పరీక్షల్లో పాస్ చేయిస్తానని మోసం
మలేసియా టౌన్ షిప్: పరీక్షల్లో తప్పిన ఇంజినీరింగ్ విద్యార్థులను పాస్ చేయిస్తానని డబ్బు తీసుకొని మోసం చేస్తున్న జేఎన్టీయూ ఉద్యోగి ఒకరిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. సబ్జెక్టుకు రూ. 20 వేలు చొప్పున 22 మంది విద్యార్థుల వద్ద నిందితుడు డబ్బు వసూలు చేసినట్టు పోలీసుల వి చారణలో తేలింది. ఇన్ స్పెక్టర్ కుషాల్కర్ కథనం ప్రకారం... టోలిచౌకీకి చెందిన ఇంజినీరింగ్ విద్యా ర్థి అబూనాం అహ్మద్, అతని మిత్రుడు ఉమర్ హుస్సేన్ లకు ఆరు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి.
జేఎన్టీ యూహెచ్లోని బుక్ బైండింగ్ డిపార్టుమెంట్లో పనిచేస్తున్న ఫ్రాన్సిస్ అనే ఉద్యోగి తనకు డబ్బు చెల్లిస్తే తప్పిన సబ్జెక్టులను పాస్ చేయిస్తానని నమ్మబలికాడు. సబ్జెక్టుకు రూ.20 వేల చొప్పున ఇద్దరి నుంచి మొత్తం రూ.1.20 లక్షలు తీసుకున్నాడు. ఫ్రాన్సిస్ వారిని పాస్ చేయించకపోవడంతో డబ్బు లు తిరిగి ఇచ్చేయని విద్యార్థులు కోరగా... ‘ఇచ్చేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని అన్నాడు. దీంతో అబూనాం అహ్మద్ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయగా... దర్యా ప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు ఫ్రాన్సిస్‌ను అ దుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు.
22 మంది విద్యార్థుల వద్ద నుంచి సబ్జెక్టుకు రూ.20 వేల చొప్పున మొత్తం రూ.10.50 లక్షలు వసూలు చేసినట్లు అం గీకరించాడు. అయితే, ఇతని బాధితులు వందల సంఖ్యలో ఉన్నారని, పరువుపోతుందని చాలా మంది బయటపడటంలేదని విద్యార్థులంటున్నా రు. ఈ వ్యహారంలో నిందితుడు ఫ్రాన్సిస్‌కు యూనివర్సిటీలోని పలువురి అధికారుల సహకారం కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉంది.