navyandhra pradesh
-
బాధ్యతను గుర్తిస్తేనే భవిష్యత్తు
నవ్యాంధ్రప్రదేశ్‌కు కావలసిన సౌకర్యాలన్నిటినీ కల్పిస్తామని ఆనాటి ప్రధాని మన్మోహన్సింగ్ పెద్దల సభ సాక్షిగా హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కల్పించడం అందులో కీలకమైనది. ఆ తర్వాత ఉనికిలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సైతం ఎన్నో తాయిలాలున్నాయి. ఏడాది కావస్తున్నా ఇందులో ఏ ఒక్కటీ అమలు కాలేదు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను గుర్తిస్తాయా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడంలో అత్యుత్సాహం ప్రదర్శించినవారు చేసిన బాసలు నెరవేర్చవలసి వచ్చేసరికి నీళ్లు నములుతున్నారు. రకరకాల సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. బాధ్యులు మీరంటే మీరని ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. ఆనాడు జరిగిందేమిటో ఎవరూ మరిచి పోలేరు. జనం ఎంతగా ఆందోళన చేసినా, రాజకీయ పక్షాలు ఎంతగా నిరసిం చినా రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. ఆఖరికి అయిదు ఊళ్లయినా ఇవ్వండని పాండవుల తరఫున కృష్ణుడు రాయబారం చేసినట్టు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించమని ఆనాటి కేంద్ర మంత్రులు కోరినా అప్పటి యూపీఏ సర్కారు వినిపించుకోలేదు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్... ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ రెండూ కలిసి నవ్యాంధ్రప్రదేశ్‌కు బంగారు భవి ష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చి సమైక్యాంధ్రప్రదేశ్‌ను రెండుగా చీల్చారు. ఒక రాష్ర్టం నీటి వనరులలోనూ, ఖనిజసంపదలోనూ, ఆర్థిక పరిపుష్ఠతలోనూ లబ్ధి పొందింది... రెండో రాష్ర్టం ఆర్థిక సంక్షోభంలోనూ, జలవనరుల జంజా టంలోనూ... వైద్య, విద్యా రంగాలలోనూ వెనుకంజలో పడింది. ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి కష్టాలూ ఎదురుకావని, దాన్ని ఆదుకుంటా మని ఆనాటి ప్రధాని మన్మోహన్సింగ్ పెద్దల సభ సాక్షిగా హామీ ఇచ్చారు. అందుకు ఆరుసూత్రాలను కూడా ప్రకటించారు. ప్రత్యేక హోదా కల్పిస్తామని ‘మనసా, వాచా, కర్మణా’ వాగ్దానంచేశారు. ఇప్పుడు ఆ మనసూలేదు....ఆ కర్మాలేదు. వాచకం మాత్రం మిగిలిపోయింది! నిరుడు మార్చి 1న వెలువడిన 71 పేజీల ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నవ్యాంధ్రప్రదేశ్‌కు మరికొన్ని తాయిలాలు ప్రకటించింది. అయితే ఆ చట్టంలో ప్రధాని ప్రకటించిన వాగ్దా నాల జాడలేదు. పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో చట్టపరమైన అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే మనసుంటే మార్గముంటుంద న్నట్టు... చట్టంలో మార్పులు చెయ్యవచ్చు, హామీలు నిలబెట్టుకోవచ్చు. నవ్యాంధ్రప్రదేశ్‌కు న్యాయం చెయ్యవచ్చు. అసలు ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం 2014లో పరిశేష ఆంధ్ర ప్రదేశ్‌కు ఏఏ హామీలు ఇచ్చారో ఒకసారి పరిశీలిద్దాం. చట్టంలోని పదమూ డవ షెడ్యూలులో పొందుపరచినవన్నీ అమలుపరచడానికి తగిన చర్యలు తీసుకుంటామని సెక్షన్ 93 స్పష్టంచేసింది. పదమూడవ షెడ్యూలులో నవ్యాంధ్రప్రదేశ్‌కు సమకురుస్తామన్న సౌకర్యాలు: - ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎమ్, ఐఐఎస్ఇఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీలను నెలకొల్పడం. - అఖిలభారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్)వంటి సూపర్ స్సెషాలిటీ ఆస్పత్రి, వైద్య విద్యా సంస్థలను ప్రారంభించటం. - ట్రైబల్ యూనివర్సిటీని నెలకొల్పడం. - నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్థాపించటం. - 2018 నాటికి మొదటి దశ పూర్తయ్యే విధంగా దుగ్గిరాజుపట్నాన్ని మేజర్ పోర్ట్‌గా చేయడం. - విభజన జరిగిన తేదీ నుంచి ఆర్నెల్లలో వైఎస్ఆర్ జిల్లాలో సెయిల్ సంస్థ ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంటు నిర్మాణానికి కావల్సిన అవకాశాలను పరిశీలించడం. - ఐఓసీ లేదా హెచ్‌పీసీఎల్ నవ్యాంధ్రప్రదేశ్‌లో విభజన తేదీ నుంచి ఆర్నె ల్లలో గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కావలసిన అవకాశాలు పరిశీలించడం. - ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ తరహాలో విశాఖ-చెన్నై కారిడార్ నిర్మాణానికి పూనుకోవడం. - విజయవాడ, విశాఖ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి పెంచడం. - కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడం. - ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నుంచి దేశంలోని అన్ని నగరాలకూ రోడ్డు, రైలు రవాణా సదుపాయాల కల్పన. ఇవిగాక సెక్షన్ 94లో మరికొన్ని హామీలిచ్చారు. - రాష్ర్ట పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి కావలసిన ఆర్థిక సౌకర్యా లను పన్ను రాయితీలతోసహా కల్పించడం. - రాష్ర్టంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, భౌతిక, సామాజిక పర మైన సౌకర్యాలు కల్పించడం, చేయూతనివ్వటం. - ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో అతిముఖ్యమైన రాజభవన్, హైకోర్టు, సెక్రటేరియేట్, శాసనసభ, శాసనమండలి, యితర మౌలిక సదుపాయాలకు ప్రత్యేకమైన ఆర్థిక సహాయం అందించటం. - ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంకోసం అవసరమైతే క్షీణించిపోయిన అటవీ ప్రాంతాన్ని అందుబాటులోనికి తేవడం. సెక్షన్ 95 ప్రకారం నాణ్యమైన ఉన్నత విద్య రెండు రాష్ట్రాల్లోని విద్యా ర్థులకు అందుబాటులో ఉంచడానికి, రాజ్యంగంలోని 371 డి ననుసరించి ప్రభుత్వ రంగంలోనూ, ప్రైవేట్ రంగంలోనూ, ఎయిడెడ్, అనెయిడెడ్ విద్యా సంస్థల్లోనూ... టెక్నికల్, వైద్య విద్యాసంస్థల్లోనూ పది సంవత్సరాల వరకూ ప్రస్తుతమున్న ప్రవేశ పద్ధతులే కొనసాగాలి. అయితే ఈ నిబంధనను ఇప్పు డు ఉల్లంఘిస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలున్నాయి. ఒకటి- చట్టంద్వారా నవ్యాంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలుపరచే విధంగా చూడటం. చట్టంలో పొందుపరచినవన్నీ హక్కులవుతాయి. కనుక వాటిని సాధించుకునే దిశగా కృషి చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమైతే...వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిది. చట్టంలో పొందుపరిచిన హామీలను రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుచేసి నిరంతరం పాటు బడాల్సి ఉంటుంది. ఇక రెండోది- రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీ లనూ... మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన అంశాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచేలా చూడ టం. ఇందుకోసం ఆ చట్టానికి సవరణలు తీసుకురావాలి. అలా సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని పదమూడు జిల్లాల్లో అసంపూర్తిగా వున్న ప్రాజెక్టులు వేలసంఖ్యలో ఉన్నాయి. వాటిని మొదటి దశలో పూర్తి చెయ్యాలి. ఉదాహర ణకు ఇళ్లు నిర్మించినా కిటికీలూ, తలుపులూ పెట్టనివి ఉన్నాయి. అలాగే, ఓవర్‌హెడ్ ట్యాంకులు కట్టినా మోటారు పంపులు అమర్చనివి ఉన్నాయి. వంతెనలున్నా వాటిని అనుసంధానించే రోడ్లను చేపట్టకపోవడం, ఫ్లై ఓవర్లు అరకొరగా వదిలేయడం, చాన్నాళ్లక్రితమే శంకుస్థాపనలు పూర్తయినా నిర్మా ణాలు చేపట్టకపోవడం...ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. వీటన్నిటిపైనా పెట్టిన పెట్టుబడులు వృథాగా మారాయి. ఈ విషయంలో శ్రద్ధపెట్టి పూర్తిచేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, మధ్యకాలిక ప్రణాళిక, స్వల్పకాలిక ఆచరణీయ ప్రణాళిక, మినీ ప్లాన్లు, మైక్రోప్లాన్లు వేసుకుని ముం దుకెళ్తే రాష్ట్రాభివృద్ధికి వీలు కలుగుతుంది. అది వేగవంతమవుతుంది. లేనట్ట యితే ఈ అయోమయ పరిస్థితి యిలాగే కొనసాగుతుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కొలువు దీరిన ప్రభుత్వాలు తమ బాధ్యతలను గుర్తిస్తాయా? (వ్యాసకర్త విశ్రాంత ఆచార్యులు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్) ఫోన్: 9849085411 -
ఏపీకి ప్రత్యేకహోదా ఏదీ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో నవ్యాంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇస్తామని అప్పటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసింది. ఐదేళ్లు చాలవు... కనీసం పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ డిమాండ్ చేసింది. పైగా కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే నవ్యాంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేకహోదా, ప్యాకేజీ కల్పిస్తా మని గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. ఆయనే ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా కల్పన సాధ్యం కాకపోవచ్చంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గత ఎన్నికల్లో ఓటు బ్యాంక్ సొంతం చేసుకోవడానికే ఎన్డీయే కూటమి ఈ హామీ ఇచ్చినట్లు కనిపిస్తోంది తప్ప, అమలు చేయాలన్న చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే, ఇతర రాష్ట్రా ల వారు కూడా అడుగుతారని, అందువల్ల అన్ని రాష్ట్రాల అభిప్రాయా లను పరిగణనలోకి తీసుకోవాలనే దాటవేత ధోరణితో కేంద్రం వ్యవ హరించడం దురదృష్టకరం. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికిచ్చిన హామీలన్నింటినీ సాధించుకొనేందుకు ఇప్పటికైనా ఏపీ సీఎం అఖిల పక్షం ఏర్పాటుచేసి, కేంద్రంతో పోరాడాల్సిన అవసరం ఎంైతైనా ఉంది. రెండు నాల్కల బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలూ చేపట్టాలి. - బట్టా రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూరు, నెల్లూరు -
పెట్టుబడులకు లండన్ కంపెనీలు సిద్ధం: మంత్రి పల్లె
సాక్షి, హైదరాబాద్: నవ్యాంధ్ర ప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి లండన్‌కు చెందిన 16 కంపెనీలు ముందుకొచ్చినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రిటన్ ప్రభుత్వ ఆహ్వానంపై అవుట్ రీచ్ కార్యక్రమం ద్వారా ఈ నెల 3వ తేదీ నుంచి సోమవారం వరకు యూకేలోని లండన్, వెస్ట్ మినిస్టర్, మాంచెస్టర్లలో తాను నిర్వహించిన పర్యటన విజయవంతమైందని పేర్కొన్నారు. -
నవ్యాంధ్ర ప్రదేశ్‌లో మొదటి టాపర్
చంద్రశేఖర్ ఐఏఎస్ మురళీనగర్: మన చంద్రశేఖరుడు ఐఏఎస్ దక్కించుకున్నాడు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు వివిధ కేంద్ర సర్వీసులు కేటాయిస్తూ డిపార్టుమెంటు ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) జాబితాను విడుదల చేసింది. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ప్రథమ ర్యాంకరుగా విశాఖ వాసి చంద్రశేఖర్ ఐఏఎస్ క్యాడరుకు ఎంపికయ్యారు. ఆయన సివిల్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 234 ర్యాంకు సాధించిన విషయం విదితమే. ప్రస్తుత తరంలో చంద్రశేఖర్ ఒక్కరే ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పవచ్చు. మొదట్లో సాధారణ విద్యార్థిగా ఉన్న కిల్లి చంద్రశేఖర్ అంచెలంచెలుగా తన మేధస్సుకు పదును పెట్టుకుంటూ నిరంతర సాధనతో సివిల్స్‌లోనే అత్యున్నత స్థాయి కేడర్ ఐఏఎస్‌కు ఎంపికవడం విశేషం. బీటెక్ చేసిన ఆయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో ఎంబీఏ చేశారు. లండన్‌లో బిజినెస్ కన్సల్టెంటుగా పనిచేస్తూ అమెరికా ఆఫర్‌ను వదిలేసి సివిల్స్ కోసం ప్రయత్నించి విజయం సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబరు 1 తేదీ నుంచి ఫౌండేషన్ కోర్సు నిమిత్తం ఉత్తరాఖండ్‌లోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ తరగతులు ఉంటాయి. ఇది రెండు నెలలు ఉంటుంది. తర్వాత కూడా ఐఏఎస్ క్యాడరుకు ఎంపికైనవారు అక్కడే పూర్తి స్థాయి శిక్షణ పొందుతారు. ఇది స్వాతంత్య్ర దినోత్సవ కానుక నాకు ఐఏఎస్ క్యాడరు కేటాయించడం ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా భావిస్తున్నాను. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో మొదటి స్థానంలో నిలిచి సివిల్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. శిక్షణ అనంతరం నాకు కేటాయించే విధులను సమర్థవంతంగా నిర్వహించి పేద ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందించాలని భావిస్తున్నాను. -కిల్లి చంద్రశేఖర్, విశాఖపట్నం -
కొత్త సభలో మన ఎమ్మెల్యేలు
నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభ్యులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు వరుసగా పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, ముత్తుముల అశోక్‌రెడ్డి.. కొత్త సభలో ప్రమాణస్వీకారం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు శిద్దా రాఘవరావు, కదిరి బాబూరావు, దామచర్ల జనార్దన్, ఏలూరి సాంబశివరావు, డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి -
మరో మజిలీ...
రాజధాని లేని రాష్ట్రంగా... అవశేషాంధ్రప్రదేశ్ ఇప్పుడు మనముందు నిలిచింది. ఎంత త్వరగా జవసత్వాలు కూడదీసుకుని నవ్యోత్సాహంతో ప్రగతి పథంలో దూసుకుపోనుంది అన్నదే ప్రతి తెలుగువాడి మదిలోని ప్రశ్న. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలని అయిదున్నర కోట్ల ఆంధ్రులు కోరుకుంటున్నారు. డాక్టర్ గోపరాజు నారాయణరావు: ఆంధ్రప్రదేశ్‌కు 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. విశాఖపట్నం సహా ఈ రేఖ పొడవునా నౌకాశ్రయాలు ఉన్నాయి. ఆర్ధర్ కాటన్ కృషితో వచ్చిన ధవళేశ్వరం బ్యారేజి మొదలు నాగార్జునసాగర్, శ్రీశైలం, తుంగభద్ర, ప్రకాశం, కేసీ కెనాల్ ఇంకా రిజర్వాయర్లు, జల పథకాలు, ప్రాజెక్టులు ఉన్నాయి. తిండిగింజలు పండే భూములే ఎక్కువ. బెరైటీస్, బాక్సైట్, బెరిల్, క్రోమైట్, ఇనుము, మాంగనీసు, అభ్రకం, అపార సహజవాయువు నిల్వలు ఉన్నాయి. ఇక్కడి వజ్రపుగనులూ ప్రసిద్ధిగాంచినవే. నిజానికి ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ ఇక్కడే దొరికింది. వీటి ఆసరాగా పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన తక్షణ అవసరం. ‘కేపిటల్’ పనిష్మెంట్ ఆంధ్రరాష్ట్రం అవతరించినపుడు మద్రాసును రాజధానిగా కోరవద్దని నెహ్రూ ప్రభుత్వం సలహా ఇచ్చింది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచడం సాధ్యం కాదని మన్మోహన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ రెండు పర్యాయాలు సీమాంధ్రులకే రాజధాని సమస్య వచ్చింది. నిజానికి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షలో రెండు అంశాలు ఉన్నాయని చెప్పేవారూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధనతో పాటు, కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసును రాజధానిని చేయాలన్నది కూడా శ్రీరాములుగారి డిమాండ్‌గా చెబుతారు. కానీ అంతకు ముందే జేవీపీ కమిటీ మద్రాసు కోసం పట్టుపట్టవద్దని సూచించింది. మద్రాసును తాత్కాలికంగా అయినా ఆంధ్రుల రాజధానిగా ఉపయోగించడానికి నాటి ముఖ్యమంత్రి పిఎస్ కుమారస్వామి రాజా నాయకత్వంలోని విభజన కమిటీ కూడా అంగీకరించలేదు. దీంతో కర్నూలులో వేసుకున్న గుడారాల నుంచే కొత్త రాష్ట్ర పాలన ఆరంభమైంది. అరవయ్యేళ్ల కాపురం తరువాత ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. ఇప్పుడు మళ్లీ రాజధాని సమస్య ఆంధ్రప్రదేశ్ మెడకే చుట్టుకుంది. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఇది ఊరట ఇచ్చే అంశం కూడా కాదు. విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేశాక కొత్త రాజధానిగా విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు, ఒంగోలు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి పేర్లు పత్రికలలో హోరెత్తాయి. వీటిలోనే కొన్ని నగరాలకు శివరామకృష్ణన్ కమిటీ వెళ్లింది. హైదరాబాద్ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చెందిన పెద్ద నగరం విశాఖ. ఇక్కడ నౌకాశ్రయం ఉంది. విమానాశ్రయం ఉంది. కానీ ఒక మూలకు విసిరేసినట్టు ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ వాసులకు సుదూర ప్రాంతమన్న అభిప్రాయం ఉంది. హఠాత్తుగా తెర మీదకు వచ్చిన పేరు ఒంగోలు. ప్రకాశం జిల్లా రాజధాని కేంద్రమైన ఒంగోలు కోస్తాంధ్రకూ, సీమకూ దగ్గరగానే ఉంటుంది. కానీ వేసవిలో ఇక్కడ ఎదుర్కొనవలసి వచ్చే నీటి ఎద్దడి భయపెడుతోంది. కర్నూలుకే రాజధాని అవకాశం రావాలని ఆ ప్రాంత నాయకులు ముందే కోరారు. కానీ మౌలిక వసతుల లేమితో పాటు, 2009 వరదల దెబ్బ నుంచి ఈ నగరం ఇప్పటికీ కోలుకోలేదన్న వాదం ఉంది. రాజమండ్రి పేరు వినిపిస్తున్నా, భూమి సమస్య అడ్డువచ్చే అవకాశం ఎక్కువ. కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 7500 ఎకరాల అటవీ భూమిని దృష్టిలో ఉంచుకుని రాజమండ్రిని రాజధానిని చేయాలని ఒక డిమాండ్ ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఖాయమని తేలిన తరువాత ఎక్కువగా వినిపించిన పేరు గుంటూరు-విజయవాడ. జిల్లాలో 1,34,420 హెక్టార్ల అటవీ భూములు ఉన్నాయి. ఇంతకీ శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు ఎలా ఉండబోతున్నాయి? అయితే ఆ సిఫార్సులతోనే రాజధానిపై తుది నిర్ణయం జరిగిపోదు. కొత్త ప్రభుత్వం ప్రతిపాదన, ప్రతిపక్షం సూచనలు, వాదోపవాదాలు తప్పనిసరి. ఏమైనా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని వ్యవహారం ఇప్పుడే తేలేది మాత్రం కాదు. కీలక ఘట్టాలు... 1953 అక్టోబర్ 1: మద్రాసు నుంచి విభజన.. కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1: తెలంగాణ జిల్లాలతో కలిపి హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రం 2009 డిసెంబర్ 9: రాష్ట్ర విభజన ప్రకియ ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన 2013 అక్టోబర్ 3: తెలంగాణ బిల్లుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం 2014 ఫిబ్రవరి 18: లోక్‌సభలో బిల్లు ఆమోదం, 20న రాజ్యసభలోనూ ఆమోదం 2014 మార్చి 4: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై గెజిట్ జారీ చేసిన రాష్ట్రపతి 2014 జూన్ 2: అపాయింటెడ్ డే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన ప్రకటన 2014 జూన్ 8: ఆంద్రప్రదేశ్ సీఎంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రమాణం