సిరియాలో 'సెక్స్ జిహాద్'!
తమ దేశ మహిళలు సిరియా వెళ్లి 'సెక్స్ జిహాద్'గా మారి డబ్బులు సంపాదిస్తున్నారని ట్యునీసియా ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి లొట్ఫి బెన్ జెడొవ్ వెల్లడించారు. సిరియా ప్రభుత్వంపై పోరాడుతున్న ఇస్లామిక్ ఉద్యమకారులకు లైంగిక సుఖం అందించడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. 20, 30, 100 మంది తీవ్రవాదులతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారని జాతీయ అసెంబ్లీకి తెలిపారు.
ఈ విధంగా లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్న మహిళలు జిహాద్ అల్-నిఖా(లైంగిక ధర్మ యుద్ధం-అరబిలో) పేరుతో అక్కడ ఉంటున్నారని వెల్లడించారు. గర్భం ధరించిన తర్వాత స్వదేశానికి తిరిగి వస్తున్నారని తమ ఎంపీలకు లొట్ఫి బెన్ జెడొవ్ తెలిపారు. అయితే ఎంత మంది ట్యునీసియా మహిళలు ఈ విధంగా తిరిగొచ్చారనేది ఆయన వెల్లడించలేదు. వీరు వందల సంఖ్యలో ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది.