jnnurm scheme
-
ఇళ్ల కోసం బారులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. బడుగుల సొంతిం టి కల సాకారమవుతోంది. జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం), రాజీవ్ గృహకల్ప, వాంబే పథకాల కింద జిల్లా యంత్రాంగం ఫ్లాట్లను కేటాయిస్తోంది. ఈ మేరకు ఇదివరకే దరఖాస్తు చేసుకున్నవారికి అవకాశం కల్పిస్తోంది. జిల్లావ్యాప్తంగా 12 చోట్ల నిర్మించిన కాలనీల్లోఖాళీగా ఉన్న 1900 ఫ్లాట్లను కేటాయించేందుకు దరఖాస్తుదారులను ఆహ్వానించింది. దీంతో శనివారం గడువు ముగిసే సమయానికి 1,366 మంది మొదటి విడతగా డిమాండ్ డ్రాఫ్ట్ రూపేణా రూ.45,011 చెల్లించారు. డీడీలు చెల్లించేందుకు ఈ పథకాల కింద సుమారు 26వేల మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ తొలి వాయిదా కట్టడానికి ముందుకు రాలేదు. దీంతో డబ్బు చెల్లించినవారికి దాదాపుగా ఫ్లాట్ ఖాయమైనట్లే. అయితే, మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతితో బ్యాంకులకు సెలవు రావడంతో డీడీలు తీయలేకపోయామని పలువురు లబ్ధిదారులు వాపోయారు. ఫ్లాట్ల ఖాళీ ల నేపథ్యంలో వీరికి మరో అవకాశం కల్పించే అం శాన్ని జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది. ఫ్లాట్ల ఖాళీల కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ పద్ధతిన కేటాయించి.. మిగతా వారికి డీడీలు వాపస్ ఇవ్వాలని యంత్రాంగం యోచిస్తోంది. -
మహానేతను మరిపించాలని!
సాక్షి, అమరావతి బ్యూరో : పేదలకు గూడు కల్పించాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి తలచారు. నగరంలోని అజిత్‌సింగ్‌నగర్‌లో జెఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా 2008లో ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన అకాల మరణంతో ఇళ్ల నిర్మాణం అర్థంతరంగా ఆగిపోయింది. వైఎస్సార్ సీపీ ఒత్తిడితో టీడీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని కొనసాగించింది. ఈనెల 15వ తేదీలోపు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పేదల గూడికి పునాదివేసి ప్రారంభించిన మహానేత వైఎస్సార్ పేరు మాత్రం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలివ్వడంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్త మవుతుంది. పేదలకు గూడు కోసం విజయవాడలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. రూ.156 కోట్ల వ్యయంతో జీఫ్లస్–4 భవన నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమైన తర్వాత ఆయన ఆకాల మృతితో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అనంతరం వచ్చిన పాలకులు వీటిని పట్టించుకోకపోవటంతో పదేళ్లుగా అపార్టుమెంట్ భవనాలు మొండి గోడలుగా మిగిలిపోయాయి. 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ నాలుగేళ్లుగా శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని గురించి పట్టించుకోకపోయేసరికి వైఎస్సార్ సీపీ అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావటంతో మూడు నెలల కిందట ఇళ్ల నిర్మాణాలను పునఃప్రారంభించారు. 32ప్లాట్లు ఒక బ్లాక్‌గా, మొ త్తం 34బ్లాకులు నిర్మాణాలు జరుగుతున్నా యి. ఇప్పటికి 24 బ్లాకుల్లో పనులు దాదాపు పూర్తికావచ్చాయి. 24 బ్లాకులకు 768 లబ్ధిదారులకు అలాట్మెంట్ లెటర్లు సిద్ధమవుతుండగా మిగిలిన బ్లాకులకు మరో మూడు నెలల్లో పూర్తిస్థాయి పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. హౌసింగ్‌కాలనీలో ఉండే వసతులు 275 చదరపు అడుగుల విస్తీర్ణంలో సింగిల్బెడ్రూం, హాలు, కిచెన్, టాయిలెట్లు ఉంటాయి. కిచెన్, టాయిలెట్లలో ప్లాస్టరింగ్ స్థానంలో టైల్స్ వేస్తున్నారు. బ్లాక్–బ్లాక్ మధ్యలో ఖాళీ ప్రదేశాన్ని కాంక్రీట్‌తో పూర్తిచేసి, కాలనీలో యూజీడీ, తాగునీరు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేస్తున్నారు. ఓపె న్ డ్రైయిన్ లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. లబ్ధిదారులు నిర్వాసితులేనా..?. కాల్వకట్టలపై, రోడ్లు విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులను లబ్ధిదారులుగా గుర్తించి వారికి అలాట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. పుష్కరాల సమయంలో కృష్ణలంక, రాణిగారితోట, భవానీపురం తదితర ప్రాంతాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉండేవారు గూడును కోల్పోయారు. అధికారులు పద్మావతి ఘాట్‌లోనే సుమారు 4000 కుటుంబాలను గుర్తించగా, భవానీపురం తదితర ప్రాంతాల్లో మరో 4000 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. పద్మావతిఘాట్ నిర్వాసితుల్లో సుమారు 2500, భవానీపురంలోని పున్నమిఘాట్ నిర్వాసితుల్లో 1500 మందికి గతంలో జక్కంపూడిలోని జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో ఇళ్లు కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో మిగిలిన నిర్వాసితులకు ఇళ్లు కేటాయించాల్సి ఉండగా టీడీపీ అనుచరులకు, కార్యకర్తలకు మాత్రమే కేటాయింపులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అజిత్‌సింగ్‌నగర్‌లోని జెఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో 300 మంది కూడా అసలైన నిర్వాసితులు లేరని వారు పేర్కొంటున్నారు. వైఎస్సార్ పేరులేకుండా.. పేదవాడికి గూడు కల్పించాలనే తలంపుతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని అధికారపార్టీ నాయకుల అండదండలతో కొంతమంది ఆకతా యిలు ధ్వంసం చేశారు. ఈనెల 15వ తేదీన జరిగే ప్రారంభోత్సవంలో కూడా జెఎన్ఎన్యూఆర్యూఎం పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయటాని కి కృషిచేసిన వైఎస్సార్ తలంపులేకుండా జాగ్రత్తలు పాటించాలని పాలకులు అధికారులకు హు కుం జారీ చేశారు. ఎక్కడా వైఎస్సార్ ప్రస్తావన లేకుండా జరగాలని, తామే ప్రాజెక్టును పూర్తిచేశామనే ప్రచారాన్ని తీసుకురావాలని ఆదేశించారు. కేటాయింపులు జరగలేదు అజిత్‌సింగ్‌నగర్‌లోని జెఎన్ఎన్యూఆర్యూఎం హౌసింగ్ కాలనీలో ఇంతవరకు లబ్ధిదారులకు కేటాయింపులు జరగలేదు. కాల్వకట్టలు, రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి కేటాయింపులు జరుపుతున్నాం. మొదటి విడతగా 760మందికి అలా ట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మిగిలిన పనులను త్వరలోనే పూర్తిచేస్తాం.జె.వి.రామకృష్ణ, ప్రాజెక్టు ఎస్ఈ,కార్పొరేషన్, విజయవాడ -
మరిన్ని పట్టణాలకు సిటీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు కొత్త బస్సులు రానున్నాయి. యూపీఏ హయాంలో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలకు ఎన్డీయే ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. లక్ష నుంచి మూడు లక్షల జనాభా ఉన్న పట్టణాలను జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో చేరుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా ఈ పథకం కింద కరీంనగర్ 70, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లకు 30 చొప్పున కొత్త బస్సులను మంజూరు చేసింది. ఈ మేరకు సిటీ బస్సులు కొనేందుకు వీలుగా నిధులు మంజూరు చేసింది. దాదాపు ఆరు నెలల క్రితమే సూత్రప్రాయ అంగీకారం రావటంతో.. నిధులెలాగూ వస్తాయన్న ఉద్దేశంతో టీఎస్ ఆర్టీసీ ముందుగానే కొన్ని బస్సులు కొనుగోలు చేసి కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ పట్టణాలకు కేటాయించింది. ఆరు పట్టణాలకు వెసులుబాటు... ఈ ఆర్థిక సంవత్సరంతో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం ముగిసి ‘అమృత్’ పథకం పూర్తిస్థాయిలో పట్టాలెక్కబోతున్నందున నిజామాబాద్, సిద్దిపేట, నల్లగొండ లాంటి కొత్త పట్టణాలకు ప్రతిపాదనలు త్వరగా పంపాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీ అధికారులు త్వరలో సర్వే చేయనున్నట్టు తెలిసింది. ఆ బస్సులు మాకొద్దు... గతంలో ఈ పథకం కింద హైదరాబాద్‌కు కేంద్రం మంజూరు చేసిన బస్సుల బాడీ సరిగా లేకపోవటంతో తరచూ మరమ్మతులు చేయిస్తేగాని అవి నడవని దుస్థితి ఉండటం విశేషం. దీంతో ఈసారి ఆ బస్సులొద్దని, నిధులిస్తే అనుకూలంగా ఉండే బస్సులు సమకూర్చుకుంటామంటూ రాష్ట్రప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం సమ్మతించింది. -
‘పిటీ’ బస్ డిపో
కరీంనగర్లో సిటీ బస్ డిపో ఏర్పాటు, నగర ప్రజలకు అందుబాటులో ఉండేలా 70 సిటీ బస్సుల కొనుగోలుకు గ్రహణం పట్టింది. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం మంజూరీ చేసిన రూ.25.85 కోట్ల ప్రాజెక్టు కాగితాల్లోనే నిలిచిపోయింది. రాష్ట్ర విభజన పరిణామాలు, కొత్త ప్రభుత్వాల ఏర్పాటుతో ఆర్టీసీ అధికారులు ఈ ఫైల్‌ను పక్కన పెట్టారు. సిటీ బస్ డిపోకు అవసరమైన స్థలం కేటాయించి ప్రతిపాదనలు పంపించటంతోపాటు బస్సులు కొనుగోలు చేయాల్సిన ఆర్టీసీ యంత్రాంగం అంతగా దృష్టి సారించకపోవటంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదలటం లేదు. కొత్తగా కొలువుదీరిన ప్రజా ప్రతినిధులు అటువైపు దృష్టి సారించకపోతే.. సిటీ బస్ డిపో ఏర్పాటు కాగితాల్లోనే అటకెక్కే ప్రమాదముంది. - రూ.25.85 కోట్ల ప్రాజెక్టు - ఆర్టీసీ ఫైళ్లలోనే హాల్టింగ్ విభజన తర్వాత నత్తనడక - బస్సుల కొనుగోలు ఎప్పుడు? - ప్రజాప్రతినిధులు పట్టించుకోకుంటే అంతే.. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రంగా కరీంనగర్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే నగర జనాభా ఇంచుమించుగా మూడు లక్షలకు చేరింది. దీనికి తోడు వివిధ అవసరాలపై ప్రతి రోజు దాదాపు 20 లక్షల మంది ప్రయాణికులు జిల్లా కేంద్రానికి వచ్చి వెళుతున్నట్లు అధికారుల అంచనా. ప్రస్తుతం నగరంతో పాటు కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని పరిసర గ్రామాలు చుట్టుముట్టేలా ఆరు లోకల్ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. కానీ.. సరైన ప్రచారం, సిటీ బస్ స్టాపులు, సమాచార సూచికలు, నిర్ణీత వేళాపాళా లేకపోవటంతో ఇవన్నీ నష్టాల్లోనే నడుస్తున్నాయి. అదే సమయంలో ఆటోలు, ప్రైవేటు వాహనాల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. జిల్లా కేంద్రం రోజు రోజుకు విస్తరిస్తుండటంతో రవాణా సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం తప్పనిసరిగా మారింది. శివారు ప్రాంతాలను కలుపుతూ.. సిటీ బస్సులు నడిపితే నగర ప్రజలకు, విద్య, ఉద్యోగాలు, ఇతరత్రా అవసరాలకు నిత్యం జిల్లా కేంద్రానికి వచ్చే విద్యార్థులు, ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదే క్రమంలో జెఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా రాష్ట్రంలోని పలు చిన్న పట్టణాలకు సిటీ బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ఎండీ కేంద్రానికి సమగ్ర నివేదికలు సమర్పించారు. వరంగల్, నెల్లూరు, కర్నూలు, నిజామాబాద్, నంద్యాల, కరీంనగర్, రామగుండం, ఒంగోలు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయనగరం పట్టణాలకు కలిపి మొత్తం 12 ప్రతిపాదనలు పంపించారు. ప్రతిపాదనలు పరిశీలనలో ఉండగానే అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్‌ను కలిసి కరీంనగర్‌కు ప్రాధాన్యమివ్వాలని ఒత్తిడి చేశారు. ఎట్టకేలకు కరీంనగర్‌కు బస్‌డిపో ఏర్పాటు, 70 బస్సుల కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీ అధికారులు రూ.26.35 కోట్లు ప్రతిపాదిస్తే.. రూ.25.85 కోట్లకు మంజూరీ లభించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 13 పట్టణాలకు మంజూరు ఇవ్వగా రాష్ట్రంలో కేవలం కరీంనగర్‌కు మాత్రమే ఈ అవకాశం దక్కింది. రాష్ట్రం నుంచి పంపిన ప్రతిపాదనల్లో మన జిల్లాకు మాత్రమే ఈ ప్రాజెక్టు మంజూరైంది. దీన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ప్రజాప్రతినిధులు చొరవ చూపితే.. నగర వాసులకు సిటీ బస్సుల కల నెరవేరుతుంది.