joshna chinnappa
-
ఫైనల్లో జోష్న
హాంకాంగ్: ప్రతిష్టాత్మక హాంకాంగ్ ఇన్విటేషనల్ పీఎస్ఏ హెచ్కేఎఫ్సీ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్ జోష్నా చిన్నప్ప ఫైనల్‌కు చే రింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో జోష్న 8- 11, 11-9, 12-10, 7-11, 11-9 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆన్నీ ఆవ్పై గెలుపొందింది. శనివారం జరిగే టైటిల్ పోరులో జోష్న న్యూజిలాండ్‌కు చెందిన జోలీ కింగ్‌తో తలపడనుంది. -
ముగిసిన జోష్నా పోరు
కౌలాలంపూర్ (మలేసియా): ప్రపంచ మహిళల స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో భారత నంబర్‌వన్, ప్రపంచ 14వ ర్యాంకర్ జోష్నా చిన్నప్ప 3-11, 6-11, 3-11తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లారా మసారో (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయింది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో జోష్నా తన ప్రత్యర్థికి ఏదశలోనూ పోటీనివ్వలేదు. ఇదే టోర్నీలో భారత్‌కే చెందిన మరో క్రీడాకారిణి దీపిక పళ్లికల్ తొలి రౌండ్లోనే ఓడిపోయిన సంగతి తెలిసిందే -
విజేత జోష్న చిన్నప్ప
ముంబై : భారత స్క్వాష్ మేటి క్రీడాకారిణి జోష్న చిన్నప్ప ఎన్ఎస్సీ ఓపెన్ టోర్నమెంట్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ జోష్న 11-8, 11-9, 11-6తో టాప్‌సీడ్ హబీబా మహ్మద్ (ఈజిప్టు)పై నెగ్గింది. 47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయి తొలి గేమ్‌లో ట్రేడింగ్ పాయింట్లతో సత్తా చాటింది. రెండో గేమ్‌లో 1-3 వెనుకబడ్డ జోష్న మ్యాచ్ మధ్యలో గాయంతో ఇబ్బంది పడింది. ప్రత్యర్థి రాకెట్ ముక్కుకు బలంగా తాకడంతో రక్తస్రావమైంది. అయితే 10 నిమిషాల చికిత్స తర్వాత మళ్లీ గేమ్‌ను మొదలుపెట్టినా... హబీబా దూకుడుకు 2-6తో వెనుకబడింది. అయితే పట్టు వదలకుండా పోరాడిన భారత ప్లేయర్ అద్భుతమైన డ్రాప్స్‌తో చకచకా పాయింట్లు సాధించింది. ఇక మూడో గేమ్‌లో ఇద్దరు క్రీడాకారిణిలు పాయింట్ల కోసం హోరాహోరీగా పోరాడారు. అయితే ఈజిప్టు అమ్మాయి చేసిన మూడు అనవసర తప్పిదాలతో మ్యాచ్ జోష్న సొంతమైంది. -
స్క్వాష్ ఫైనల్స్‌లోకి దీపిక జోడీ
ఆసియా క్రీడల్లో భారత ఖాతాలో మరో రజతం లేదా స్వర్ణం రావడం ఖాయమైపోయింది. కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రతిభతో స్వర్ణపతకం సాధించిన భారత అమ్మాయిల జోడీ దీపికా పల్లికల్, జోష్న చిన్నప్ప ఆసియా క్రీడల్లోనూ ఫైనల్స్‌లోకి ప్రవేశించారు. సెమీ ఫైనల్స్‌లో దక్షిణ కొరియా జట్టును 2-0 తేడాతో ఓడించి వాళ్లీ ఘనత సాధించారు. ఇప్పుడు ఫైనల్స్‌లో మలేసియా జట్టుతో పోటీ పడబోతున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా నెగ్గితే ఇక స్వర్ణపతకం వచ్చేసినట్లే. ప్రపంచ నెంబర్ 21 ర్యాంకర్ అయిన జోష్న యూనక్ పార్క్‌ను కేవలం 34 నిమిషాల్లోనే 3-0 తేడాతో ఓడించింది. మరోవైపు ప్రపంచ 12వ ర్యాంకర్ అయిన దీపిక సున్మీ సాంగ్‌పై 37 నిమిషాల్లో 3-1 తేడాతో గెలిచింది. మరో సెమీ ఫైనల్లో మలేసియా జట్టు హాంగ్‌కాంగ్ జట్టును 2-0 తేడాతో ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్ మ్యాచ్ శనివారం జరగనుంది.