జిబౌతికి బయల్దేరిన వీకే సింగ్
న్యూఢిల్లీ: యెమెన్‌లో చిక్కుకుపోయిన 4 వేల మంది భారతీయుల తరలింపు చర్యలను పర్యవేక్షించేందుకు విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ మంగళవారం యెమెన్ పొరుగు దేశమైన జిబౌతికి బయల్దేరారు. తరలింపులో భాగంగా భారత్ ఐదు నౌకలు, నాలుగు విమానాలను రంగంలోకి దించింది. యెమన్లోని ఆడెన్‌లో చిక్కుకున్న 400 మంది భారతీయులను జిబౌతికి తీసుకొచ్చేందుకు నేవీకి చెందిన ఐఎన్ఎస్ సుమిత్ర నౌక యెమెన్ తీరానికి చేరుకుంది. మార్గ మధ్యంలో ఉన్న మరో నాలుగు నౌకలు రెండు మూడు రోజుల్లో అక్కడికి చేరుకోనున్నాయి. ప్రధాని మోదీ సోమవారం సౌదీ అజీజ్ అల్ సాద్‌కు ఫోన్ చేసి, భారతీయుల తరలింపునకు సాయం చేయాలని కోరారు.