పూర్తి విచారణ జరిగితే మరిన్ని విషయాలు
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి దొంగపత్రాలు సృష్టించి హైదరాబాద్‌లో భూ కబ్జాలకు పాల్పడ్డారని సీసీఎస్ అడిషనల్ డీసీపీ జోగయ్య వెల్లడించారు. కోర్టుకు దొంగపత్రాలు సమర్పించారని, పూర్తి విచారణ జరిగితే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని ఆయన వెల్లడించారు.
దీపక్‌రెడ్డి అండ్ కో వందల ఎకరాలు కబ్జా చేసినట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని జోగయ్య వెల్లడించారు. భోజగుట్టలో పేదల భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇక్కడ 78.33 ఎకరాలను కబ్జా చేసిన కేసులో పోలీసులు అయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో 8 ఎకరాలు, షేక్‌పేటలో 12 ఎకరాల భూమితో పాటు.. నానక్‌రామ్‌గూడ, జూబ్లీ హిల్స్లలో దీపక్‌రెడ్డి అండ్ కో కబ్జాలకు పాల్పడింది.