ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో నవ్యాంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇస్తామని అప్పటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసింది. ఐదేళ్లు చాలవు... కనీసం పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ డిమాండ్ చేసింది. పైగా కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే నవ్యాంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేకహోదా, ప్యాకేజీ కల్పిస్తా మని గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. ఆయనే ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా కల్పన సాధ్యం కాకపోవచ్చంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
గత ఎన్నికల్లో ఓటు బ్యాంక్ సొంతం చేసుకోవడానికే ఎన్డీయే కూటమి ఈ హామీ ఇచ్చినట్లు కనిపిస్తోంది తప్ప, అమలు చేయాలన్న చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే, ఇతర రాష్ట్రా ల వారు కూడా అడుగుతారని, అందువల్ల అన్ని రాష్ట్రాల అభిప్రాయా లను పరిగణనలోకి తీసుకోవాలనే దాటవేత ధోరణితో కేంద్రం వ్యవ హరించడం దురదృష్టకరం. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికిచ్చిన హామీలన్నింటినీ సాధించుకొనేందుకు ఇప్పటికైనా ఏపీ సీఎం అఖిల పక్షం ఏర్పాటుచేసి, కేంద్రంతో పోరాడాల్సిన అవసరం ఎంైతైనా ఉంది. రెండు నాల్కల బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలూ చేపట్టాలి.
- బట్టా రామకృష్ణ దేవాంగ
సౌత్ మోపూరు, నెల్లూరు
ఏపీకి ప్రత్యేకహోదా ఏదీ?
Published Sat, Jan 31 2015 12:39 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement