జయ కేసు: చరిత్ర సృష్టించిన మైఖేల్
జాన్ మైఖేల్ డికున్హా.. నిన్న మొన్నటి వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసు పుణ్యమాని ఒక్కసారిగా ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆయన ఎవరో కాదు.. అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా నిర్ధారించిన న్యాయమూర్తి ఆయనే. బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు మొదట బాలకృష్ణన్ న్యాయమూర్తిగా ఉండేవారు. అయితే ఆయన కేసు విచారణ పూర్తి కాకముందే పదవీ విరమణ చేశారు.
దాంతో ఆ తర్వాత ఆ కోర్టుకు న్యాయమూర్తిగా జాన్ మైఖేల్ నియమితులయ్యారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన రెండేళ్లకు విచారణ పూర్తయింది. ఈ కేసులో తీర్పును జయలలిత ముందే ఊహించారో ఏమో గానీ, శనివారం నాడు తీర్పు వెల్లడించకుండా చూడాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయినా సుప్రీం మాత్రం అందుకు నిరాకరించింది. దాంతో శనివారం నాడే జయలలితను దోషిగా నిర్ధరిస్తూ న్యాయమూర్తి జాన్ మైఖేల్ తీర్పు చెప్పారు.