగా ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారణ జరుపుతోంది. చదవండి: కార్తికేయ 2 ఈ ఓటీటీలోకే రాబోతోంది! చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్‌కాట్ ట్రెండ్‌పై హీరో రియాక్షన్ -
‘దేశ చరిత్రలోనే అలా అడిగిన వ్యక్తిని నేనే’
సాక్షి, ముంబై : వర్ధమాన బాలీవుడ్ నటి జియా ఖాన్ 2013 జూన్‌లో ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడైన సూరజ్ పంచోలీ గురువారం మీడియాపై మండిపడ్డాడు. సంచనాల కోసం మీడియా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. తన నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా తానే దోషినని మీడియా తీర్పు ఇచ్చేసిందని విచారం వ్యక్తం చేశారు. ‘నా గురించి మీడియా రాసిన వార్తల్లో కనీసం 5 శాతం కూడా నిజాలు లేవు. కానీ, ఈ దేశంలో తీర్పిచ్చేది కోర్టులే గానీ మీడియా కాదు. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది నాకు ముఖ్యం. తీర్పు కోసం వేచి చేస్తున్నా’నని వ్యాఖ్యానించారు. కేసు గురించి వివరిస్తూ.. ‘గత ఆరేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతుంది. జియాఖాన్ చావుకు నేనే కారణమని ఆరోపించిన ఆమె తల్లి రబియా ఖాన్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కోర్టు వాయిదాలకు హాజరుకాలేదు. ఆమెకు బ్రిటన్ పాస్‌పోర్టు ఉంది. దీన్ని బట్టి ఎవరు దోషులో అర్థమవుతోంది. కానీ మీడియా ఇవేమీ పట్టించుకోదు. ఆ సంఘటన జరిగినప్పుడు నా వయస్సు 22 ఏళ్లు. చుట్టూ ఏం జరుగుతుందో అర్థమయ్యేదికాదు. నాపై వచ్చిన ఆరోపణలు నిజం కావని తెలుసు. ఈ దేశంలో ఒక అమాయక వ్యక్తిపై నిందితుడని ముద్ర వేశాక అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం చాలా కష్టం. అయినా విచారణ జరిపించి దోషులను తేల్చాలని కోర్టుకు విజ్ఞప్తి చేశా. దేశంలోనే తనపై విచారణ చేయమని కోర్టును అడిగిన నిందితుడిని బహుశా నేనే అనుకుంటా. మీడియా వైఖరి వల్ల బాధపడేది నేనొక్కణ్ణే కాదు. నాకూ ఫ్యామిలీ ఉంది. వాళ్లంతా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోవైపు నా కెరీర్‌ను చూసుకోవాలి. జనాల నుంచి ఎలా సానుభూతి పొందాలో కూడా నాకు తెలియద’ని విశ్లేషించారు. కాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలి... సల్మాన్ ఖాన్ నిర్మించిన ‘హీరో’ సినిమాతో రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత నుంచి ఏ ఒక్క సినిమాకు కమిట్ అవలేదు. దీనికి కారణం అడగగా, రొటీన్ కథలే ఎక్కువగా వస్తున్నాయని, వాస్తవ కథల కోసం ఇన్నాళ్లూ వెయిట్ చేశానని చెప్పారు. ఇప్పుడు శాటిలైట్ శంకర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సూరజ్. నవంబర్ 8న విడుదలవుతోన్న ఈ సినిమా కథాంశం గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఆర్మీ జవాన్‌గా నటించాను. ఇంత వరకు సైనికులను హీరోలుగా చూపెడుతూ ఉరీ, బార్డర్ వంటి సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో సైనికుల పట్ల సమాజం ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలనే విషయాన్ని చర్చించాం’ అని తెలిపారు. -
హీరోయిన్ మృతి కేసు ; ‘అబార్షన్ వికటించింది’
ముంబై : సంచలనం రేపిన హీరోయిన్ జియా ఖాన్ మృతికేసులో కీలక పరిణామం. యువ హీరో సూరజ్ పాంచోలీ ముమ్మాటికీ నిందితుడేనని ముంబై సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. ‘అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్(ఆత్మహత్యకు ప్రేరేపించడం)’ కింద సూరజ్‌ను విచారించనుంది. నేరం నిరూపణ అయితే అతనికి గరిష్టంగా 10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశంఉంది. ఫిబ్రవరి 14 నుంచి సూరజ్‌పై విచారణ జరుగనుంది. జియా మృతిపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జియా-సూరజ్‌లు సహజీవనం చేయడం, ఆ క్రమంలో ఆమె గర్భందాల్చడం, బలవంతంగా చేయించిన అబార్షన్ వికటించడం.. తదితర విషయాలను చార్జిషీట్లో పూసగుచ్చినట్లు వివరించారు. ‘సగం పిండం ఆమె కడుపులోనే ఉండిపోయింది.. ’: : సీబీఐ సమర్పించిన ఆధారాల్లో ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ కీలకంగా మారింది. జియా నాలుగు నెలల గర్భాన్ని సూరజ్ బలవంతంగా తొలగించినట్లు నిర్ధారణ అయింది. ‘ఓ రోజు సూరజ్ పాంచోలీ.. డాక్టర్‌కు ఫోన్ చేసి.. జియా పిల్స్ వేసుకుందని, అయితే, ఆబార్షన్ పూర్తిగా జరగలేదు..సగం చెత్త(స్టఫ్) ఆమె కడుపులోనే ఉండిపోయింద’ ని అన్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత వారు ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకున్నారు. జియా తన సూసైడ్ నోట్లోనూ అబార్షన్ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం గమనార్హం. ‘‘నన్ను నీకు పూర్తిగా సమర్పించుకున్నాను. కానీ నువ్వు అనుక్షణం నన్ను బాధపెట్టావు, నా అణువణువుణూ నాశనం చేశావు. నాలో పెరుగుతున్న నీ బిడ్డను చంపుకోవాల్సి వచ్చినప్పుడు ఎంత క్షోభపడ్డానో నీకు అర్థంకాదు’’ అని జియా రాసుకున్నారు. అసలేం జరిగింది? : అమితాబ్-రాంగోపాల్ వర్మల ‘నిశబ్ధ్’తో బాలీవుడ్‌కు పరిచయమై, ‘గజిని’, ‘హౌస్‌ఫుల్’ సినిమాలతో మెప్పించిన జియా ఖాన్.. 2013, జూన్ 3న జుహూలోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయారు. అయితే, తన కూతురిది ఆత్మహత్య కాదు.. సూరజ్ పాంచోలీనే చంపేశాడని జియా తల్లి రుబియా ఆరోపించారు. కేసు నమోదుచేసుకున్న ముంబై పోలీసులు.. జియా బాయ్‌ఫ్రెండ్ సూరజ్ పాంచోలీని కూడా ప్రశ్నించారు. చివరికి అది ఆత్మహత్యేనని చార్జిషీటును సిద్ధం చేశారు. అయితే, పోలీసుల దర్యాప్తుపై రుబియా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు సీబీఐకి బదిలీ అయింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన సీబీఐ.. జియాది ఆత్మహత్య అంటూనే.. అందుకు ప్రేరేపించింది మాత్రం సూరజ్ పాంచోలీనే అని తేల్చిచెప్పింది. ఇందుకుగానూ పలు ఆధారాలను సమర్పించింది. సూరజ్‌తో సహజీవనం చేసిన జియా.. అతని దుస్తులు ఉతకడం, ఇస్త్రీ చేయడం, వంటచేసి పెట్టడం, ఇల్లు తుడవటం.. ఇలా అన్ని పనులు చేసేదని సీబీఐ పేర్కొంది. న్యాయం బతికే ఉంది.. : సూరజ్ పాంచోలీ నిందితుడేనని కోర్టు పేర్కొనడంపై జియా ఖాన్ తల్లి రుబియా హర్షం వ్యక్తం చేశారు. ‘‘నాలుగేళ్ల పోరాటం ఫలించింది. ఈ దేశంలో న్యాయం ఇంకా బతికే ఉంది. ఆత్మహత్యకు ప్రేరింపించాడు అనే కంటే ఆ దుర్మార్గుణ్ణి(సూరజ్‌ను) హంతకుడిగా గుర్తించి ఉంటే ఇంకా సంతోషించేదానిని. అదే డిమాండ్‌తో హైకోర్టుకు వెళతా’’ అని రుబియా వ్యాఖ్యానించారు. తల్లి రుబియా ఖాన్, జియా మృతదేహం ఫొటోలు(ఫైల్) జియా ఖాన్( ఫైల్ ఫొటో) -
జియా ఖాన్ మృతి కేసులో కొత్త మలుపు
మూడేళ్ల క్రితం బాలీవుడ్ వర్థమాన తార జియాఖాన్ ఆత్మహత్య సంచలనం రేపిన విషయం విదితమే. జియా రాసిన సూసైడ్ నోట్ ద్వారా సూరజ్ పంచోలీతో ప్రేమకు సంబంధించి పలు కీలక వివరాలు వెల్లడయ్యాయి. అయితే జియాది ఆత్మహత్య కాదని, ప్రియుడు సూరజ్ పంచోలీనే ఆమె మరణానికి కారణమంటూ కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. అప్పట్లో పంచోలీని అరెస్ట్ చేసినా, కొన్ని రోజుల విచారణ అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యాడు. ముంబై హై కోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. కాగా రెండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం జియా ఖాన్ ది హత్య కాదు, ఆత్మహత్యేనంటూ సీబీఐ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ జియా తల్లి రబియా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ ఆర్ వి మోరే, జస్టిస్ వి ఎల్ అచిలియాలు సభ్యులుగా ఉన్న బెంచ్ గురువారం ఈ కేసుకు సంబంధించి మధ్యంతర స్టే విధించింది. రెండు వారాల్లో పిటిషనర్ కు సమాధానంగా అఫడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. జియా తల్లి రబియా తన పిటిషన్ లో.. ప్రత్యేక విచారణ బృందానికి(ఎస్ఐటి) అప్పగించాలని, విచారణను ఎప్పటికప్పుడు హైకోర్టు పరిశీలిస్తుండాలని కోరారు. జియా అమెరికా పౌరురాలైనందున కేసు విచారణలో ఎఫ్బిఐ ను కూడా భాగం చేయాలని ఆమె విన్నవించారు. కొంతమంది పోలీసు అధికారులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. జియా మృతి కేసులో సీబీఐ నిజాయితీగా విచారించలేదని, ఒత్తిడులకు తలొగ్గి వీలైనంత త్వరగా కేసును మూసివేయాలని చూస్తున్నారని రబియా ఆరోపించారు. అమెరికా కాన్సులేట్ ను కూడా సీబీఐ తప్పుడు విచారణతో తప్పు దోవ పట్టించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.