jiddu krishna murthy
-
ప్రేమ స్వరూపి
జ్యోతిర్మయం లోకంలోని సమస్తమైన సమస్యలకు ‘ప్రేమ’యే పరి ష్కారమన్నట్లుగా జిడ్డు కృష్ణమూర్తి రాసిన పుస్తకాలు చూసి 1970 ప్రాంతంలో ఆయన బోధపట్ల నాకు కొంత విముఖత్వం ఏర్పడింది. అందుకు కారణం ఆయన ‘ప్రేమ’ అనే పదాన్ని ఎలా వాడుతున్నాడో నాకు అర్థం కాకపోవడం; అటు తర్వాత కొంత కాలానికి గానీ, కృష్ణమూర్తి గారు ‘ప్రేమ’ అనే పదాన్ని ఎలా వాడుకున్నారో అర్థం కాలేదు. 1943 ప్రాంతంలో ఓ పాశ్చాత్య గ్రంథ కర్త, కృష్ణ మూర్తితో ‘ప్రేమ విషయంలో మీ వైఖరి ఏమిటో వివరి స్తారా?’ అని అడిగినప్పుడు, వ్యక్తిగతమైన ప్రేమ అనేది నాకు లేదనే చెప్పవచ్చు. నేనె వరితో కలిసి ఉన్నాననే విష యం అప్రస్తుతం- సొంత తమ్ముడితోనైనా, లేక పూర్తిగా పరాయి మనిషితోనైనా అయి ఉండవచ్చు. ప్రేమానుభూతి నాతో సతతమూ ఉంటూనే ఉంటుంది. నన్ను కలిసిన వారెవరికైనా, ఆ అనుభూతి ప్రసరించకుండా అడ్డుకోలేను’ అన్నాడు. అసలు ఈ ప్రపంచంలో తనని తారసిల్లిన ఏ మనిషినీ తాను అసహ్యించుకున్న సందర్భం కానీ, అతడికేమైనా తనకు నిమిత్తం లేదనుకున్న పరిస్థితి గానీ, ఎన్నడూ ఉదయించలేదా అని మరికాస్త తరచి ప్రశ్నించినప్పుడు, ‘నాకు అయిష్టమైన వాళ్లంటూ ఎవరూ ఉండరండీ. నా ప్రేమను వేరొకరి యెడల చూపించడం నేను కాదు, అని మీరు గ్రహించడం లేదా? నేనేమీ చేస్తూ ఉన్నా, ప్రేమ అలా ఉంటూనే ఉం టుంది; నా చర్మం రంగులాగానే. అందులో మార్పు కానీ, హెచ్చు తగ్గులు కానీ ఉండవు. అందువల్ల నాకు ‘నిమిత్తం లేని వారుగా’ మీరు భావిస్తున్నవారు, ‘నేను ఖాతరు చేయనక్కరలేనివారుగా మీరు భావిస్త్తున్న వారు, నా చుట్టూ మూగి ఉన్నా, ఆ ‘ప్రేమ’ అట్లాగే ఉంటుంది. కానీ నాకీ ‘ఐక్యతాభావం’ కేవలం మానవులతోనే కాదు. వృక్షాలతోనూ, చుట్టూ ఉన్న ప్రపంచంతోనూ, ఈ భావమే ఉంటుంది. భౌతికమైన భేదభావరూపాల గురించి కాదు, నే ప్రస్తావిస్తున్నది. వాస్తవం గురించి మాట్లాడుతున్నాను’ అన్నారు. మరో సందర్భంలో ‘ప్రేమ’ను నిర్వచిస్తూ ‘అసూ యతో కానీ, మమకారంతో కానీ, ప్రేమ కలిసి ఉండ జాలదు. అందువల్ల ఏది ‘ప్రేమ’ కాదో తేల్చుకుంటే, అప్పుడది ‘ప్రేమ’ అవుతుంది. ప్రేమ అంటే ఏమిటి? అని నేనడగాల్సిన పని లేదు. ప్రేమకానిదంతా వదిలించుకుంటే, ప్రేమే మిగులుతుంది’ అన్నాడు. మరో సందర్భంలో ‘ప్రేమ అంటే నా అర్థం, మదిలో ‘వేరు చేయకుండా’ ఉండే గుణమని! అంటే మనిషికీ మనిషికీ జాతి మత కుల ఆర్థిక సామాజిక తారతమ్యాలు పరిగణించకుండా వారిని ఒకటిగా చూడడం. ఈ ప్రపంచంలో యాంత్రికమైన సమస్యలన్నిటికీ యాంత్రిక పరిష్కారాలు ఉంటాయి కానీ మానవ సంబంధమైన సమస్యలన్నిటినీ, కృష్ణమూర్తి గారు చెప్పే ‘ప్రేమ’ (వేరు భావం లేకపోవడం) ఒక్కటే పరిష్కరించగలదు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
అంతరంగం
జీవిత పరమార్థం తెలియాలంటే చుట్టూ ఉన్న ప్రకృతిని ఆరాధించాలి.. కళలను ఆస్వాదించాలి.. సాహిత్యాన్ని అభిమానించాలి.. బాధను అనుభవించాలి.. అర్థం చేసుకోవాలి అంటారు జిడ్డు కృష్ణమూర్తి. ఈ తత్వాన్ని ఒంటబట్టించుకున్నదే ‘అంతరం’. ఈ పేరుతో నగరంలో నేడు ఓ నృత్యనాటక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మహిళల్లో దాగి ఉన్న అపార శక్తిని ఆవిష్కరించే ఈ దృశ్యరూపకం గురించి క్లుప్తంగా... - సాక్షి, సిటీప్లస్ థీమ్.. భారతీయ పురాణాల్లోని శక్తిమంతమైన రంభ, వాసవి, కణ్ణగి, ఆండాళ్ అనే నాలుగు స్త్రీ పాత్రలే ఈ అంతరం పోషించే ముఖ్య భూమికలు. ఈ వనితల ఔన్నత్యాన్ని తమ అభినయ కౌశలంతో అంతే అద్భుతంగా మెప్పించనున్నారు సుహాసినీ మణిరత్నం, యామినీరెడ్డి, గోపికావర్మ, కృతికా సుబ్రహ్మణ్యన్. రంభ, వాసవి, కణ్ణగి, ఆండాళ్ల పౌరాణిక నేపథ్యానికి విశ్లేషణను జోడించి ఆ పాత్రలకు మరింత వన్నెతేనుందీ ప్రదర్శన. వీటికి తోడు శాండ్ ఆర్ట్, తోలుబొమ్మలాట, మైమ్, శిల్పకళా ఇందులో చోటు సంపాదించుకున్నాయి. అంతరం అంటే.. పురాణాల్లోని నాలుగు స్త్రీ పాత్రల ఆంతర్యం, స్వభావాన్ని వివరించడమే ఈ ‘అంతరం’ ఆంతర్యం. ఇది శరీరానికి, మనసుకి ఉన్న దూరాన్ని అన్వేషించేది. శోధించేది. ఈ పురాణ స్త్రీల శక్తిని ‘అంతరం’గా ప్రదర్శించాలన్న ఆలోచన గోపిక వర్మది. కార్యరూపమిచ్చింది కృతిక సుబ్రహ్మణ్యన్. ఎవరు.. ఏమిటి.. నాటకరూపంలో ‘రంభ’గా సుహాసినీ మణిరత్నం అభినయిస్తుంటే.. ‘వాసవి’గా కూచిపూడి నృత్యరూపకాన్ని యామినీరెడ్డి, మోహినీఆట్టంలో గోపికవర్మ ‘కణ్ణగి’గా, భరతనాట్యంలో కృతికసుబ్రహ్మణ్యన్ ‘ఆండాళ్’గా అలరించనున్నారు. కళాభిమానుల అపూర్వ కలయిక ఈ ప్రదర్శన. ఇటు శాస్త్రీయ నృత్యం, అటు సంగీతం, రంగస్థలం, ఆధునిక సాంకేతిక విజ్ఞానం.. ఒకే వేదికపై వీటన్నిటి సమ్మేళనమే ‘అంతరం’ అంటారు ఇందులో భాగస్వామి అయిన యామినీరెడ్డి. నేడు నృత్యనాటక ప్రదర్శన వేదిక: హెచ్ఐసీసీ, హైటెక్‌సిటీ, మాదాపూర్ సమయం: రాత్రి 7 గంటలు నిర్వహణ: హైడొరైట్ ఫౌండేషన్ -
అసంకల్పిత శరణాగతి
‘శరణాగతి అనే విధానం గురించి మీరేమంటారు?’ అని జిడ్డు కృష్ణమూర్తి గారిని 1954లో బొంబాయిలో అడిగినప్పుడు, ‘‘సంకల్ప బలంతో చేసే సమ ర్పణ, శరణాగతి, నిజమైన శరణాగతి కాదం డీ! అది కేవలం తనని తాను విస్మరించడం, ఓ పలాయన సూత్రావలంబన; తనకు తానై భ్రమ కల్పించుకోవడం అవుతుంది. ఏవో కొన్ని పదాలు పునశ్చరణ చేయడంగా రూపొందుతుంది. ఇలా సంకల్పంతో కూడుకున్న శరణు కాక, సంకల్పించని శరణాగతి ఒకటున్నది. ఇది కోరుకు న్నదీ కాదు, అడిగిందీ కాదు. మనసు కోరుకుంటే సిద్ధిం చేది నిజమైన సమర్పణ కాదు. మనసు, తన పూనికతో చేసే పనులన్నీ మనసు కొనసాగింపే; కొనసాగింపంటే ‘కాల’మన్నమాట. కాలం ఆగితే కానీ, కాలాతీతమైన వాస్తవం ప్రత్యక్షమవదు. మనసు, తనంతట తాను సమర్పణ సాధించలేదు. మనసు చేయగలిగిందల్లా నిశ్చలంగా ఉండిపోవడమే, కానీ మనసులో నైరాశ్యంగానీ, ఆశగానీ తారట్లాడితే, ఆ నిశ్చలత్వం సిద్ధించదు. నైరాశ్యాన్ని తిన్నగా చూడాలి. నువ్వే దైనా కోరుకున్నావంటే, అది దక్కకపోతే - ఓ కారు అవనీ, ఒక స్త్రీ అవనీ, దేవుడవనీ - కోరడం, దేనిని కోరినా ఒకటే - అసలలా కోరుకోవడమే నైరాశ్యానికి నాంది. నైరాశ్యమంటే వైఫల్య భావన. నీవు కోరుకున్నది నీకు లభిస్తే తృప్తి చెందుతావు. నువు అనుకున్నది లభిం చకపోతే ‘భగవంతుడికి నన్ను నేను సమర్పించుకోవాలి’ అని అంటావు. కోరిక, బాధను తెస్తుందని నువ్వు స్వయంగా కను గొంటే ఆ ‘చూపే’ కోరికను నెమ్మదింపజేస్తుంది. ఎఱుకే ప్రధానమైనది. నైరాశ్యాన్ని తొలగించడమెలా అనేది కాదు. పరిశుభ్రమైన తెలివి కలిగుండటమంటే, ఈ ఎఱుక కలిగుండటమే. ఈ ఎఱుకలో, ఎంపిక లేదు - ఎంపిక లేని ఎఱుక; మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్ద స్థితిలో ఉన్నదల్లా ఒక్క ‘సత్తా’ మాత్రమే (బీయింగ్). అప్పుడు ఆ వాస్తవం, మనిషిని చకితుణ్ణి చేసే ఆ ‘కాలరహితమైన సృజనాత్మకత ‘ప్రత్యక్షమవుతుంది’. గుస్తావ్ ఫ్లబేర్ అనే ప్రఖ్యాత ఫ్రెంచి రచయిత పూర్వం ‘మేడమ్ బోవరీ’ అనే నవల రాశాడు. ఆ నవల ఆ కాలంలోనూ, ఆ తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చదువరులను ఆకర్షించింది. ఆ నవలపై కురి పించిన వెర్రి అభిమానం రచయితకు చివరకు విసుగు జనింపజేసింది. ఒకింత స్వైరవిహారిణిగా రూపొందిం చిన తన కథానాయకి ‘ఎమ్మా బోవరీ’ పాత్ర, తనకు ఖ్యాతి గడించిందో అపఖ్యాతి గడించిందో తెలియని పరిస్థితి ఉదయించింది. ఫ్ల బేర్ (రచయిత) పెద్ద తనంలో ఒంటరి వాడైపోయాడు; అతడి ప్రవర్తన కూడా వెర్రి మొర్రిగా ఉండేది. ఏదో విధంగా తగినంత ధనం సమకూర్చుకొని ఈ ‘మేడం బోవరీ’ ప్రతులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్ని టినీ క్రయం చేసి అగ్గిపాలు చేయాలనిపించింది; ఇక ఆ పుస్తకం పేరు కూడా మళ్లీ వినకూడదనుకున్నాడు. గ్రంథకర్త ఇలా తలపోస్తూనే ఉన్నాడు. ఆ పుస్తక మేమో పునః ముద్రణలు పొందుతూనే ఉన్నది. ఒకసారి ఒక ప్రెస్ రిపోర్టర్, గ్రంథకర్త ఫ్లబేర్ను, ‘నిజ జీవితంలో కథానాయకి ఎమ్మా బోవరీ ఎవరండీ?’ అని అడిగాడు. చిరాకుపడుతూ, గ్రంథకర్త ఫ్లబేర్ ‘నేను ఆ ఎమ్మా బోవ రీని’ అని సమాధానమిచ్చాడు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్