John Key
-
భార్య చెప్పిందనే ప్రధాని పదవికి గుడ్‌బై!
వెల్లింగ్టన్: దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రధాని పదవిలో కొనసాగుతున్న న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ అనూహ్యంగా రాజీనామా చేయడానికి ఆయన భార్యనే కారణం అని తెలిసింది. తన భార్య విజ్ఞప్తి మేరకే ఆయన తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారట. రాజీనామా సందర్భంలో కూడా ఇక తాను కుటుంబంతో కలిసి ఉండాలనుకుంటున్నానని ఆయన ప్రకటించడం కూడా ఇదే అంశానికి బలాన్ని చేకూరుస్తుంది. జాతీయ పార్టీ నేతగా కూడా ఆయన రాజీనామా చేశారు. ‘నేను తీసుకుంటున్న ఈ నిర్ణయం ఇప్పటి వరకు తీసుకున్నవాటిల్లోనే కఠినమైనది. తర్వాత నేను ఏం చేస్తానో నాకు తెలియదు. కానీ కుటుంబంతో మాత్రం గడుపుతాను’ అని రాజీనామా సందర్భంగా జాన్ కీ చెప్పారు. అయితే, ఓ మీడియా కథనం ప్రకారం ప్రధాని పదవి బాధ్యతలు ఇక చాలించాలని ఆయన భార్య బ్రోనాగ్ కోరింది. అది కూడా ఇప్పటి వరకు కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్నాడని, ఇకనైన తమ కూతురు స్టెఫీ, కుమారుడు మ్యాక్స్ జీవితాలకోసమైనా ఆ బాధ్యతలు చాలించి కుటుంబంతో గడపాలని కాస్తంత ఘాటుగా చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. కనీసం ముందస్తు సూచనలు కూడా ఇవ్వకుండానే పార్టీ ఎంపీలకు, జాతీయ కార్యవర్గానికి జాన్ కీ షాకిచ్చారని అంటున్నారు. కాగా, మంచి అయినా చెడు అయినా, దేశానికి మంచి విశ్వాసాన్ని జాన్ కీ అందించాడనడంలో ఎలాంటి సందేహం లేదని, ఆయన అందించిన సేవలు భిన్నంగా దేశాన్ని ముందుకు నడిపించాయని, ఆయన గొప్ప నేత అని డిప్యూటీ ప్రధాని బిల్ ఇంగ్లిష్ చెప్పారు. న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ 8 ఏళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు. ప్రజాదరణ గల నాయకుడిగా గుర్తింపు పొందారు. వచ్చే ఏడాది ఆ దేశంలో జరిగే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని భావించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. ఇతర ప్రపంచ నాయకులు చేసిన తప్పును తాను చేయబోనని జాన్ కీ పేర్కొన్నారు. ప్రజాదరణ నేతగా ఉన్నప్పుడే తప్పుకోవాలని భావించినట్టు తెలిపారు. ప్రధాని పదవి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశానని, ఇక కుటుంబంతో గడుపుతానని చెప్పారు. ఈ నెల 12న పార్టీ సమావేశమై కొత్త ప్రధానిని ఎన్నుకుంటుందని జాన్ కీ వెల్లడించారు. ఆయన అదే రోజు అధికారికంగా పదవి నుంచి వైదొలుగుతారు. 2002లో చట్టసభకు ఎన్నికైన జాన్ కీ 2008లో ప్రధాని అయ్యారు. -
షాకింగ్ న్యూస్.. ఇద్దరు ప్రధానులు రాజీనామా
వెల్లింగ్టన్: ప్రపంచ రాజకీయాల్లో రెండు అనూహ్య సంఘటనలు జరిగాయి. సోమవారం న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించగా, ఇదే రోజు ఇటలీ ప్రధాని మట్టెయో రెంజీ కూడా రాజీనామా చేశారు. న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ 8 ఏళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు. ప్రజాదరణ గల నాయకుడిగా గుర్తింపు పొందారు. వచ్చే ఏడాది ఆ దేశంలో జరిగే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. ఇతర ప్రపంచ నాయకులు చేసిన తప్పును తాను చేయబోనని జాన్ కీ పేర్కొన్నారు. ప్రజాదరణ నేతగా ఉన్నప్పుడే తప్పుకోవాలని భావించినట్టు తెలిపారు. ప్రధాని పదవి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశానని, ఇక కుటుంబంతో గడుపుతానని చెప్పారు. ఈ నెల 12న పార్టీ సమావేశమై కొత్త ప్రధానిని ఎన్నుకుంటుందని జాన్ కీ వెల్లడించారు. ఆయన అదే రోజు అధికారికంగా పదవి నుంచి వైదొలుగుతారు. 2002లో చట్టసభకు ఎన్నికైన జాన్ కీ 2008లో ప్రధాని అయ్యారు. న్యూజిలాండ్ ప్రధాని స్వచ్ఛందంగా రాజీనామా చేయగా, ఇటలీ ప్రధాని రెంజీ.. రెఫరెండంలో వ్యతిరేకంగా తీర్పు రావడంతో వైదొలిగారు. రాజ్యాంగ సవరణ కోసం ఆదివారం నిర్వహించిన రెఫరెండంలో (ప్రజాభిప్రాయ సేకరణ) ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫలితం వెలువడిన కొన్ని గంటలకే రెంజీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటరెల్లాను కలసి రాజీనామా లేఖ అందజేశారు. తన పరిపాలన అనుభవం ఇంతటితో ముగిసిందని రెంజీ వ్యాఖ్యానించారు. -
తోడ్పాటు అందిస్తాం
భారత్‌కు ఎన్ఎస్జీ సభ్యత్వంపై న్యూజిలాండ్ ప్రధాని - మోదీతో జాన్కీ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ - ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిర్ణయం - పలు కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్యా ఒప్పందాలు న్యూఢిల్లీ: అణు సరఫరా దేశాల బృందం(ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వం కల్పించే అంశంపై తమ దేశం నిర్మాణాత్మక తోడ్పాటు అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి న్యూజిలాండ్ ప్రధానమంత్రి జాన్ కీ హామీ ఇచ్చారు. అయితే ఎన్ఎస్జీలో భారత్‌కు చోటుపై న్యూజిలాండ్ స్పష్టమైన మద్దతు ప్రకటించలేదు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి సంబంధించి పూర్తిస్థాయి చర్చ జరగలేదని, ఎన్ఎస్జీలోని 48 సభ్య దేశాలు సాధ్యమైనంత త్వరగా ఈ అంశంపై నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకుంటామని జాన్ కీ తెలిపారు. బుధవారం ఢిల్లీలో జాన్ కీ.. ప్రధాని మోదీతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని నిర్ణయించాయి. అనంతరం మోదీ, జాన్ కీ సమక్షంలో సైబర్ సెక్యూరిటీ, డబుల్ ట్యాక్సేషన్, పన్ను ఎగవేతకు సంబంధించి మూడు ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. అలాగే పలు కీలకాంశాలపై విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అనంతరం ప్రధాని మోదీ, జాన్కీ సంయుక్త సమావేశంలో మాట్లాడారు. ద్వైపాక్షిక, బహుపాక్షికంగా అన్ని రంగాల్లో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు సంబంధించి ఫలవంతమైన చర్చలు జరిపినట్టు మోదీ చెప్పారు. కాగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు మద్దతు ఇవ్వడంపై జాన్ కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా భద్రత, నిఘా అంశాల్లో ఇరు దేశాల మధ్యా సహకారాన్ని పటిష్టపరిచేందుకు నిర్ణయించినట్టు మోదీ చెప్పారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని, టై నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయాలని, వారికి నిధులు అందే మార్గాలను నిలుపుదల చేయాలని నిర్ణయించామన్నారు. వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలపై కూడా చర్చలు జరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా ఆర్థిక సంబంధాలను విస్తరించాల్సిన అవసరం ఏర్పడిందని మోదీ పేర్కొన్నారు. ఎన్ఎస్జీ అంశంపై చర్చలు ప్రోత్సాహకరంగా సాగాయని, భారతదేశ క్లీన్ ఎనర్జీ అవసరాలను న్యూజిలాండ్ అర్థం చేసుకుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈపీఎఫ్ దరఖాస్తులను పరిష్కరించండి: మోదీ న్యూఢిల్లీ: కార్మికులు, ఈపీఎఫ్ లబ్ధిదారుల దరఖాస్తులు భారీసంఖ్యలో పెండింగ్‌లో ఉండటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలను ఖరారుచేసే విధానాన్ని ఒక సంవత్సరం ముందుగానే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బుధవారం జరిగిన నెలవారీ సమీక్షలో భాగంగా మోదీ కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులతో మాట్లాడారు. దేశ ప్రగతిలో రేయింబగలు కష్టపడి పనిచేసే కార్మికుల భాగస్వామ్యం చాలా ఉందని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. ఈపీఎఫ్ దరఖాస్తుల పరిష్కారానికి టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. విన్నపాల పరిష్కారానికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్, ఎలక్ట్రానిక్ చలాన్, ఎస్ఎంఎస్లు, యూఏఎన్‌ను ఆధార్‌కు అనుసంధానించడం, టెలిమెడిసిన్‌ను ప్రవేశపెట్టడంలాంటి వాటిని అందుబాటులోకి తేవాలన్నారు. హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టులపైనా మోదీ సమీక్ష నిర్వహించారు. కాగా, పథకాల అమలును మరింత వేగవంతం చేసేందుకే కేంద్ర బడ్జెట్‌ను నెల ముందుకు జరిపామని, దీన్ని దృష్టిలోపెట్టుకొని అన్ని రాష్ట్రాలు తమ ప్రణాళికలను చూసుకోవాలని మోదీ చెప్పారు. -
వెయిట్రెస్ జుట్టు లాగిన ప్రధాని.. క్షమాపణ!
ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా.. చిన్న చిన్న తప్పులు చేసి పప్పులో కాలేస్తారు కొందరు నేతలు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఓ వెయిట్రెస్ జుట్టు పట్టుకుని పదే పదే లాగిన ఆయన.. చివరకు ఆమెకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆక్లండ్‌లో ఓ వెయిట్రెస్ వేసుకున్న పోనీ టెయిల్ పట్టుకుని లాగడంతో.. ఆమె దాన్ని వేధింపులుగా భావించింది. దీంతో ప్రధాని జాన్ కీ క్షమాపణ చెప్పారు. ఆమెను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని, అయినా.. ఆమె ఇబ్బంది పడి ఉంటే క్షమాపణ చెబుతున్నానని తన ప్రతినిధి ద్వారా ఆయన తెలిపారు. దాంతో పాటు ఆయన జాతి మొత్తానికి బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. టర్కీ వెళ్తున్న ఆయన.. లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. సాధారణంగా ప్రాక్టికల్స్ జోకులు వేయడం తనకు ఇష్టమని, అందుకు ఆమె బాధపడినట్లు తెలియగానే క్షమాపణ చెప్పానని అన్నారు. ఆమెకు వైన్ ఇచ్చి క్షమాపణ చెప్పగానే.. ఆమె దానికి సరేనని చెప్పిందన్నారు. స్కూల్లో పిల్లలు తోటి పిల్లల జడ పట్టుకుని లాగినట్లుగా.. ఆయన కూడా తన జుట్టుతో ఆడుకున్నారని బాధితురాలైన వెయిట్రెస్ తెలిపింది. -
షారుక్ కు న్యూజిలాండ్ ప్రధాని ఘనస్వాగతం!
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కు ఆదేశ ప్రధాని జాన్ కీ ఆక్లాండ్ నగరంలో ఘనంగా స్వాగతం పలికారు. 'టెంప్టేషన్ రీలోడెడ్' టూర్ లో భాగంగా షారుక్ ఖాన్ ఆక్లాండ్ కు చేరుకున్నారు. ప్రధాని జాన్ కీ ఘనంగా స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. నా జట్టు తరపున జాన్ కీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఆక్లాండ్ లో ఇవ్వనున్న ప్రదర్శన కోసం రిహార్సల్ జరుగుతోంది. ఈ ప్రదర్శన ద్వారా బోలెడంత వినోదాన్ని ప్రేక్షకులకు అందించనున్నాం. హానీ సింగ్, మాధురీ, రాణీ, జాక్వలైన్ లు తమ ప్రదర్శనతో ఊర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నారు అని షారుక్ ట్వీట్ చేశారు. 'టెంప్టేషన్ రీలోడెడ్' టూర్ లో మాధూరి దీక్షిత్, రాణీ ముఖర్జీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యోయో సింగ్, మీయాంగ్ చాంగ్ లతో కలిసి షారుఖ్ ప్రదర్శనను ఇవ్వనున్నారు.