ఎంపీ కవితకు అస్వస్థత
రాయికల్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యూరు. సోమవారం కరీంనగర్ జిల్లా రారుుకల్లో చిన్న జీయర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ప్రజలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కళ్లు తిరగడంతో కవిత సభాప్రాంగణం నుంచి వెళ్లిపోయి వాంతి చేసుకున్నారు. 15 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకొని యధావిధిగా సభాప్రాంగణానికి వచ్చి వేదికపై కూర్చున్నారు. ప్రయాణం వల్లనే కవిత అస్వస్థతకు గురైనట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు.