Job Hiring Process
-
గుడ్‌న్యూస్ : మళ్లీ కొలువుల కళ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్నా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ముగిసిన అనంతరం దిగ్గజ కంపెనీలు నియామకాలు చేపడతాయని ప్రముఖ హైరింగ్ కంపెనీ వెల్లడించింది. జూన్, జూలైలో ఉద్యోగ నియామకాల కోసం పలు కంపెనీలు తమతో సంప్రదింపులు చేపట్టాయని, ఇక ఉద్యోగాల కోతల కాలం ముగిసినట్టేనని హైరింగ్ సంస్థ క్వెస్ కార్ప్ చీఫ్ అజిత్ ఇసాక్ వెల్లడించారు. ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్ వంటి పలు రంగాల్లో నియామకాలు తిరిగి ఊపందుకుంటాయని పేర్కొన్నారు. బహుళజాతి కంపెనీలు, భారత దిగ్గజ సంస్థలు నియామక ప్రణాళికల్లో 70 శాతం మేర రిక్రూట్‌మెంట్‌ను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే ఆయా సంస్ధలు భారత శ్రామిక శక్తిలో కేవలం 15 శాతానికే పరిమితమవడంతో ఉపాధిపై పూర్ధిస్తాయి అంచనాకు రాలేమని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ భారతం నుంచి నగరాలకు వలస వచ్చిన కార్మికులు, అసంఘటిత రంగ ఉద్యోగులు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలువరు కార్మికులు పెద్దసంఖ్యలో వాహనాలు, రైళ్లతో పాటు మరికొందరు కాలిబాటనే స్వస్ధలాలకు మళ్లారు. వీరంతా లాక్డౌన్ అనంతరం తిరిగి నగరాలకు చేరడం పనిలో కుదురుకోవడం కొంత సంక్లిష్టమేనని చెబుతున్నారు. చదవండి : కరోనాపై విచారణకు చైనా సై మహానగరాల్లో డిమాండ్‌ను పునరుద్ధరించడం, వలస కూలీలను తిరిగి పనులకు రప్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టవచ్చని క్వెస్ కార్ప్ చీఫ్ ఇసాక్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కల్పించేందుకు పలు రాష్ట్రాలు యాజమాన్యాలు ఇష్టానుసారం ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు చేపట్టేలా కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం సరికాదని ఆయన అన్నారు. కార్మికులు వేధింపులకు లోనుకాకుండా సమతూకంతో కూడిన మెరుగైన కార్మిక సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. -
సింగరేణిలో జాబ్ మేళా
వేగంగా ఉద్యోగ నియామకాలు * 14, 21 తేదీల్లో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగాలకు పరీక్ష * బదిలీ వర్కర్లకు వారంలో రీ-నోటిఫికేషన్ గోదావరిఖని: సింగరేణి సంస్థలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. రెండు నెలలుగా పలు ఉద్యోగాలను భర్తీ చేసిన యాజమాన్యం ఈనెల 14, 21, 28వ తేదీల్లో మరికొన్ని ఉద్యోగాల నియామకం చేపట్టనుంది. అలాగే ఆగస్టులో క్లర్క్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి ప్రతీ ఆదివారం పరీక్షలు సింగరేణి సంస్థలో వేలాది ఉద్యోగాల భర్తీకి వివిధ తేదీల్లో నోటిఫికేషన్లు జారీ చేసిన యాజమాన్యం ఇక నుంచి ప్రతీ ఆదివారం ఉద్యోగాల నియామకాల రాత పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 14వ తేదీన 60 అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు, 21వ తేదీన 72 అసిస్టెంట్ ఫోర్‌మెన్ (మెకానికల్) ఉద్యోగాలు, 28వ తేదీన 67 మేనేజ్మెంట్ ట్రైనీ (ఈఅండ్ఎం) ఉద్యోగాల కోసం కొత్తగూడెంలో రాత పరీక్ష నిర్వహించనుంది. అలాగే, జూలైలో 174 ఫిట్టర్ ట్రైనీ, 172 ఎలక్ట్రీషియన్ ట్రైనీ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికితోడు ఆగస్టులో 474 క్లర్క్ (గ్రేడ్-2) పోస్టుల నియామకానికి కూడా రాత పరీక్షను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు ఆర్డర్లు సింగరేణిలో మేనేజ్మెంట్ ట్రైనీ (పర్సనల్)-42 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ (ఫైనాన్స్)-18, మేనేజ్మెంట్ ట్రైనీ (మైనింగ్)-40, మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్)-8, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ -995 పోస్టుల భర్తీకోసం యాజమాన్యం ఇప్పటికే రాత పరీక్ష నిర్వహించింది. అదే రోజు సాయంత్రమే ఫలితాలను వెల్లడించింది. అయితే, ఈ పరీక్షల్లో తృతీయ సంవత్సరం చదివే ఐటీఐ, డిప్లోమో, ఇతర విద్యార్థులకు కూడా అవకాశం కల్పించగా... వారి ఫలితాల వెల్లడి కోసం జూలై 31వ తేదీ వరకు వేచిచూడాలని యాజమాన్యం నిర్ణరుుంచింది. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణులై... ఉద్యోగ నియామక పరీక్షల్లో కూడా పాసైన అభ్యర్థులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను వర్తింపచేస్తూ ఆగస్టులో ఆఫీస్ ఆర్డర్లను అందజేయనుంది. పెరిగిన ‘బదిలీ వర్కర్లు’ వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన నిరుద్యోగులకు రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు సింగరేణిలో ‘బదిలీ వర్కర్’ పేరుతో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సింగరేణి ముందుకు వచ్చింది. 175 పోస్టులను భర్తీకి 4 నెలల క్రితం పదో తరగతి ఉత్తీర్ణులైన ఏజెన్సీ ప్రాంత గిరిజన యువకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా, సుమారు 22,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. యాజమాన్యం తాజాగా మరో 490 పోస్టులను పెంచింది. పెంచిన పోస్టులు కలిపి వారంలో రీ-నోటిఫికేషన్ జారీ చేయనుంది. వీరికి పరుగుపందెం నిర్వహించిన తర్వాత 1ః3 నిష్పత్తిలో పిలిచి రాత పరీక్ష నిర్వహిస్తారు. -
ఖాళీ పోస్టులు 10,236
హన్మకొండ అర్బన్ : త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తామని... రాష్ట్రంలోని సుమారు 1.07లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి శాసన సభలో ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నారుు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు ఉత్సాహంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ నియామకాల్లో ఐదేళ్ల వయోపరిమితి సడలిస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేయడంతో నిరాశలో ఉన్న వారిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారుు. చివరిసారిగా తమ అదృష్టం పరీక్షించుకునే అవకాశం వచ్చిందని వారు ఆనంద పడుతున్నారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియకు నిర్ధిష్టమైన తేదీ ప్రకటించకున్నా... కొద్ది నెలల్లో అనడంతో పోటీలో ఉండాలనుకుంటున్న వారందరూ పుస్తకాలతో కుస్తీ మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు నుంచి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 10,236 ఖాళీలు ఉన్నాయని అధికారికవర్గాల సమాచారం. వీటిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయాల్సినవే ఎక్కువగా ఉన్నాయి. టీచర్ పోస్టుల వంటి కొన్ని మాత్రం డీఎస్పీ ద్వారా భర్తీ చేస్తారు. కొద్ది సంవత్సరాలుగా ఊరిస్తున్న సర్వీస్ కమిషన్ నియామకాల్లో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక పదుల సంఖ్యలోనే ఏపీపీఎస్పీ నుంచి నియామకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మిగతా ఖాళీలను భర్తీ ప్రక్రియ త్వరగా చేపట్టాలని నిరుద్యోగులు ఆకాంక్షిస్తున్నారు. విభజన లెక్కలు పూర్తయితేనే... విభజన లెక్కలు పూర్తయితేనే రాష్ట్రంతోపాటు జిల్లాల వారీగా కూడా పూర్తి ఖాళీలు ఎన్ని ఉన్నాయనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఇదే విషయూన్ని ముఖ్యంమంత్రి కూడా శాసన సభలో తెలిపారు. ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజనతతోపాటు జోనల్, మల్టీ జోనల్ కేడర్ అధికారుల పంపకాలు పూర్తి చేసినట్లయితే ఇక్కడ ఉండేవారు... ఆంధ్రాకు వెళ్లేవారి లెక్కలు పక్కాగా తేలుతాయి. వాటి ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు గుర్తించే ప్రక్రియ సులువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎటొచ్చి ప్రస్తుతం ఉన్న ఖాళీల సంఖ్య పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు ఉండవని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. శిక్షణ సంస్థల్లో పెరిగిన రద్దీ రాష్ట్ర విభజన... సాధారణ ఎన్నికల్లో ‘మేం అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అంటూ అన్ని పార్టీలు ప్రకిటించాయి. ఈ విషయంలో అందరికన్నా ముందున్న టీఆర్ఎస్ పగ్గాలు చేపట్టడంతో సహజంగానే ఉద్యోగ నియామకాలపై యువతీయవకులు ఎంతో ఆశగా ఉన్నారు. ఎన్నికల అనంతరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, నియామకాల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ప్రస్తుతం వేలాది మందితో కిక్కిరిసి పోతున్నాయి. త్వరలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటై... సిలబస్ ప్రకటిస్తే ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది.