అమెరికాలో హంతకుడికి 249 ఏళ్ల జైలు శిక్ష
ఫీనిక్స్: ఆరుగురు బౌద్ధ సన్యాసులు సహా మొత్తం 9 మందిని అత్యంత దారుణంగా కాల్చి చంపి, దోపిడీకి పాల్పడిన నరహంతకుడికి అమెరికాలోని ఫీనిక్స్లో ఉన్న మారికోపా కౌంటీ సుపీరియర్ కోర్టు 249 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ హత్యలకు పాల్పడిన సమయంలో దోషి వయసు 17 ఏళ్లే కావడం.. హత్యకు గురైన వారు శాంతి కాముకులు కావడం, హత్య, దోపిడీ జరిగిన ప్రాంతం బౌద్ధాశ్రమం కావడంపై న్యాయమూర్తి జోసెఫ్ క్రీమర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనను అత్యంత పాశవికమైందిగా అభివర్ణించిన ఆయన మృతులందరూ శాంతిని అభిలషించేవారని, కలలో కూడా విధ్వంసాన్ని కోరుకునేవారు కాదని అన్నారు.