jiggery
-
డీల్‌కు వచ్చి.. కిడ్నాప్‌నకు గురై..
కలకలం సృష్టించిన బెల్లం వ్యాపారి అపహరణ హసన్‌పర్తి : నిజామాబాద్ జిల్లాకు చెందిన బెల్లం వ్యాపారి కిడ్నాప్‌నకు గురి కావడం జిల్లాలో కలకలం సృష్టిం చింది. తన దందాలో భాగంగా ఓ వ్యక్తితో బిజినెస్ డీల్ కుదుర్చుకు నేందుకు వచ్చి అనూ హ్యంగా కిడ్నాప్ కావడం చర్చనీయాం శమైంది. నిమాజాబాద్ జిల్లా బిక్కనూర్‌కు చెందిన బెల్లం వ్యాపారి శ్యామల భరత్‌కుమార్‌ను నమ్మించి, ఇక్కడికి రప్పించి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. భరత్‌కుమార్ వద్ద పనిచేస్తున్న గుమస్తాతోనే హసన్పర్తికి చెందిన ఓ వ్యక్తి బెల్లం డీలింగ్ కుదర్చుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ గుమస్తా తన యజమానికి వద్ద ప్రస్తావించాడు. రెండు లారీల బెల్లం విక్రయానికి రావడంతో సదరు యజమాని మాట్లాడడానికి హసన్పర్తికి వచ్చాడు. కానీ మాట్లా డేందుకు వెళ్లిన భరత్ కుమార్ ఫోన్ నుంచి అతడి భార్యకు రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరింపు ఫోన్ కాల్ రావ డంతో విషయం బయటికి వచ్చింది. కాగా ఈ ఘటనకు పాల్పడిన కిడ్నాపర్ ఇటీవల ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవించాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పోలీసుల విచారణ.. వ్యాపారి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాజీపేట ఏసీపీ జనార్దన్, సీఐ రవికుమార్ వివిధ కోణాల్లో విచారణ ప్రారంభించారు. కాగా, కారు డ్రైవర్‌తోపాటు గుమస్తాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
30 క్వింటాళ్ల బెల్లం పట్టివేత
కురవి : డీసీఎం వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 30 క్వింటా ళ్ల నల్లబెల్లాన్ని ఎక్సైజ్ పోలీసులు కురవిలో శనివారం తెల్లవారుజామున స్వాధీ నం చేసుకున్నారు. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకా రం.. మానుకోట డీఎస్పీ రాజమహేంద్రనాయక్ ఇచ్చిన సమాచారంతో కురవిలోని నేరడ క్రాస్‌రోడ్‌లో తెల్లవారుజామున పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈక్రమంలో ఖమ్మం నుంచి మహబూబాబాద్ మండలంలోని మల్యాలకు వెళ్తున్న డీసీఎం వాహనంలో 30 క్వింటాళ్ల నల్లబెల్లం, 50 కేజీల పటికను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న వ్యాపారి, మల్యాలకు చెందిన పుల్లూరి నాగేశ్వర్రావు, డీసీఎం డ్రైవర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రానికి చెందిన నిసార్ అహ్మద్‌లను అరెస్టు చేశారు.