joining in trs
-
దొరల గడీలో మరో గుమాస్తా ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో ఎల్.రమణ చేరిక దొరల గడీలో మరో గుమాస్తా చేరినట్లుగా ఉందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీటీడీపీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిలయ్య యాదవ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా ఎక్కువగా నష్టపోయింది చేనేత కార్మికులేనని, వారిని ఆదుకోవాలని 10 రోజులు నిరాహార దీక్షలు చేసినా సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన వాపోయారు. వస్త్రాలు కొనుగోలు చేయాలని ప్రాధేయపడినా పట్టించుకోలేదని, టీఆర్ఎస్ హయాంలో చేనేతలకు ఒనగూరింది శూన్యమని అయిలయ్య విమర్శించారు. -
టీఆర్ఎస్లో చేరిన ఎల్. రమణ
-
టీఆర్ఎస్లోకి టీడీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్ : జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బోగ వెంకటేశ్వర్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ముఖ్య అనుచరుడైన వెంకటేశ్వర్లుకు మంత్రి కేటీఆర్ శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటేశ్వర్లుతో పాటు వడ్డెర సంఘం నేత మొగిలి, పద్మశాలి సంఘం నేతలు బూస గంగారాం, మానపూర్ శ్రీహరి, పూసల సంఘం నేతలు సురేందర్, చకిలం కిషన్, బోగ ప్రవీణ్ తదితరులు టీఆర్ఎస్లో చేరారు. ఎంపీ కవిత మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై అందరూ టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో జగిత్యాల టీఆర్ఎస్ ఇన్చార్జి సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, గుండు సుధారాణి పాల్గొన్నారు. -
కారెక్కిన గుండు సుధారాణి
హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్ గూటికి చేరారు. శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కే చంద్రశేఖర్రావు సమక్షంలో ఆమె టీఆర్ఎస్లో చేరారు. గుండు సుధారాణి సైకిల్ను వీడి కారు ఎక్కనున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల నేపథ్యంలో గుండు సుధారాణి పార్టీ మారడం టీడీపీకి ఎదురుదెబ్బ కానుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతునిచ్చే ఉద్దేశంతో ఆమె టీఆర్ఎస్లో చేరినట్టు తెలిపారు.