సెలవు రోజుల్లోనూ ఓయూసెట్కు దరఖాస్తు
హైదరాబాద్, ఓయూసెట్-2014కు సెలవురోజుల్లో (12, 13, 14లతో పాటు ఇతర తేదీలలోని సెలవులు) కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పీజీ అడ్మిషన్స్ జాయింట్ డెరైక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఉస్మానియాతో పాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో 2014-15 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశానికి డిగ్రీ, ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల్లో 1500 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరుగుతున్నట్లు తెలిపారు