సీఈసీగా అచల్ జోతి
► మోదీ హయాంలో గుజరాత్ సీఎస్‌గా చేసిన అచల్
► రేపు బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నసీమ్ జైదీ వారసుడిగా 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అచల్‌కుమార్ జోతిని కేంద్రం నియమించింది. ప్రధాని మోదీ సీఎంగా ఉన్న సమయంలో జోతి గుజరాత్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. జైదీ పదవీ కాలం బుధవారంతో ముగు స్తున్న నేపథ్యంలో అచల్‌ను నియమిస్తూ న్యాయ శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
2013లో గుజరాత్ సీఎ స్‌గా రిటైర్ అయిన 64 ఏళ్ల అచల్ జోతి... 21వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా గురువారం బాధ్యతలు చేపడతారు. 2015 మే 8న ముగ్గురు సభ్యు ల ఎన్నికల కమిషన్‌లో జోతి సభ్యుడిగా నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరి 17 వరకు ఆయన సీఈసీగా కొనసాగుతారు. సీఈసీ, ఈసీల పదవీ కాలం ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు. రెండిటిలో ఏది ముందు వస్తే దాన్నే పరిగణ లోకి తీసుకొంటారు.
అత్యున్నత హోదాల్లో సేవలు...
గుజరాత్ సీఎస్‌గా రిటైర్ అయిన జోతి గతంలో విభిన్న హోదాల్లో సేవలందించారు. గుజరాత్ విజిలెన్స్ కమిషనర్‌గా, 1999– 2004 మధ్య కాలంలో కాండ్లా పోర్ట్ ట్రస్టు చైర్మన్‌గా, సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ (ఎస్ఎస్ఎన్ఎన్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.