విజేత జోష్న చిన్నప్ప | The winner josna Chinnappa | Sakshi
Sakshi News home page

విజేత జోష్న చిన్నప్ప

Published Mon, Sep 7 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

విజేత జోష్న చిన్నప్ప

విజేత జోష్న చిన్నప్ప

ముంబై : భారత స్క్వాష్ మేటి క్రీడాకారిణి జోష్న చిన్నప్ప ఎన్‌ఎస్‌సీ ఓపెన్ టోర్నమెంట్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 24వ ర్యాంకర్ జోష్న 11-8, 11-9, 11-6తో టాప్‌సీడ్ హబీబా మహ్మద్ (ఈజిప్టు)పై నెగ్గింది. 47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత అమ్మాయి తొలి గేమ్‌లో ట్రేడింగ్ పాయింట్లతో సత్తా చాటింది. రెండో గేమ్‌లో 1-3 వెనుకబడ్డ జోష్న మ్యాచ్ మధ్యలో గాయంతో ఇబ్బంది పడింది.

ప్రత్యర్థి రాకెట్ ముక్కుకు బలంగా తాకడంతో రక్తస్రావమైంది. అయితే 10 నిమిషాల చికిత్స తర్వాత మళ్లీ గేమ్‌ను మొదలుపెట్టినా... హబీబా దూకుడుకు 2-6తో వెనుకబడింది. అయితే పట్టు వదలకుండా పోరాడిన భారత ప్లేయర్ అద్భుతమైన డ్రాప్స్‌తో చకచకా పాయింట్లు సాధించింది. ఇక మూడో గేమ్‌లో ఇద్దరు క్రీడాకారిణిలు పాయింట్ల కోసం హోరాహోరీగా పోరాడారు. అయితే ఈజిప్టు అమ్మాయి చేసిన మూడు అనవసర తప్పిదాలతో మ్యాచ్ జోష్న సొంతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement