joined BJP
-
రాష్ట్ర రక్షణకు మేధావులు బీజేపీలోకి రావాలి..
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగుతోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఒక చేత్తో ఆసరా పెన్షన్ ఇచ్చి, మరో చేతిలో మద్యం బాటిల్ పెట్టి కేసీఆర్ సర్కారు డబ్బులు లాగేసుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో భూములు, మద్యం అమ్మనిదే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. విద్యుత్ చార్జీలు, ఆరీ్టసీ, భూముల రిజిస్ట్రేషన్, ఇంటిపన్ను ఇలా.. అన్ని రకాల చార్జీలను పెంచి ప్రజలపై ప్రభు త్వం తీరని భారం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్ సమక్షంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు కుమారుడు డా.చెన్నమనేని వికాస్‌రావు, ఆయన భార్య డా. దీప బీజేపీలో చేరారు. వారికి కిషన్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రోజువారీ ఖర్చుల కోసం కూడా.. భూముల వేలం ద్వారా డబ్బు సమకూర్చుకుంటోన్న దుస్థితి నెలకొందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక అవసరాల కోసం ఓఆర్ఆర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టడం దారుణమన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం తెలంగాణలోని విద్యావంతులు, మేధావులు బీజేపీలోకి రావాలని ఆహా్వనిస్తున్నామని ఆయన పిలుపునిచ్చారు. ఏ బాధ్యతనిచ్చినా స్వీకరిస్తాం: డాక్టర్ వికాస్ బీజేపీ అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వానీ, మురళీ మనోహర్జోషి వంటి పెద్దల ప్రభావం తనపై ఉందని పారీ్టలో చేరిన డాక్టర్ వికాస్ తెలిపారు. తాను, తన భార్య డా.దీప ప్రజలకు మరింత సేవ చేసేందుకు బీజేపీలో చేరామని, రాబోయే రోజుల్లో అప్పగించే బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తామని చెప్పారు. ఎన్నికలెప్పుడొచ్చినా బీజేపీ గెలుపు తథ్యం : బండి సంజయ్ తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుపు తథ్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనపట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారనీ, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలే ఇందుకు నిదర్శనమన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో రామరాజ్యం రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. డా.వికాస్, దీపల చేరికతో రాజన్న సిరిసిల్లలోని రెండు నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి: డా. కె. లక్ష్మణ్ దేశంలో మోదీ ప్రభుత్వ సుపరిపాలనకు ఆకర్షితులై, ప్రజలకు మరింత సేవా చేయాలనే సంకల్పంతో డాక్టర్ వికాస్, దీప దంపతులు బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలోని విద్యావంతులు ముఖ్యంగా యువత రాజకీయ రంగంలోకి రావాలని విలువలతో కూడిన రాజకీయాలు, జవాబుదారీతనంతో కూడిన రాజకీయాలు వారితోనే సాధ్యమన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలోపేతం: ఎంపీ అర్వింద్ వేములవాడ ప్రాంతంలో సామాజిక, సేవా కార్యక్రమాలను చేపడుతున్న డాక్టర్ దీప, వికాస్ దంపతుల చేరికతో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీజేపీ మరింత బలోపేతమవుతుందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి చెప్పారు. -
బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
-
బీజేపీలో చేరిన షూటర్ శ్రేయాసి సింగ్
పట్నా : ప్రముఖ షూటర్ శ్రేయాసి సింగ్ బీజేపీ బిహార్ శాఖ చీఫ్ భూపేంద్ర యాదవ్ సమక్షంలో ఆదివారం ఆ పార్టీలో చేరారు. జుముయ్ జిల్లా గిధౌర్‌కు చెందిన శ్రేయాసి సింగ్‌ను బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అమర్పూర్ నుంచి బీజేపీ బరిలో దింపవచ్చని భావిస్తున్నారు. ఆమె 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం, స్కాట్లాండ్లో జరిగిన 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో వెండి పతకం సాధించారు. 2013లో మెక్సికోలో జరిగిన ట్రాప్ షూటింగ్ వరల్డ్ కప్‌లోనూ శ్రేయాసి సింగ్ భారత జట్టు తరపున ప్రాతినిథ్యం వహించారు. కాగా, 2018లో షూటింగ్ విభాగంలో ఆమె అర్జున అవార్డును పొందారు. శ్రేయాసి గతంలో ఆర్జేడీ సహా పలు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపినా చివరికి బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మరో నెలలో జరగనుండగా బీజేపీలో చేరాలని ఆమె నిర్ణయించుకున్నారు. శ్రేయాసి తండ్రి దిగ్విజయ్ సింగ్ గతంలో అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ కేబినెట్లో పలు మంత్రిత్వ శాఖలను చేపట్టారు. అటల్ బిహార్ వాజ్‌పేయి ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. శ్రేయాసి సింగ్ తల్లి పుతుల్ సింగ్ బిహార్‌లోని బంకా నుంచి ఎంపీగా పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. చదవండి : బిహార్ ఎన్నికలు : జేడీయూకు షాక్ -
బీజేపీలో చేరిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
పనాజీ : గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు సుభాష్ శిరోడ్కర్, దయానంద్ సోప్టే మంగళవారం బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారని వారు తెలిపారు. తాము బీజేపీలో చేరుతున్నామని, మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో బీజేపీలో చేరతారని శిరోడ్కర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బీజేపీ చీఫ్ అమిత్ షాతో భేటీ అనంతరం వారు పార్టీలో చేరికపై ప్రకటన చేశారు. కాగా తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అమిత్ షా బెదిరింపులకు గురిచేసి బీజేపీలో చేర్చుకున్నారని గోవాకు కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ ఇన్ఛార్జ్ చెల్లకుమార్ ఆరోపించారు. గోవా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వైదొలిగితే సభలో కాంగ్రెస్‌కు సమానంగా సభ్యుల సంఖ్యను పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. మొత్తం 38 మంది సభ్యులు కలిగిన గోవా అసెంబ్లీలో తాజా బలాబలాలను చూస్తే బీజేపీకి 14 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 14 మంది ఎమ్మెల్యేలుండగా, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి ముగ్గురు, గోవా ఫార్వార్డ్ పార్టీకి ముగ్గురు సభ్యులున్నారు. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఓ ఎన్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు. గత కొద్దివారాలుగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సీఎం మనోహర్ పారికర్ ఆదివారం ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పారికర్ ప్రస్తుతం గోవాలోని దోనాపౌలాలోని తన ప్రైవేట్ నివాసంలో చికిత్స పొందుతున్నారు. -
బీజేపీలో చేరిన 'సరబ్జిత్' సోదరి
ఫజీకా(పంజాబ్): పాకిస్థాన్ జైలులో మగ్గి.. చివరకు అక్కడే తుదిశ్వాస విడిచిన సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ ఆదివారం బీజేపీలో చేరారు. వీరి జీవితకథ ఆధారంగా నిర్మించిన బయోపిక్ 'సరబ్జిత్'. రణ్‌దీప్ హుడా సరబ్జిత్గా, ఐశ్యర్యరాయ్ ఆయన సోదరిగా ఈ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సోదరుడి కోసం దల్బీర్ కౌర్ రెండు దశాబ్దాలపాటు అలుపెరగని పోరాటం చేశారు. తమ్ముడి విముక్తి కోసం పదివేల కిలోమీటర్ల ప్రయాణించారు. వేలాది కొవ్వొత్తుల ప్రదర్శనలు, వందలాది ర్యాలీలు నిర్వహించారు. తమ్ముడికి విముక్తి కల్పించడం కోసం ఇరు దేశాల మధ్య 170 మంది రాజకీయ నేతలను ఆమె కలుసుకున్నారు. దల్బీర్ కౌర్‌ది అమృత్ సర్‌కు సమీపంలోని భికివిండ్ అనే కుగ్రామం. తమ్ముడు సరబ్జిత్ పొరపాటున దేశ సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించారు. తాము వెతుకుతున్న మరెవరో భారత గూఢచారి అనుకొని 1990, ఆగస్టు 28వ తేదీన సరబ్‌ను పాకిస్తాన్ సైనికులు అరెస్టు చేశారు. గూఢచర్యం అభియోగాలపై కేసును విచారించిన పాక్ కోర్టు 1991లో ఉరిశిక్ష విధించి జైల్లో నిర్బంధించింది. తమ్ముడి జాడ కోసం వెతుకుతున్న దల్బీర్ కౌర్‌కు ఈ విషయం తెల్సింది. అప్పటి నుంచి ఆమె తమ్ముడి విడుదల కోసం భారత అధికారుల మీద ఒత్తిడి తీసుకరావడం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నుంచి ప్రధాన మంత్రుల వరకు ఆమె ఎవరిని వదిలి పెట్టలేదు. ఎవరు అనుమతి ఇచ్చినా లేకపోయినా గేట్లు దూసుకుపోయారు. 1991లో ఆమె అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు దాదాపు వంద సార్లు ఫోన్ చేశారు. ఈ బెడద తట్టుకోలేక పీవీ ఆమెను పిలిపించారు. ‘చింతా మత్ కరో హమ్ తుమారే భాయ్ కో లే ఆయెంగే (బాధ పడకు మీ తమ్ముడిని మేము తీసుకొస్తాం)’ అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో ఆమె ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కూడా కలుసుకున్నారు. మన్మోహన్ సిఫారసుపై అప్పటి పాక్ అధినేత ముషార్రఫ్‌ను కులుసుకున్నారు. అప్పటికీ సరబ్జిత్కు ఉరిశిక్షను అమలు చేయకపోవడంతో ఉరిశిక్షను నిలిపివేయిస్తానంటూ ముషార్రఫ్ హామీ ఇచ్చారు. మాజీ క్రికెటర్ నవజోతి సింగ్ సిద్ధూను కూడా ఆమె కలుసుకున్నారు. తమ్ముడి కోసం పోరాటం జరపుతున్న ఇలాంటి అక్కను తానెన్నడూ చూడలేదని ఆ సందర్భంగా సిద్ధు వ్యాఖ్యానించారు. లాహోర్‌లోని కోట్ లోక్పత్ జైల్లో ఉన్న సరబ్జిత్ను కలుసుకునేందుకు 2011లో దల్బీర్ కౌర్‌కు అవకాశం దొరికింది. ఈ సందర్భంగా ఆమె తమ్ముడికి రాఖీ కట్టి ఎలాగైనా ‘నిన్ను విడిపించుకుంటానురా తుమ్ముడూ!’ అంటూ శపథం చేశారు. ఆ సందర్భంగా తమ్ముడి కళ్ల నుంచి పెళ్లుబికిన కన్నీళ్లను చూసి తట్టుకోలేకపోయానని ఆమె ఓ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇటు భారత్ నేతలు, అటు పాక్ నేతలు ఎన్ని హామీలు ఇచ్చినా సరబ్జిత్ విడుదల కాలేదు. 2013, ఏప్రిల్ 26వ తేదీన సరబ్జిత్ను తోటి ఖైదీలు చంపేశారు. సరబ్జిత్ను విడుదల చేస్తే ఓ అమాయకుడిని అన్యాయంగా అరెస్టుచేసి శిక్ష విధించారనే ఆరోపణలను నిజం చేసినట్లవుతుందనే ఉద్దేశంతో పాక్ సైనిక శక్తులే సరబ్జిత్ హత్యకు కుట్రపన్నాయనే విమర్శలు వచ్చాయి. సరబ్‌కు సజీవంగా స్వాగతం చెబుతామని సొంతూరులో నిరీక్షిస్తున్న దల్బీర్ కౌర్ ఇంటికి తమ్ముడి శవం చేరింది. తమ్ముడికి ఘనంగా దహన సంస్కారాలు చేసిన దల్బీర్ కళ్లల్లో నీళ్లింకిపోయినా పోరాట స్ఫూర్తి మాత్రం అలాగే మిగిలిపోయింది.