బొమన్ ఇరానీ పాత్రలో..!
ఇప్పటివరకూ ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు చేసి, విలక్షణ నటుడనిపించుకున్న ప్రకాశ్‌రాజ్ ఇప్పుడు హిందీ చిత్రం ‘జాలీ ఎల్.ఎల్.బి’ రీమేక్‌లో మరో వైవిధ్యమైన పాత్ర చేయనున్నారు. ఈ చిత్రం అంగీకరించిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకాశ్‌రాజ్ ధృవీకరించారు.
అయితే, ఏ పాత్ర చేయనున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అర్షద్ వార్షీ, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు, రివార్డులు కూడా సొంతం చేసుకుంది.
అహ్మద్ దర్శకత్వంలో ఈ చిత్రం తమిళంలో పునర్నిర్మితం కానుంది. హిందీలో బొమన్ ఇరానీ చేసిన పాత్రను తమిళంలో ప్రకాశ్‌రాజ్, అర్షద్ వార్షీ పాత్రను ఉదయనిధి స్టాలిన్ చేయనున్నారని సమాచారం.