Job recruitment process
-
నిరుద్యోగులకు శుభవార్త.. 30,453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనమతులు ఇవ్వాలని సీఎం శాసనసభలోనే చెప్పడం జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర మంత్రులతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు ధపాలుగా చర్చించారు. 80,039 ఉద్యోగాలకుగాను, తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఇవాళ(బుధవారం) ఆర్థిక శాఖ పచ్చా జెండా ఊపింది. ఈ మేరకు అనుమతులిస్తూ జీవోలు జారీ చేసింది. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆయా శాఖల మంత్రులు, ఆయా శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికాలుతో చర్చించి మిగతా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీఎం కేసీఆర్ పిలుపు రేపు(గురువారం) రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలునిచ్చారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రదర్శనలు చేపట్టాలని పేర్కొన్నారు. -
జీతం అడిగితే... సారీ అంటూ ఎర్ర జెండా చూపిస్తున్నాడు...
మనం చాలా రకాల ఇంటర్వ్యూలు చూసి ఉంటాం. అంతేందుకు ఒక్కొసారి మనల్ని ఇబ్బందికి గురి చేసేలా ఇంటర్వ్యూయర్ వేసే ప్రశ్నలకు కూడా మనం ఓపికగా సమాధానం ఇస్తాం. అయితే ఒక్కొసారి మనం ఏమైన సందేహాల్ని వెలిబుచ్చితే మాత్రం ఇంటర్వ్యూయర్లు చాలా మటుకు సరిగా సమాధానమైతే మనకు ఇవ్వరు. పైగా చాలా గర్వంగా సమాధానాలిస్తారు. మరికొంత మంది అయితే చాలా తెలివిగా సమాధానాలు చెబుతూ మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. అచ్చం అలానే ఇక్కొడ ఇంటర్వ్యూయర్ ఒక ఆమెను ఇబ్బంది పెట్టడమే కాక సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటాడు. (చదవండి: భారత్, పాకిస్తాన్ పర్యటన కోసం లెవల్ వన్ హెల్త్ నోటీసులు) అసలు విషయంలోకెళ్లితే...ఒక వ్యక్తి స్కైప్లో ఒక మహిళను ఆన్లైన్ ఇంటర్వ్యూ చేస్తాడు. ఇంటర్వ్యూ చాలా మంచిగా ఆసక్తికరంగా సాగి పోతుంటుంది. చివరిగా జీతం గురించి ప్రస్తావన కొచ్చినప్పుడు సదరు మహిళ సాధారణంగా మీరు ఒక గంట పనికి ఎంత జీతం చెల్లిస్తారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. అలా అడగటమే కాక అమెకరికన్ ఎటర్ప్రెన్యూర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ జిమ్ రోన్ కొటేషన్.." నేను ఎంత పొందుతున్నాను అనే బదులు ఈ పని చేయడం వల్ల నేనేం పొందగలుగుతున్నాను" అనే సందేశాన్ని కూడా జోడించి అడుగుతుంది. దీంతో సదరు ఇంటర్వ్యూయర్ స్వారీ అంటూ ఒక ఎరుపు రంగు జెండాను చూపిస్తాడు. దీంతో సదరు మహిళ క్షమించండి నేను చెల్లించాల్సిన బిల్లులు, ఇతర ఇంటర్వ్యూల గురించి కూడా ఆలోచించాల్సి ఉంది కాబట్టి నాకు ఎంత జీతం చెల్లిస్తారో చెప్పాల్సిందే అంటూ పట్టుబడుతుంది. అయితే ఇంటర్వ్యూయర్ నుంచి ఎటువంటి సమాధానం రాదు. ఆ తర్వాత ఆమె ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన సందేశాలను మొత్తం స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. దీంతో నెటిజన్లు సదరు ఇంటర్వ్యూ తీరుని చూసి షాక్ అవ్వుతూ ..మేము ఉద్యోగులకు తక్కువ జీతం ఇస్తాం అని పరోక్షంగా చెబుతున్నట్లే అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ప్రపంచంలో ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా...!) -
ఉద్యోగాల్లో వివక్ష.. భారీ మూల్యం చెల్లించనున్న ఫేస్బుక్
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ నెత్తిన మరోపిడుగు పడింది. ఉద్యోగుల విషయంలో వివక్ష ప్రదర్శిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో భారీ పెనాల్టీ విధించింది అమెరికా న్యాయ విభాగం. 14.5 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో సుమారు 107 కోట్ల రూపాయల దాకా) పెనాల్టీకి ఆదేశించింది. ఈ మేరకు ఫేస్బుక్ ఒక మెట్టు కిందకు దిగి.. ఒప్పందానికి రావడంతో వాదప్రతివాదనలకు ఆస్కారం లేకుండా వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఉద్యోగుల విషయంలో వివక్షతో పాటు ఫెడరల్ రిక్రూట్మెంట్ రూల్స్ను ఉల్లంఘించిందనే ఆరోపణల ఆధారంగా ఫేస్బుక్ మీద అమెరికా న్యాయ విభాగం గత డిసెంబర్లో ఒక కేసు నమోదు చేసింది. ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు బదులు తాత్కాలిక ఉద్యోగులకు(విదేశీ ఉద్యోగులు, హెచ్ 1-బీ వీసాదారులు తదితరులు) ప్రాధాన్యత ఇవ్వడంలాంటి చర్యలకు పాల్పడింది ఫేస్బుక్. ఇది ఫెడరల్ రిక్రూట్మెంట్ రూల్స్ నిబంధనలకు విరుద్దమేనని లేబర్ విభాగం సైతం వాదించింది. ఈ తరుణంలో సెటిల్మెంట్కు ముందుకొచ్చిన ఫేస్బుక్.. భారీ పెనాల్టీ చెల్లింపునకు అంగీకరించింది. ఇక ఫేస్బుక్తో జరిగిన ఈ సెటిల్మెంట్ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు అమెరికా అటార్నీ జనరల్(సహాయక) క్రిస్టన్ క్లార్క్ . 35 ఏళ్లలో ఇదే అతిపెద్ద సివిల్ రైట్స్ విభాగపు సెటిల్మెంట్గా పేర్కొన్నారు. స్వదేశీ ఉద్యోగులకు బదులు.. తాత్కాలిక వీసాదారులకు పీఈఆర్ఎం కింద (permanent labor certification program) ఫేస్బుక్ ఉద్యోగాలు ఇవ్వడంపైనే ప్రధాన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సివిల్ పెనాల్టీ కింద 4.75 మిలియన్ డాలర్లు, ఉద్యోగ నియామకాల్లో వివక్ష చూపించినందుకు మరో 9.5 మిలియన్ డాలర్లు పెనాల్టీ చెల్లించాలని ఒప్పందం చేసుకుంది ఫేస్బుక్. చదవండి: మాజీ ఉద్యోగి చిచ్చు..వందల కోట్లు ఖర్చుకు సిద్ధమైన జుకర్బెర్గ్ ఇదీ చదవండి: జుకర్బర్గ్ కలత.. రాజీనామా? -
మరో 274 సింగరేణి కొలువులు
♦ త్వరలో మూడో నోటిఫికేషన్ విడుదల ♦ డిపెండెంట్ పోస్టుల భర్తీకీ యాజమాన్యం చర్యలు సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ నుంచి త్వరలో మూడో ఉద్యోగ నియామక ప్రకటన జారీ కానుంది. సంస్థలో ఖాళీగా ఉన్న 7,147 పోస్టుల్లో 3,518 పోస్టులను బహిరంగ నియామక ప్రకటన ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించిన యాజమాన్యం..ఇప్పటికే 3,244 పోస్టుల భర్తీ కోసం రెండు వేర్వేరు ప్రకటనలు జారీ చేసింది. మూడో విడతగా త్వరలో 274 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో అంతర్గత ప్రకటనల ద్వారా మరో 929 పోస్టులు, డిపెండెంట్ కేటగిరీ కింద 2,700 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటోంది. సింగరేణిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తూ సంస్థ ప్రజాసంబధాల అధికారి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ మార్గదర్శకత్వంలో విజిలెన్స్ విభాగం నిరంతర పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా నియామకాల ప్రక్రియ జరుగుతోందని ఇందులో తెలిపారు. నవంబర్లో నియామక ఉత్తర్వులు.. తొలి రెండు విడుతల్లో 3,244 పోస్టుల భర్తీకి ప్రకటనలు రాగా, ఇప్పటికే 2,045 పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు జరిగాయి. ఇప్పటికే 453 పోస్టులకు ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు జారీ చేయగా, నవంబర్లో 811 జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ (జేఎంఈటీ) పోస్టులు, 60 అసిస్టెంట్ ఫోర్మెన్ (ఎలక్ట్రికల్) పోస్టులు, 72 అసిస్టెంట్ ఫోర్మెన్ (మెకానికల్) పోస్టులకు నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. కొన్ని పోస్టులకు విద్యార్హతల విషయంలో చివరి సంవత్సరం కోర్సులు చదువుతున్న అభ్యర్థులకు అవకాశం కల్పించాలనే అంశంపై కోర్టులో ఉన్న వివాదం పరిష్కారం కావాల్సి వుంది. ఆ తర్వాతే మిగిలిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నారు. అంతర్గత అభ్యర్థులకు కేటాయించిన 929 పోస్టుల్లో ఇప్పటి వరకు 769 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ పూర్తైది. డిపెండెంట్ కేటగిరీ కింద సైతం ఇప్పటి వరకు 2,200 మందికి ఉద్యోగాలు కల్పించారు. -
రానుంది.. కొలువుల జాతర!
కంపెనీల సన్నాహాలు: సర్వే న్యూఢిల్లీ : భారతీయ కంపెనీలు అధిక మొత్తంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నాయి. అలాగే కంపెనీలు ఉద్యోగుల వేతనాలను పెంచాలని భావిస్తున్నాయి. ఈ విషయాలు కెరీర్బిల్డర్ ఇండియా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రానున్న కాలంలో శాశ్వత ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు 73% కంపెనీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామక ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 60% కంపెనీలు తెలిపాయి. దాదాపు 46% మంది వర్కర్లు ఉద్యోగ బదిలీ వేటలో ఉన్నారు. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో ఉద్యోగుల వేతనాలను పెంచాలని దాదాపు 86% కంపెనీలు భావిస్తున్నాయి. ఉద్యోగుల ప్రారంభ జీతాన్ని ఐదు శాతంపైగా పెంచాలనే ఉద్దేశంలో 57% కంపెనీలు ఉన్నాయి. రానున్న కాలంలో కస్టమర్ సర్వీసెస్, సేల్స్, మార్కెటింగ్, ఐటీ, తయారీ, ఫైనాన్స్, హెచ్ఆర్ విభాగాల్లో అధిక ఉద్యోగ నియామకాలు నమో దు కానున్నాయి. అలాగే మొబైల్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి తదితర విభాగాల్లో కూడా నియామకాల జోరు కనిపించనుంది.