Jibran
-
కరోనా పై కమల్ పాట
కరోనాపై పోరాటంలో పాటల ద్వారా స్ఫూర్తి నింపుతున్నారు స్టార్స్. చిరంజీవి, నాగార్జున, సల్మాన్ ఖాన్, మంచు మనోజ్, ఎస్పీబీ, చిత్ర, కీరవాణి, కోటి వంటి వాళ్లు ఆల్రెడీ పాటలను విడుదల చేశారు. తాజాగా కమల్ హాసన్ కూడా కరోనాపై ఓ పాటను ఆలపించారని సమాచారం. సంగీత దర్శకుడు జిబ్రాన్ కంపోజ్ చేసిన ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కలసి పాడారట కమల్ హాసన్. ఈ పాట త్వరలోనే విడుదల కానుందని సమాచారం. -
కాన్స్ చిత్రోత్సవాలకు జిబ్రాన్
కాన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొనడానికి యువ సంగీత దర్శకుడు జిబ్రాన్ రెడీ అవుతున్నారు. వాగై చూడవ చిత్రంతో తన సంగీత పయనాన్ని ప్రారంభించిన ఈయన అనతికాలంలోనే విశ్వనాయకుడు కమలహాసన్ చిత్రానికి సంగీత బాణీలందించే స్థాయికి ఎదిగారు. ఈయన సంగీతాన్ని అందించిన ఉత్తమ విలన్ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా జిబ్రాన్ నిర్మాణ సారథ్యం వహించిన లఘు చిత్రం కాన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపిక కావడం విశేషం. సంగీత దర్శకుడిగా బిజీగా వున్న జిబ్రాన్ తన బాల్య స్నేహితుడు రతీంద్రన్ ప్రసాద్ దర్శకత్వం వహించిన లఘు చిత్రం స్వేయర్ కార్పొరేషన్‌కు నిర్వహణ బాధ్యతలను నిర్వహించడం విశేషం. ఈ చిత్రాన్ని టర్కిష్‌కు చెందిన బసాక్ గ్యాజిలర్ ప్రసాద్, హాకన్ కేంటర్లీ నిర్మించారు. పర్యావరణరంగంపై అక్కర కలిగిన ఒక యువకుడు ఒక కెమికల్ కంపెనీ సీఈవోను హత్య చేయడానికి చేసే ప్రయత్నమే చిత్ర ఇతివృత్తంతో కూడిన ఈ లఘు చిత్రం 30 నిమిషాల నిడివితో ఉంటుందని జిబ్రాన్ తెలిపారు. కాన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జిబ్రాన్ దర్శకుడు రతీంద్రన్ ప్రసాద్ పాల్గొననున్నారు.