షాకింగ్‌ న్యూస్‌.. ఇద్దరు ప్రధానులు రాజీనామా | New Zealand, Italy Prime Ministers John Key, Matteo Renzi announce resignation | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ న్యూస్‌.. ఇద్దరు ప్రధానులు రాజీనామా

Published Mon, Dec 5 2016 8:47 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

షాకింగ్‌ న్యూస్‌.. ఇద్దరు ప్రధానులు రాజీనామా

షాకింగ్‌ న్యూస్‌.. ఇద్దరు ప్రధానులు రాజీనామా

వెల్లింగ్టన్‌: ప్రపంచ రాజకీయాల్లో రెండు అనూహ్య సంఘటనలు జరిగాయి. సోమవారం న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌ కీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించగా, ఇదే రోజు ఇటలీ ప్రధాని మట్టెయో రెంజీ కూడా రాజీనామా చేశారు.

న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌ కీ 8 ఏళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు. ప్రజాదరణ గల నాయకుడిగా గుర్తింపు పొందారు. వచ్చే ఏడాది ఆ దేశంలో జరిగే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. ఇతర ప్రపంచ నాయకులు చేసిన తప్పును తాను చేయబోనని జాన్‌ కీ పేర్కొన్నారు. ప్రజాదరణ నేతగా ఉన్నప్పుడే తప్పుకోవాలని భావించినట్టు తెలిపారు. ప్రధాని పదవి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశానని, ఇక కుటుంబంతో గడుపుతానని చెప్పారు. ఈ నెల 12న పార్టీ సమావేశమై కొత్త ప్రధానిని ఎన్నుకుంటుందని జాన్‌ కీ వెల్లడించారు. ఆయన అదే రోజు అధికారికంగా పదవి నుంచి వైదొలుగుతారు. 2002లో చట్టసభకు ఎన్నికైన జాన్‌ కీ 2008లో ప్రధాని అయ్యారు.

న్యూజిలాండ్‌ ప్రధాని స్వచ‍్ఛందంగా రాజీనామా చేయగా, ఇటలీ ప్రధాని రెంజీ.. రెఫరెండంలో వ్యతిరేకంగా తీర్పు రావడంతో వైదొలిగారు. రాజ్యాంగ సవరణ కోసం ఆదివారం నిర్వహించిన రెఫరెండంలో (ప్రజాభిప్రాయ సేకరణ) ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారు.  ఫలితం వెలువడిన కొన్ని గంటలకే రెంజీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటరెల్లాను కలసి రాజీనామా లేఖ అందజేశారు. తన పరిపాలన అనుభవం ఇంతటితో ముగిసిందని రెంజీ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement