జిప్ జిమ్మిక్స్
వారం వారం ఎన్నో రకాల జ్యుయెలరీ మేకింగ్‌ను చూస్తున్నాం... ఈసారి జిప్స్తో జ్యుయెలరీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం... అవునండీ.. జిప్స్ అంటే అమ్మాయిల డ్రెస్సులకు, అబ్బాయి ప్యాంట్ షర్ట్స్‌కు ఉండేవే... వింతగా అనిపిస్తున్నా అది నిజమండీ. ప్రస్తుతం మార్కెట్లో రంగురంగుల జిప్స్‌ను విడిగా అమ్ముతున్న వాటితో కానీ ఇంట్లో పాతబడిన డ్రెస్సులకున్న జిప్స్తో కానీ ఈ జ్యుయెలరీని తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే...
కావలసినవి: జిప్లేసులు, జంప్రింగ్ చెయిన్స్, బీడ్స్, బ్రేస్లెట్ హుక్స్, ఇయర్రింగ్ హుక్స్, స్టడ్ పిన్స్, గ్లూ, కత్తెర
తయారీ: ముందుగా బ్రేస్లెట్ తయారీకి రెండు జిప్లేస్లను తీసుకొని వాటికి ఇరువైపులా ఉన్న క్లాత్‌కు గ్లూ పూయాలి. ఇప్పుడు ఒకదానికి రెండువైపులా రెండు జంప్రింగ్ చెయిన్స్‌ను అతికించాలి. మరోదానికి బీడ్స్ అతికించాలి.
అవి రెండూ ఆరాక... వాటి చివర్లకు హుక్స్ను తగిలిస్తే సరి.. ఎంతో ఫ్యాషన్‌గా కనిపించే బ్రేస్లెట్స్ రెడీ. ఈ బ్రేస్లెట్లను జీన్స్ మీదకు పెట్టుకుంటే అదిరిపోతుంది. జిప్లేస్కున్న క్లాత్ కట్ చేసి పూసలు అతికిస్తే నెక్లేస్ రెడీ. అలాగే జిప్ హ్యాండిల్స్‌కు ఇయర్రింగ్ హుక్స్, స్టడ్ పిన్స్‌ను తగిలిస్తే అవీ రెడీ అయినట్టే. అంతేకాకుండా జిప్ హ్యాండిల్స్‌ను జంపరింగ్స్తో జాయిన్ చేస్తే చెయిన్ తయారవుతుంది.