రెండు ఫ్రంట్ స్పీకర్లతో జోలో క్యూ700 క్లబ్
రెండు ఫ్రంట్ స్పీకర్లు... మూడు నెలలపాటు ఆడియో, వీడియో ఫైళ్ల ఉచిత డౌన్లోడింగ్ సౌకర్యం... రూ.7000 ధర. ఇవీ దేశీ కంపెనీ జోలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ క్యూ00 క్లబ్ తాలూకూ హైలైట్స్. కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ దుమ్మూ, ధూళిలతోపాటు కొంతమేరకు నీటిని కూడా తట్టుకోగలగడం విశేషం. ఇక ఫీచర్ల విషయానికొస్తే... ఈ స్మార్ట్‌ఫోన్ 4.5 అంగుళాల స్క్రీన్‌సైజు కలిగి ఉంటుంది. నాలుగు కోర్ల ప్రాసెసర్ 1.3 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు మాలీ 400 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉండటం వల్ల వీడియో గేమింగ్ అనుభూతి మెరుగ్గా ఉంటుంది. క్యూ700 క్లబ్ ర్యామ్ ఒక జీబీకాగా, ప్రధాన మెమరీ 8 జీబీ వరకూ ఉంటుంది.
మైక్రోఎస్డీకార్డు ద్వారా దీన్ని 32జీబీల వరకూ పెంచుకోవచ్చు కూడా. దీంట్లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 5 మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా, 0.3 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా ఫేస్ రికగ్నిషన్, పనోరమా, జియోట్యాగింగ్, బెస్ట్షాట్, స్మైల్షాట్, హెచ్డీ రికార్డింగ్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. దాదాపు 4.5 అంగుళాల స్క్రీన్సైజున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో త్రీజీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వైఫై, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లున్నాయి.