అసంకల్పిత శరణాగతి | Surrender is not real of Surrendering, says jiddu Krishna Murthy | Sakshi
Sakshi News home page

అసంకల్పిత శరణాగతి

Published Fri, Jan 31 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM

అసంకల్పిత శరణాగతి

అసంకల్పిత శరణాగతి

‘శరణాగతి అనే విధానం గురించి మీరేమంటారు?’ అని జిడ్డు కృష్ణమూర్తి గారిని 1954లో బొంబాయిలో అడిగినప్పుడు, ‘‘సంకల్ప బలంతో చేసే సమ ర్పణ, శరణాగతి, నిజమైన శరణాగతి కాదం డీ! అది కేవలం తనని తాను విస్మరించడం, ఓ పలాయన సూత్రావలంబన; తనకు తానై భ్రమ కల్పించుకోవడం అవుతుంది. ఏవో కొన్ని పదాలు పునశ్చరణ చేయడంగా రూపొందుతుంది.
 
 ఇలా సంకల్పంతో కూడుకున్న శరణు కాక, సంకల్పించని శరణాగతి ఒకటున్నది. ఇది కోరుకు న్నదీ కాదు, అడిగిందీ కాదు. మనసు కోరుకుంటే సిద్ధిం చేది నిజమైన సమర్పణ కాదు. మనసు, తన పూనికతో చేసే పనులన్నీ మనసు కొనసాగింపే; కొనసాగింపంటే ‘కాల’మన్నమాట. కాలం ఆగితే కానీ, కాలాతీతమైన వాస్తవం ప్రత్యక్షమవదు. మనసు, తనంతట తాను సమర్పణ సాధించలేదు. మనసు చేయగలిగిందల్లా నిశ్చలంగా ఉండిపోవడమే, కానీ మనసులో నైరాశ్యంగానీ, ఆశగానీ తారట్లాడితే, ఆ నిశ్చలత్వం సిద్ధించదు. నైరాశ్యాన్ని తిన్నగా చూడాలి. నువ్వే దైనా కోరుకున్నావంటే, అది దక్కకపోతే - ఓ కారు అవనీ, ఒక స్త్రీ అవనీ, దేవుడవనీ - కోరడం, దేనిని కోరినా ఒకటే - అసలలా కోరుకోవడమే నైరాశ్యానికి నాంది. నైరాశ్యమంటే వైఫల్య భావన. నీవు కోరుకున్నది నీకు లభిస్తే తృప్తి చెందుతావు. నువు అనుకున్నది లభిం చకపోతే ‘భగవంతుడికి నన్ను నేను సమర్పించుకోవాలి’ అని అంటావు.
 
 కోరిక, బాధను తెస్తుందని నువ్వు స్వయంగా కను గొంటే ఆ ‘చూపే’ కోరికను నెమ్మదింపజేస్తుంది. ఎఱుకే ప్రధానమైనది. నైరాశ్యాన్ని తొలగించడమెలా అనేది కాదు. పరిశుభ్రమైన తెలివి కలిగుండటమంటే, ఈ ఎఱుక కలిగుండటమే. ఈ ఎఱుకలో, ఎంపిక లేదు - ఎంపిక లేని ఎఱుక; మనసు నిశ్శబ్దంగా ఉంటుంది.
 ఆ నిశ్శబ్ద స్థితిలో ఉన్నదల్లా ఒక్క ‘సత్తా’ మాత్రమే (బీయింగ్). అప్పుడు ఆ వాస్తవం, మనిషిని చకితుణ్ణి చేసే ఆ ‘కాలరహితమైన సృజనాత్మకత ‘ప్రత్యక్షమవుతుంది’.
 
 గుస్తావ్ ఫ్లబేర్ అనే ప్రఖ్యాత ఫ్రెంచి రచయిత పూర్వం ‘మేడమ్ బోవరీ’ అనే నవల రాశాడు. ఆ నవల ఆ కాలంలోనూ, ఆ తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చదువరులను ఆకర్షించింది. ఆ నవలపై కురి పించిన వెర్రి అభిమానం రచయితకు చివరకు విసుగు జనింపజేసింది. ఒకింత స్వైరవిహారిణిగా రూపొందిం చిన తన కథానాయకి ‘ఎమ్మా బోవరీ’ పాత్ర, తనకు ఖ్యాతి గడించిందో అపఖ్యాతి గడించిందో తెలియని పరిస్థితి ఉదయించింది. ఫ్ల బేర్ (రచయిత) పెద్ద తనంలో ఒంటరి వాడైపోయాడు; అతడి ప్రవర్తన కూడా వెర్రి మొర్రిగా ఉండేది. ఏదో విధంగా తగినంత ధనం సమకూర్చుకొని ఈ ‘మేడం బోవరీ’ ప్రతులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్ని టినీ క్రయం చేసి అగ్గిపాలు చేయాలనిపించింది; ఇక ఆ పుస్తకం పేరు కూడా మళ్లీ వినకూడదనుకున్నాడు.
 
 గ్రంథకర్త ఇలా తలపోస్తూనే ఉన్నాడు. ఆ పుస్తక మేమో పునః ముద్రణలు పొందుతూనే ఉన్నది. ఒకసారి ఒక ప్రెస్ రిపోర్టర్, గ్రంథకర్త ఫ్లబేర్‌ను, ‘నిజ జీవితంలో కథానాయకి ఎమ్మా బోవరీ ఎవరండీ?’ అని అడిగాడు. చిరాకుపడుతూ, గ్రంథకర్త ఫ్లబేర్ ‘నేను ఆ ఎమ్మా బోవ రీని’ అని సమాధానమిచ్చాడు.
- నీలంరాజు లక్ష్మీప్రసాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement