Joint andhra pradesh bifurcation
-
పాత పద్ధతిలోనే తెలుగు వర్సిటీ ప్రవేశాలు
సాక్షి,హైదరాబాద్: తెలుగు యూనివర్సిటీ ప్రవేశాలపై సందిగ్ధత వీడింది. పాత పద్ధతిలోనే ప్రవేశాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం స్పష్టత నిచ్చింది. అంతేగాక 2015-16 విద్యా సంవత్సరానికి అవసరమయ్యే బడ్జెట్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు వర్సిటీని 10వ షెడ్యూల్లో చేర్చిన విషయం తెలిసిందే. ఫలితంగా ఏడాది పాటు రెండు రాష్ట్రాలకు ఈ వర్సిటీ సేవలందించాల్సి ఉండగా... ఈ పనిని విజయవంతంగా నిర్వహించింది. వర్సిటీ ఉమ్మడి పాలన గడువు ఈ ఏడాది జూన్ 2వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో వర్సిటీని ఉమ్మడిగానే కొనసాగిస్తారా? లేక విభజిస్తారా? అన్న అంశం తేలలేదు. దీంతో ప్రవేశాలు ఏ ప్రాతిపదికన కల్పించాలో తెలియక వర్సిటీ అధికారులు ఆందోళనలో పడ్డారు. ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ దృష్టికి వర్సిటీ వర్గాలు తీసుకెళ్లాయి. ప్రభుత్వం స్పందించడంతో పీటముడి వీడింది. త్వరలో నోటిఫికేషన్: ప్రవేశాల విషయంలో స్పష్టత రావడంతో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలపై వర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మే నెలలో నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ప్రవేశాలపై సందిగ్ధత కారణంగా కొంత ఆలస్యమైంది. తాజాగా ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ ఎల్లూరి శివారెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. -
ఏపీకి ప్రత్యేకహోదా ఏదీ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో నవ్యాంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇస్తామని అప్పటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసింది. ఐదేళ్లు చాలవు... కనీసం పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ డిమాండ్ చేసింది. పైగా కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే నవ్యాంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేకహోదా, ప్యాకేజీ కల్పిస్తా మని గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. ఆయనే ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా కల్పన సాధ్యం కాకపోవచ్చంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గత ఎన్నికల్లో ఓటు బ్యాంక్ సొంతం చేసుకోవడానికే ఎన్డీయే కూటమి ఈ హామీ ఇచ్చినట్లు కనిపిస్తోంది తప్ప, అమలు చేయాలన్న చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే, ఇతర రాష్ట్రా ల వారు కూడా అడుగుతారని, అందువల్ల అన్ని రాష్ట్రాల అభిప్రాయా లను పరిగణనలోకి తీసుకోవాలనే దాటవేత ధోరణితో కేంద్రం వ్యవ హరించడం దురదృష్టకరం. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికిచ్చిన హామీలన్నింటినీ సాధించుకొనేందుకు ఇప్పటికైనా ఏపీ సీఎం అఖిల పక్షం ఏర్పాటుచేసి, కేంద్రంతో పోరాడాల్సిన అవసరం ఎంైతైనా ఉంది. రెండు నాల్కల బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలూ చేపట్టాలి. - బట్టా రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూరు, నెల్లూరు