Matteo Renzi
-
షాకింగ్ న్యూస్.. ఇద్దరు ప్రధానులు రాజీనామా
వెల్లింగ్టన్: ప్రపంచ రాజకీయాల్లో రెండు అనూహ్య సంఘటనలు జరిగాయి. సోమవారం న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించగా, ఇదే రోజు ఇటలీ ప్రధాని మట్టెయో రెంజీ కూడా రాజీనామా చేశారు. న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ 8 ఏళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు. ప్రజాదరణ గల నాయకుడిగా గుర్తింపు పొందారు. వచ్చే ఏడాది ఆ దేశంలో జరిగే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. ఇతర ప్రపంచ నాయకులు చేసిన తప్పును తాను చేయబోనని జాన్ కీ పేర్కొన్నారు. ప్రజాదరణ నేతగా ఉన్నప్పుడే తప్పుకోవాలని భావించినట్టు తెలిపారు. ప్రధాని పదవి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశానని, ఇక కుటుంబంతో గడుపుతానని చెప్పారు. ఈ నెల 12న పార్టీ సమావేశమై కొత్త ప్రధానిని ఎన్నుకుంటుందని జాన్ కీ వెల్లడించారు. ఆయన అదే రోజు అధికారికంగా పదవి నుంచి వైదొలుగుతారు. 2002లో చట్టసభకు ఎన్నికైన జాన్ కీ 2008లో ప్రధాని అయ్యారు. న్యూజిలాండ్ ప్రధాని స్వచ్ఛందంగా రాజీనామా చేయగా, ఇటలీ ప్రధాని రెంజీ.. రెఫరెండంలో వ్యతిరేకంగా తీర్పు రావడంతో వైదొలిగారు. రాజ్యాంగ సవరణ కోసం ఆదివారం నిర్వహించిన రెఫరెండంలో (ప్రజాభిప్రాయ సేకరణ) ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫలితం వెలువడిన కొన్ని గంటలకే రెంజీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటరెల్లాను కలసి రాజీనామా లేఖ అందజేశారు. తన పరిపాలన అనుభవం ఇంతటితో ముగిసిందని రెంజీ వ్యాఖ్యానించారు. -
స్వలింగ వివాహలకు ఇటలీ ఆమోదం
రోమ్: స్వలింగ సంపర్కుల వివాహాలకు ఇటాలియన్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ దేశ పార్లమెంట్లో కాన్ఫిడెన్స్ ఓటు ద్వారా బిల్లుపై బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో ఇకపై స్వలింగ సంపర్కులు ఇటలీలో స్వేచ్ఛగా వివాహం చేసుకోవచ్చు. అందరిలాగే జీవితం గడపవచ్చు. చారిత్రాత్మక నిర్ణయంతో ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి. 'తమ ఆకాంక్షలు గుర్తించినందుకు ఈ రోజు చాలామంది వేడుకలు జరుపుకుంటారు' అని ఈ సందర్భంగా ఇటలీ ప్రధానమంత్రి మట్టెయో రెంజీ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. తమ భాగస్వామి లేనందున రాత్రుళ్లు నిద్రపట్టక ఒత్తిడి గురయ్యేవారికి ఇది మంచివార్త అని, వాళ్లంతా తాజా నిర్ణయంతో వేడుక చేసుకుంటారన్నారు. రెంజీ ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ కౌన్సిలర్‌గా పని చేసిన అలెస్సియా బెల్లినీ ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. తాను స్వలింగ సంపర్కురాలినని బహిరంగంగా ప్రకటించిన బెల్లినీ క్యాన్సర్‌తో 2011లో మరణించింది.