కౌలాలంపూర్ (మలేసియా): ప్రపంచ మహిళల స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 14వ ర్యాంకర్ జోష్నా చిన్నప్ప 3-11, 6-11, 3-11తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లారా మసారో (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయింది.
ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో జోష్నా తన ప్రత్యర్థికి ఏదశలోనూ పోటీనివ్వలేదు. ఇదే టోర్నీలో భారత్‌కే చెందిన మరో క్రీడాకారిణి దీపిక పళ్లికల్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన సంగతి తెలిసిందే
ముగిసిన జోష్నా పోరు
Published Thu, Apr 28 2016 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM
Advertisement
Advertisement