ఘనంగా ఈద్ వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: ఈద్‌ను పురస్కరించుకుని రాజధాని నగరంలోని అన్ని మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో పాత ఢిల్లీ పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం వేలాదిగా తరలివచ్చిన ముస్లింలతో జామా మసీద్ పరిసరాలు సంద డి సందడిగా కనిపించాయి. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు. ప్రార్థనల్లో పాల్గొన్న చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెల్లటి దుస్తుల్లో ఉన్న ముస్లింలు వేలాదిగా ఒకచోట చేరి ప్రార్థనలు చేయడంతో పాతబస్తీ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రార్థనల అనంతరం పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
పత్యేక ప్రార్థనలతో ఢిల్లీలోని జామా మసీద్‌తోపాటు ఫిరోద్షా కోట్లా మసీద్, సప్దర్‌జంగ్ మసీద్, ఫతేపురి మసీద్, దరియాగంజ్‌లోని ఘటామసీద్, ఢిల్లీగేట్ సమీపంలోని జీన్వాలీ మసీద్, కశ్మీరీగేట్‌లోని షియామసీద్లు కిటకిటలాడాయి. ప్రార్థనల అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన షీర్(రంజాన్ప్రత్యేక వంట కం)రుచులను బంధుమిత్రులతో కలిసి ఆస్వాదించారు. వీటితోపాటు చికెన్ కుర్మా, మటన్ తది తర వంటకాలతో సామూహిక భోజనాలు చేశారు. ‘అందరికి మంచి జరగాలని, దేశంలో శాంతి చేకూరాలని, దేశంలోని అందరికి తినడానికి తిండి దొరకాలని’ కోరుకున్నామని ఏపీ భవన్ ఉద్యోగి గౌస్మహ్మద్ తెలిపారు.
వరుణుడూ పాల్గొన్నాడు...
నగరంలో శుక్రవారం జరుపుకున్న రంజాన్ వేడుకల్లో వరుణుడూ పాల్గొన్నాడు. ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా అనిపించినా కాసేపటికే ఆకాశం మేఘావృతమైంది. అప్పటికే ప్రత్యేక ప్రార్థనల కోసం ముస్లింలు మసీదులకు చేరుకున్నారు. సరిగ్గా ప్రార్థనలు ప్రారంభమవుతాయనుకునే సమయంలోనే చిరుజల్లులతో నగరవాసులను పలకరిం చాడు. అయితే జోరువాన కాకపోవడంతో తుంపరతుంపరలుగా పడుతున్న వానలోనే నగరవాసులు ఈద్‌ను జరుపుకున్నారు. కురుస్తున్న జల్లులను అల్లా ఆశీర్వాదంగా కొందరు అభివర్ణించారు. పిల్లలు, పెద్దలు కూడా వానను ఆస్వాదించారు.