ఆ‘పాత’మధురం.. నేటికీ మరువం
రాజమహేంద్రవరం కల్చరల్ :
నటుడు, గాయకుడు శ్రీపాద జిత్ మోహ¯ŒS మిత్రా ఆర్కెస్ట్రా 47వ వార్షికోత్సవం ఆదివారం ఆనం రోటరీహాలులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిత్ మోహ¯ŒSమిత్రా, ఇతర గాయనీగాయకులు 1957లో విడుదలైన 17 హిందీ, తెలుగు సినిమాల్లోని గీతాలను ఆలపించారు. సినీవిజ్ఞాన విశారద ఎస్వీ రామారావు గీతాలనేపథ్యాన్ని వివరించారు. ‘మాయాబజారు, పాండురంగమహాత్మ్యం, సువర్ణసుందరి, తోడికోడళ్లు, సారంగధర, భాగ్యరేఖ, వినాయకచవితి, దొంగల్లో దొర, ఎమ్మెల్యే తెలుగు సినిమాలతో పాటు హిందీగీతాలను వినిపించారు.
15సార్లు మాయాబజార్ నిర్మాణం..
భారతీయ భాషల్లో 15 సార్లు మాయాబజారు నిర్మించారని సినీ విజ్ఞాన విశారద ఎస్వీ రామారావు తెలిపారు. ‘‘మహాభారతంలో మాయాబజారు కథ ఎక్కడా లేదు. ఇది పూర్తిగా కల్పితగాథ. ఈ సినిమాలో పాండవులు ఎక్కడా కనపడకపోయినా వారి ప్రస్తావన అడుగడునా వినవస్తుంది. మహానటి సావిత్రి శశిరేఖ పాత్ర కోసం, ఎస్వీఆర్ ఘటోత్కచుడి పాత్రకోసమే పుట్టారా అనిపిస్తారు. ఇప్పటివరకు ఓ సర్వే భారతదేశంలో 60 వేల సినిమాలు నిర్మాణమయ్యాయని తేల్చింది. అధిక సంఖ్యాకులు వీటిలో మాయాబజారు ఉత్తమ చిత్రమని పేర్కొన్నారు.’’