breaking news
Jubilee Hills bypoll
-
Jubilee Hills bypoll: అగ్గిపెట్టె.. సబ్బుపెట్టె..
హైదరాబాద్: అగ్గిపెట్టె, సబ్బుపెట్టె, పండ్లబుట్ట, ఇటుక, కత్తెర, గాజు.. ఇవన్ని ఏమిటని అనుకుంటున్నారా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉండగా 3 ప్రధాన పార్టీల అభ్యర్థులను పక్కనబెడితే మిగతావారికీ గుర్తుల కేటాయింపు ఎన్నికల అధికారులకు సవాల్‌గా నిలిచింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో రకరకాల గుర్తులను తీసుకోవాల్సి వచ్చింది. ఇందులో ఇటుకలతో పాటు కత్తెర, గాజులు కూడా కేటాయించారు. సీసీ టీవీ కెమెరా, కూలర్, బెలూన్, ల్యాప్‌ట్యాప్, టీవీ రిమోట్, డిష్ యాంటెనా, డోలి, సైకిల్‌కు గాలి కొట్టే పంపు, బెల్టు, హెల్మెట్, బేబీ వాకర్, ఆపిల్, ద్రాక్ష.. ఇలా చిత్ర విచిత్రంగా గుర్తులు కేటాయించారు. జూబ్లీహిల్స్‌లో ఇప్పటివరకు 58 మంది అభ్యర్థులు పోటీపడిన దాఖలాలు లేవు. ఇందులో 50 మందికి పైగా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. వారిక గుర్తుల కేటాయింపు ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. ఈసారి ప్రెషర్ కుక్కర్, చపతీ రూలర్, బ్రీఫ్‌కేస్, ఉంగరం, వజ్రం, బైనోక్యూలర్స్.. ఇన్నో ఎన్నో రకాల గుర్తులను కేటాయించారు. ఇక అభ్యర్థులు తమ గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి బెల్టు కూడా ఓ అభ్యర్థికి గుర్తుగా వచి్చంది. గుర్తులను సేకరించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ఎంతో వడబోసి చివరకు గుర్తులను సేకరించి కేటాయించి హమ్మయ్యా..! అంటూ ఊపిరిపీల్చుకున్నారు. -
Jubilee Hills Bypoll: ఏంటీ కార్పెట్ బాంబింగ్?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమల దళం కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాజకీయాల్లో మొదటిసారిగా మంగళవారం కార్పెట్ బాంబింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్, రాజస్థాన్ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్, శాసన సభ, శాసన మండలి సభ్యులు, ఇతర ముఖ్య నాయకులంతా ఒక్కసారిగా నియోజకవర్గాన్ని చుట్టుముట్టనున్నారు. ప్రచార కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో గల్లీగల్లీ బీజేపీ నేతలతో కిక్కిరిసిపోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ప్రచారంలో వెనుకబడ్డారన్న ఆరోపణలను పటాపంచలు చేయాలని భావిస్తోంది. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు నేతలంతా జూబ్లీహిల్స్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించింది.ఏంటీ కార్పెట్ బాంబింగ్?కుండపోత వర్షానికి క్లౌబ్ బరెస్ట్ అన్నట్లు రాజకీయాల్లో ఒక్కసారిగా అలాంటి ప్రభావంతమైన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కార్పెట్ బాంబింగ్ అంటారు. ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాచుర్యంలో ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్టార్ క్యాంపెయినర్స్ 40 మందితో పాటు రాష్ట్ర నేతలందరూ ప్రచారంలో పాల్గొననున్నారు. బీజేపీ నేతలతో నియోకవర్గ వీధులన్నీ కిక్కిరిసిపోవడం ఖాయమని నేతలు పేర్కొంటున్నారు.ప్రాంతీయ అభిమానాన్ని కొల్లగొట్టాలి..నియోజకవర్గంలో ప్రాంతీయాభిమానాన్ని కొల్లగొట్లాని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఏ కాలనీలో ఏ ప్రాంతానికి చెందిన ప్రజలు ఉన్నారు. వారిని ప్రభావితం చేసే నేతలను గుర్తించి, ప్రచార కార్యక్రమంలో వారిని భాగస్వాములను చేయాలని యోచిస్తోంది. దీంతో ఉత్తరాది నుంచి వచి్చన వలస ఓటర్ల కోసం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్, ఇతర నేతలను ప్రచారంలోకి దించుతున్నారు. అదే సమయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల వారిని ఆకర్షించడం, జీఎఎస్టీ స్లాబ్‌లను తగ్గించడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించడానికి కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలాసీతారామన్ తో పాటు ఇతర నేతలను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పార్టీ ప్రచార కార్యక్రమాల్లోముమ్మరంగా పాల్గొనున్నారు.ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలుజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే శాసన సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ అంటూ నేతలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రావాలంటే జూబ్లీహిల్స్ విజయంతో నాంధి పలకాలని పార్టీ నాయకత్వం చెబుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేరు, కార్పొరేటర్లు అంతంతే. బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నా ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో లేదు. దీంతో వచ్చే ఏడాది జీహెచ్ఎంసీలో బీజేపీ జెండా ఎగురవేయాలని క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో, రాష్ట్రంలో బీజేపీ కుర్చీ దక్కించుకోవాలంటే జూబ్లీహిల్స్‌లో విజయం సాధించాలని నేతలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే కేంద్ర, రాష్ట్ర ముఖ్య నేతలతో స్టార్ క్యాంపెయినర్స్‌ను ఈ ఉప ఎన్నిక ప్రచారంలోకి దించుతున్నారు. -
ఎవరికి సినిమా చూపిస్తారో..?
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ నియోజక వర్గం ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు సినీ కార్మికుల ఓట్లను పొందేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సినీ కార్మికుల మద్దతు కూడగట్టేందుకు మూడు పార్టీల అభ్యర్థులు అందుకు తగిన ప్రచారంతో, హామీలతో ముందుకు వస్తున్నారు. పదుల సంఖ్యలో ఉండే సినీ తారలు, దర్శక నిర్మాతలు, సినీ రచయితలు, కొరియోగ్రాఫర్లు, ఫైట్ మాస్టర్లు, ప్రముఖ నటీ నటులు ఈ నియోజక వర్గంలో లేకపోయినా తెర వెనుక పనిచేసే 24 వేల మంది సినీ కార్మికులు ఈ నియోజక వర్గ పరిధిలోనే ఉంటూ ఓటు హక్కు కూడా కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. నియోజక వర్గ పరిధిలోని శ్రీకృష్ణానగర్, వెంకటగిరి, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, బోరబండ, ఎర్రగడ్డ, షేక్‌పేట తదితర డివిజన్ల పరిధిలో లైట్‌బాయ్‌లు, జూనియర్ ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు, ప్రొడక్షన్ సభ్యులు, డ్రైవర్లు ఇలా సినీ షూటింగ్‌లకు పనిచేసే కారి్మకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించినా అక్కడున్న రాజకీయాలు, అవినీతి అక్రమాలు స్వార్థపూరిత నాయకత్వంతో వేలాది మంది కారి్మకులకు ఇళ్లు దక్కలేదు. అంతేకాదు వీరికి ఆరోగ్య బీమా సౌకర్యం కూడా లేకుండా పోయింది. ప్రభుత్వాలు మారినా సినీ కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జీవితాలు మారుస్తామని నేతలు హామీ ఇవ్వడమే తప్ప ఏ ఒక్కరు చొరవ చూపింది లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నిక నేపథ్యంలో మరోసారి ఆయా పార్టీల అభ్యర్ధులకు సినీ కార్మికులు గుర్తుకు వస్తున్నారు.పరిశ్రమతో ముగ్గురికీ అనుబంధం..సినీ పరిశ్రమతో బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత భర్త మాగంటి గోపీనాథ్‌కు మంచి సంబంధాలు ఉండేవి. ఆయన రవన్న, పాతబస్తీ అనే రెండు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మొదటి నుంచి సినీ వర్గాలతో మంచి సంబంధాలు నెలకొల్పారు. కారి్మక సంఘాలతోనూ అనుబంధం ఉంది. అంతే కాకుండా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సినీకార్మికులులతో సంబంధాలు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో కార్మికుల మద్దతు పొందేందుకు బీఆర్ఎస్ తగిన వ్యూహాలు రచిస్తోంది.⇒ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు గత నాలుగు దశాబ్ధాలుగా సినీ కార్మిమక సంఘాలతోనూ, వర్కర్స్తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్‌కు పలుమార్లు సార్లు సలహాదారుగా పని చేశారు. ఆయన తనయుడు వెంకట్ హీరోగా సినిమాలు కూడా నిర్మించారు. సినీ హీరో సుమన్, ఆయనకు మద్దతుగా ప్రచారం కూడా చేస్తున్నారు. దీంతో సినీ కార్మికుల మద్దతు ఎక్కువగా తమకే ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ⇒ బీజేపీ అభ్యర్ధి లంకల్ దీపక్‌రెడ్డి గతంలో టీడీపీలో ఉండేవారు. అప్పటి నుంచే సినీ పరిశ్రమతో ఆయనకు మంచి సంబంధాలు ఉండటమే కాకుండా కారి్మక నాయకులతోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారు. సినీ కార్మికుల మద్దతును కూడగట్టేందుకు ఆయన తన పాత పరిచయాలను వినియోగించుకుంటున్నారు. ⇒ గత మూడు నాలుగు రోజులుగా ఆయా పార్టీల అభ్యర్ధులు సినీ కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో తమకు ఓట్లు వేయాలంటూ సినీ కార్మికులతో పాటు వారి నాయకులను కూడా అభ్యర్థిస్తున్నారు. సినీ తారలతో సినీ కార్మికులు ఉండే ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని కూడా యోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో పరిశ్రమకు చెందిన ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారితో ప్రచారం నిర్వహించాలని కూడా భావిస్తున్నారు.. మొత్తానికి మొట్ట మొదటిసారిగా సినీ కారి్మకుల మద్దతు కూడగట్టేందుకు వారిని ఆకట్టుకునేందుకు , బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ⇒ ఆ దిశగా ప్రచారం కూడా చేయాలని వారి సమస్యలను పరిష్కరిస్తామని, హామీ ఇవ్వాలని కూడా వీరు పేర్కొంటున్నారు. నియోజక వర్గం పరిధిలో పెద్ద సంఖ్యలో సినీ కారి్మకులు ఉంండే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన అభ్యర్థులు, ఆ ఆప్రాంతాల్లో తమకు స్నేహితులైన హీరోలతో ప్రచారం చేయించనున్నారు. సుమారుగా 24 వేల మంది సినీ కార్మికులు ఉన్న ఈ నియోజక వర్గంలో నవంబర్ 11న మెజార్టీ కారి్మకులు ఎవరి వైపు మొగ్గుతారో వేచి చూడాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీరికి ఇళ్లు దక్కకపోగా భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన వారికి ఇళ్లు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, ప్రత్యేక తెలంగాణ రావడం జరిగిపోయింది. ఇప్పుడు కారి్మకులంతా ఎవరివైపు మొగ్గుచూపుతారో చూడాల్సి ఉంది. -
రేపు జూబ్లీహిల్స్‌లో సీఎం రోడ్ షో
సాక్షి హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈ నెల 28న సీఎం రేవంత్‌రెడ్డి రోడ్ షో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు మద్దతుగా సీఎం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని నాలుగు డి విజన్లలో రోడ్‌షోలో పాల్గొంటారన్నారు.అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పాయి. -
కాంగ్రెస్‌కు ఓటేస్తే ఇంటికి బుల్డోజర్: కేటీఆర్
బంజారాహిల్స్/గోల్కొండ: రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఆదివారం తెలంగాణ హోటల్స్ కార్మీక యూనియన్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్మీక నాయకులు బీఆర్ఎస్లో చేరగా వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలోనూ, అనంతరం జూబ్లీహిల్స్ ప్రచారంలోనూ కేటీఆర్ మాట్లాడారు. ‘మంత్రి ఓఎస్డీ తుపాకీతో బెదిరించారని మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారు. మంత్రి బిడ్డ బయటకు వచ్చి తుపాకీ ఇచ్చింది రేవంత్‌రెడ్డి, రోహిన్‌రెడ్డి అని చెప్పారు.. మంత్రి భర్త తుపాకీ ఇచ్చారని పోలీసులు అంటున్నారు. రాష్ట్రంలో రౌడీషీటర్ల పాలన నడుస్తోంది’అని అన్నారు. తుపాకీ రోహిన్‌రెడ్డి పెట్టిండా.. సుమంత్ పెట్టిండా అని ప్రశ్నించారు. అలీబాబా దొంగల ముఠాలా పాలన తయారైందన్నారు. లిక్కర్ బాటిల్స్ స్టిక్కర్ కాంట్రాక్ట్ కోసం సీఎం అల్లుడు, మంత్రి కొడుకు పోటీ పడ్డారని, ఎవరికీ చెప్పలేక ఐఏఎస్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదని, ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాలేదన్నారు. హైడ్రాలో పేదవాళ్లకు మాత్రమే రూల్స్ ఉంటాయని, పెద్దవాళ్లకు రూల్స్ ఉండవన్నారు. రేవంత్‌రెడ్డి కుటుంబం, తమ్ముళ్లు, మంత్రులు దోచుకోవడంపై దృష్టి పెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి చరిత్ర మీకు తెలుసునని, రౌడీషీటర్లు, నేరచరిత్ర, బెదిరింపులకు పాల్పడే వాళ్లను గెలిపిస్తారా? అన్నారు. కారు కావాలో.. బుల్డోజర్ కావాలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బుల్డోజర్ ఇంటికి వస్తుందన్నారు. మైనార్టీలకు ప్రాతినిధ్యమేదీ? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రగతిని, రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను చూసి ప్రజలు జూబ్లీహిల్స్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తొలిసారి వచ్చిందన్నారు. ఓవైపు ముఖ్యమంత్రి సెక్యులర్ ప్రభుత్వం అంటూనే మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో లోపాయికారిగా పని చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని, ఈ విషయంపై రాహుల్‌గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం స్వయంగా ముఖ్యమంత్రితోపాటు ఆయన మంత్రులకూ లేదని ఎద్దేవాచేశారు. జూబ్లిహిల్స్‌లో రౌడీ కుటుంబానికి చెందిన వారికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని, లోపాయికారిగా ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తుపెట్టుకుందని ఆరోపించారు. -
కమలానికి జూబ్లీహిల్స్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు జరుగుతోంది. నామినేషన్ల పర్వం ముగియడంతో బరిలో నిలిచిన పార్టీలు, అభ్యర్థుల బలాబలాలు, ఇతర అంశాలు చర్చకు వస్తున్నాయి. వచ్చేనెల 11న పోలింగ్ జరగనుంది. ప్రచారానికి ఇంకా సమయం ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలకు అన్ని పార్టీలు పదునుపెడుతున్నాయి. ఇలాంటి కీలక పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా సమన్వయంతో కలిసి పనిచేస్తారా లేదా అన్నదే బీజేపీలో పెద్ద ప్రశ్నగా మారింది. పార్టీలో నాయకుల మధ్య సమన్వయం ఉందని చెప్పుకోవడానికి ఈ ఎన్నిక మంచి అవకాశంగా నాయకత్వం భావిస్తోంది.కిషన్‌రెడ్డిపైనే భారం.. ఎన్నికల ప్రచారంలో ముఖ్యనేతలు ఎక్కువ సంఖ్యలోనే పాల్గొంటున్నా.. ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతుందా లేదా అన్న సందేహాలు పార్టీ నాయకుల్లో వ్యక్తమౌతున్నాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే భారమంతా ఆయనపైనే పడుతోంది. పార్టీ గెలిచినా ఓడినా బాధ్యత అంతా కిషన్‌రెడ్డిదే అనే ప్రచారం పార్టీలో సాగుతోంది. దీంతో కిషన్‌రెడ్డి ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి మార్గదర్శనంలోనే ఎన్నికల ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలలుగా కిషన్‌రెడ్డి ఈ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు పలు కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. డివిజన్లవారీగా ఇన్చార్జిలను నియమించి ప్రచారం చేపడుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన లంకల దీపక్‌రెడ్డికి 25 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో కూడా ఆయనకే పార్టీ టికెట్ ఇవ్వటంతో ఈసారి కచి్చతంగా మెరుగైన ప్రదర్శన చూపడంతోపాటు గెలుపు వాకిట నిలిచే అవకాశాలు కొట్టిపారేయలేమని కమలం నేతలు అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల ఇమేజ్.. నియోజకవర్గంలో దీపక్‌రెడ్డికి ఉన్న పరిచయాలను బేరీజు వేస్తే బీజేపీ గెలుపు కష్టమేమీ కాదన్న ఆశాభావంతో ఆ పార్టీ నేతలున్నారు. ఏపీ ప్రాంత ఓట్లకు గాలం... ఈ నియోజకవర్గ పరిధిలో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారి ఓట్లు కూడా గణనీయంగా ఉండడంతో ఆ ఓట్లపై కన్నేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీఎన్వీ మాధవ్, మాజీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే సుజనాచౌదరి తదితరులున్నారు. వీరి ద్వారా ఆంధ్ర ప్రాంత ఓటర్లను ఆకర్షించేలా ప్రత్యేక ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వారి ఓట్లను వేయించుకోగలిగితే విజయావకాశాలు మెరుగవుతాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ దిశలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. వివిధ కులాలు, వర్గాల ముఖ్యనేతలు, సంఘాలు, ప్రభావం చూపే వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. తమ పార్టీల్లోని ఆయా సామాజికవర్గాల ముఖ్యనేతల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. గతంలో ఇక్కడ టీడీపీ ప్రాబల్యం ఉండగా... ఇప్పుడు ఆ పార్టీ పోటీలో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని పైకి చెబుతున్నా.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేనలు బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. -
ఏం చేసిందని కాంగ్రెస్‌కు ఓటెయ్యాలి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఏం చేసిందని.. హస్తం పార్టీకి ఓటు వేయాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ బీ టీమ్ అంటూ మాపై నిందలు వేసి.. కాంగ్రెస్ నేతలు మాత్రం దోస్తీ చేస్తారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి పొందింది అని చెప్పుకొచ్చారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్బంగా మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి షేక్‌పేట డివిజన్ పర్యటించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘2014 నుంచి పదేళ్లలో హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేశాం. 2014 కంటే ముందు ప్రతి అపార్ట్మెంట్ ముందు జనరేటర్లు ఉండేవి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా జనరేటర్లు మాయమయ్యాయి. గంగా-జమున తహసీబ్ సంస్కృతి ఉన్న ఇక్కడ ఎప్పుడు మతకల్లోలాలు జరగలేదు. పదేళ్ల పాలనలో అందరూ ప్రశాంతంగా జీవించారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాలు, క్రిస్టమస్ గిఫ్టులు అందించాం. కేసీఆర్ హిందు. ఆయన ఎన్నో యాగాలు చేశారు. అయినా ప్రతి మతాన్ని గౌరవించారు. కొత్త సచివాలయం నిర్మించినప్పుడు అక్కడ ఒక మజీద్, ఒక చర్చి, ఒక దేవాలయం నిర్మించారు. ఆయన సెక్యులర్ లీడర్ అనే దానికి ఇది ఒక నిదర్శనం. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలో ఒకసారి ఆలోచించాలి. ఏం చేశారని వారికి ఓటేయాలి?. ప్రజలు ఆదరించే వ్యక్తిని కొన్ని పార్టీలు ఏదో ఒక సాకుతో ఆదరణ లేకుండా చేస్తాయి. బీజేపీతో బీ టీమ్ అని మాపై నిందలు వేస్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లు నడిస్తే వ్యతిరేకించే రాహుల్ గాంధీ హైదరాబాదులో బుల్డోజర్లను ఎందుకు వ్యతిరేకించడం లేదు?. కేంద్రంలో సీబీఐపీ బీజేపీ తొత్తు అని రాహుల్ గాంధీ ఆరోపిస్తారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును ఎంక్వయిరీ చేయమని సీబీఐకి అప్పగిస్తుంది.వక్ఫ్ బిల్లును మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కోసం జీవో తెచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వక్ఫ్ బిల్లును అమలు చేసేందుకు తొందర పడలేదు. ఇక్కడ ఒక మంత్రిపై ఈడీ దాడులు జరిగి సంవత్సరం అయినా ఎలాంటి చర్యలు లేవు. ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ రూ. 1350 కోట్ల రూపాయలతో కాంట్రాక్టు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇప్పటికీ ఒక్క ముస్లిం వ్యక్తికి ప్రాతినిధ్యం లేదు. ముఖ్యమంత్రి అనుకుంటే ఒక ఎమ్మెల్సీ సీటు ముస్లింలకు కేటాయించి మంత్రి పదవి ఇవ్వచ్చు.. కానీ అలా చేయడం లేదు.తెలంగాణలో అన్ని అన్ని మతాల వారికి ప్రాధాన్యం ఉంటుంది. మేము కుల రాజకీయం, మత రాజకీయం చేయం. మేం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఐటీలో ఉద్యోగాలు మూడు రేట్లు పెరిగాయి. మైనారిటీ విద్యార్థుల కోసం 204 విద్యాలయాలు ఏర్పాటు చేశాం. మైనారిటీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల ద్వారా మైనారిటీ విద్యార్థులకు చేయూతనిచ్చాం. లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కట్టించాం. సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్‌లో మేము బ్రహ్మాండంగా గెలిచాం. మళ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు. ప్రస్తుతం అందరూ నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అలవి గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు.బీఆర్ఎస్ పాలనా కాలంలో కరోనా సమయంలో కూడా అభివృద్ధి ఆగలేదు. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్నో రోడ్లు నిర్మించాం. విద్యావంతులు ఓటు వేయడానికి నిరాసక్త చూపిస్తారు. మీరు కూడా ఓటు వెయ్యాలి. రాజకీయాలపై విద్యావంతులు ఆసక్తిగా ఉండరని అందుకే ఓటు వేయరని నాకు తెలుస్తుంది. కానీ అలా చేయడం సరికాదు. మీరు ఓటు వేయకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు మీ భవిష్యత్తును నిర్ధారిస్తారు. కాబట్టి మంచి నాయకులను మీరు ఎన్నుకోవాలి. ఓటు అడిగే వారిని ఓటు ఎందుకు వేయాలి మీరు ఎదురు ప్రశ్నించాలి అని’ కామెంట్స్ చేశారు. -
Jubilee Hills bypoll: ముగ్గురికీ సవాలే!
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీల్లోని ముగ్గురు ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తమ పార్టీని గెలిపించే బాధ్యత వీరి భుజస్కంధాలపై ఉంది. దీంతో ముగ్గురూ ఈ ఎన్నికను ఆషామాïÙగా తీసుకోవడం లేదు. తమకిది ఓ సవాల్‌గా భావించి సత్తా చాటుకోవాలనుకుంటున్నారు. అంతేకాదు, వారికీ ఎన్నిక చాలా అవసరమని.. వారి నాయకత్వానికి లిట్మస్టెస్ట్గా మారనుందని రాజకీయ పరిశీలకులు సైతం భావిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఎంతో కీలకం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఎంతో అవసరం. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక దాదాపు రెండేళ్లకు జరుగుతున్న ఎన్నిక కావడంతో ఆయన పని తీరుకు గీటురాయి కానుంది. ఆయన పాలన తీరుకు ప్రజలిచ్చే తీర్పుగానే చాలామంది భావిస్తున్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక కంటోన్మెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ, రేవంత్ సీఎం అయ్యాక స్వల్ప సమయంలోనే ఆ ఎన్నిక జరిగినందున దానిని ఆయన పనితీరుకు నిదర్శనమనలేదు. ఇప్పుడు మాత్రం ఆయన పాలనకు ప్రజలిచ్చే మార్కులుగా పరిగణిస్తున్నారు. 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. ఈ సీటును గెలుచుకుంటే నగరంలోనే సీఎంతో పాటు పార్టీ పట్టు బలపడుతుంది. అంతే కాదు.. రేవంత్‌రెడ్డి మోడల్(వెల్ఫేర్+డెవలప్మెంట్)కు విలువ పెరుగుతుంది. ఓటమి ఎదురైతే, అమలు కాని హామీలు (మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం తదితర స్కీమ్స్) ఇచ్చారనే పేరు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ప్రజల నుంచి విమర్శల దాడి మరింత తీవ్రమవుతుంది. గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగానూ ఉత్సాహంతో లోకల్‌బాడీ ఎన్నికలకు పార్టీకి మంచి బూస్ట్‌గా మారనుంది. కేటీఆర్‌కు సరై్వవల్ టెస్ట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జూబ్లీహిల్స్‌లో గెలుపు ఎంతో అవసరం. తమ పార్టీ సిట్టింగ్ సీటు కావడంతో ఒక రకంగా చెప్పాలంటే ‘సర్వైవల్ టెస్ట్’. గెలిస్తే, కేటీఆర్ ప్రో–అర్బన్ ఇమేజ్ (యువత, ఐటీ సెక్టార్) బలపడుతుంది. కేటీఆర్ ప్రచారం చేస్తున్న బుల్డోజర్ రాజ్, హైడ్రా డెమాలిషన్స్, పవర్ కట్స్ వంటి వాటికి ప్రజలు మద్దతిచ్చారని భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఫెయిలయిందని చెప్పేందుకూ ఇంతకు మించిన అవకాశం లేదు. కేటీఆర్ రాజకీయ సామర్థ్యానికీ నిదర్శనంగా మారనుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితమైనప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆరే చూస్తున్నారు. పార్టీ ఫ్యూచర్‌కు కూడా కీలకం. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలువురు నేతలు పార్టీని వీడారు. ఓటమిపాలైతే పారీ్టలో మిగిలే వారు బహుశా ఉండకపోవచ్చు. కేటీఆర్ లీడర్ ప్పైనా ప్రశ్నలు వెల్లువెత్తే అవకాశముంది. అందుకే కేటీఆర్ సైతం వీటిని తేలిగ్గా తీసుకోలేదు. బూత్‌స్థాయి నేతలతో సమావేశమవుతున్నారు. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ విజయయాత్ర తిరిగి ఇక్కడి నుంచే అని చెబుతున్నారు. గెలిస్తే సక్సెస్ స్టార్‌గా కేటీఆర్ నిలుస్తారు. కిషన్‌రెడ్డికి అవశ్యం.. బీజేపీ అభ్యర్థి గెలవడం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అవసరం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ కిషన్‌రెడ్డి గెలిచిన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోనే ఉంది. ఓడితే పార్టీ దిగజారుతుంది. ఇప్పటికే పార్టీ బహిష్కృత నేత రాజాసింగ్ వ్యంగ్యా్రస్తాలు సంధించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? బీఆర్ఎస్ను గెలిపిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డి ఎన్నిసార్లు కేంద్రమంత్రి అయినప్పటికీ హైదరాబాద్‌కు చేసిందేమీలేదని ప్రతిపక్ష పారీ్టలు ఇప్పటికే విమర్శిస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీకి వచ్చినన్ని ఓట్లకన్నా ఓట్లు పెరిగితే గుడ్డిలో మెల్ల. ఇంకా తగ్గితే కిషన్‌రెడ్డి ఇమేజ్ దిగజారుతుంది. -
జూబ్లీహిల్స్ ఎన్నిక.. ఈసీ నిర్ణయంతో బీఆర్ఎస్కు కొత్త టెన్షన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. తాజాగా ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ గుర్తులు కేటాయించింది. ఈ క్రమంలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులకు చపాతీ రోలర్, రోడ్ రోలర్ గుర్తుల కేటాయింపులు చేసింది. దీంతో, గుర్తుల విషయమై గత అనుభవాల దృష్ట్యా బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.గతంలో ఈ సింబల్స్ తొలగించాలని బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కారు గుర్తుకు దగ్గరగా ఉన్న గుర్తుల కారణంగా సింబల్స్ గుర్తింపులో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, ఈ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థుల కలర్ ఫొటోలను సైతం ఎన్నికల సంఘం ఇవ్వనుంది. కాగా, బ్యాలెట్ పేపర్లో మొదటి స్థానం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి (కమలం), రెండో స్థానం కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్‌యాదవ్ (హస్తం), మూడో స్థానం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతగోపీనాథ్ (కారు)కు కేటాయించారు.ఇదిలా ఉండగా.. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా ఇప్పటికే రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 58 మంది పోటీలో ఉన్నట్లు ఆర్వో సాయిరాం వెల్లడించారు. అయితే, ఇంత మంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీపడగా.. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే, ఆయన మరణంతో ఉప ఎన్నిక రావడంతో ఈ సారి పోటీలో ప్రధాన పార్టీలతోపాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలోకి దిగారు. -
ఎన్నికల విధులకు ఆటంకం.. సల్మాన్‌ఖాన్‌పై కేసు నమోదు
బంజారాహిల్స్: అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు గాను బీఆర్ఎస్ నేత సల్మాన్‌ఖాన్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి సాయిరాం ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.బోరబండకు చెందిన సల్మాన్‌ఖాన్ హెచ్వైసీ పార్టీ పేరుతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. బుధవారం స్క్రూట్నీ సందర్భంగా విధుల్లో ఉన్న ఆర్వో సాయిరాం తన నామినేషన్‌ను తిరస్కరించడం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమేగాక విధులకు ఆటంకం కలిగించారు. అసభ్య పదజాలంతో దూషించారు. తన నామినేషన్‌ను కావాలనే తిరస్కరించారని, దీనిపై కాంగ్రెస్ ఒత్తిడి ఉందంటూ ఆరోపించారు. అతడి వైఖరి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమైనందున అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇదిలా ఉండగా సల్మాన్‌ఖాన్ గురువారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన విషయం విదితమే. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గల్లా పట్టి నిలదీయండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీషీటర్‌ను పోటీలో నిలబెట్టి ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టింది. కాంగ్రెస్ ప్రచారంలో రౌడీషీటర్లు పాల్గొంటూ కత్తులు, కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్నారు. రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇజ్జత్ (గౌరవం) ఉంటుందా? రౌడీషీటర్‌గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంటుంది. రౌడీషీటర్ కుటుంబం నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించి నియోజకవర్గ గౌరవంతోపాటు హైదరాబాద్‌లో శాంతిభద్రతలను ఓటర్లు కాపాడుకుంటారనే నమ్మకం ఉంది’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలతో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలనపై అవగాహన కల్పించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీ సాధించేలా కష్ట పడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎర్రవల్లి నివాసంలో గురువారం కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సుమారు మూడు గంటలపాటు సాగిన సుదీర్ఘ సమావేశంలో పార్టీ అభ్యర్థి గెలుపు, భారీ మెజారిటీ సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పెద్దలను గల్లా పట్టి నిలదీయాలి ఓట్ల కోసం వచ్చే ప్రభుత్వ పెద్దలను గల్లాపట్టి నిలదీయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలో దిగజారిన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి నిలిచిపోవడం గురించి ఇంటింటికీ తిరిగి వివరించండి. హైడ్రా పేరిట బుల్డోజర్లను పేదల గుడిసెల మీదికి పంపి నిలువ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వస్తే గల్లా పట్టి నిలదీయాలి. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మానవీయ కోణంలో అమలు చేసిన కేసీఆర్ కిట్ నుంచి కళ్యాణలక్ష్మి వరకు పథకాలు నిలిచిపోవడానికి కారకులైన కాంగ్రెస్ నేతలను ప్రజలు ప్రశ్నించాలి. కరోనాతో పాటు పెద్దనోట్ల రద్దుతో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం, కానీ, రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిలో ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసహ్యం, ఏహ్య భావం నిండివుంది. ప్రజల చేతిలో పైసలు ఆడక పరేషాన్లో ఉన్నారు. రెండేళ్లు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఖతం చేసింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయే అని తెలంగాణ సమాజం స్పష్టతతో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపును ప్రజలు ఎప్పుడో ఖాయం చేశారు. భారీ మెజారిటీ సాధించేలా ప్రజలతో కలిసి పనిచేయడం మీ బాధ్యత’అని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. రాష్ట్రానికైనా, కుటుంబానికైనా పతారా (పరపతి) ఉంటేనే అతార (డిమాండ్) పెరుగుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గురించి ప్రజలు ఆలోచించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఒక చార్టును తయారు చేసుకుని ప్రజల్లోకి వెళ్లి, తాము అందుబాటులో ఉంటామని భరోసా ఇవ్వాలని ఆదేశించారు. ఎర్రవల్లి నివాసంలో నేతల సందడి ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌తో పాటు ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వీరితోపాటు ఉప ఎన్నికలో పార్టీ తరపున డివిజన్, క్లస్టర్ ఇన్చార్జిలుగా ప్రచారం చేస్తున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ నేపథ్యంలో ఎర్రవల్లి నివాసం సందడిగా మారింది. సమావేశానికి వచ్చిన నేతలను కేసీఆర్ పేరు పేరునా పలకరించారు. పార్టీ అభ్యర్థి వెంట ప్రచారంలో ఉండాలని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. -
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో 100 మంది రౌడీషీటర్లు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ నవంబర్ 11న జరగనుండగా ఇప్పటికే నామినేషన్ ప్రక్రియతో పాటు నామినేషన్ పత్రాల స్రూ్కట్నీ కూడా పూర్తయ్యింది. అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ప్రచారంతో పాటు ర్యాలీలు, రోడ్‌షోలు, పోలింగ్, కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈమేరకు అందరూ సమన్వయంగా ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలుపరుస్తున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధి కిందికి వచ్చే టోలిచౌకి, గోల్కోండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, మధురానగర్, బోరబండ, పంజగుట్ట, సనత్‌నగర్ తదితర ఎనిమిది పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషిటర్లను బైండోవర్ చేశారు. నేరాలను నియంత్రించడానికి, శాంతి భద్రతలకు విభాగం కలిగించే వ్యక్తులను అదుపులో ఉంచడానికి ఎన్నికల సమయంలో రౌడీషిటర్ల బైండోవర్ చేస్తుంటారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలోని ఈ ఎనిమిది పోలీస్స్టేషన్ల పరిధిలోని 100 మంది రౌడీషీటర్లతో పాటు 50 మంది సస్పెక్ట్ïÙట్లు కలిగి ఉన్నవారు ఉన్నారు. ఈ ప్రక్రియలో రౌడీషిటర్లు, అనుమానిత వ్యక్తులు శాంతి భద్రతల సమస్యలు సృష్టించకుండా ప్రవర్తన సరిదిద్దుకోవాలని, న్యాయస్థానం ముందు హామీపత్రంపై సంతకం చేయాలని పోలీసులు కోరతారు. ఒకవేళ బైండోవర్ అయిన తర్వాత ఈ హామీని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.నేర కార్యకలాపాలను నివారించడం, సమాజంలో శాంతిభద్రతలను కాపాడడం, రౌడీషిటర్లు తమ ప్రవర్తన మార్చుకోవడానికి ప్రోత్సహించడం బైండోవర్ల ముఖ్య ఉద్దేశ్యం. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ఉప ఎన్నిక సందర్భంగా ఇప్పటికే పోలీసులు అడుగడుడుగునా పికెటింగ్‌లు ఏర్పాటుచేయడంతో పాటు రాత్రిపూట పెట్రోలింగ్ ముమ్మరం చేసి అనుమానితుల కదలికలపై దృష్టిపెట్టారు. రౌడీషిటర్ల కదలికలను కూడా గమనిస్తున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషిటర్ల కదలికలపై దృష్టి పెట్టడమే కాకుండా వారు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారా..? అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. వీరందరికీ ఇప్పటికే కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచి్చన మరుసటి రోజు నుంచే అన్ని పోలీస్స్టేషన్లకు చెందిన రౌడీషీటర్లను బైండోవర్ చేయడమే కాకుండా ఎన్నికలకు సంబంధించిన ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రచారం తదితర కార్యక్రమాల్లో వీరు పాల్గొంటున్నారా..? లేకపోతే ఏదైనా సమస్యలు సృష్టించేందుకు ప్రయతి్నస్తున్నారా..? అన్నది పోలీసులు గమనిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి కిందికి వచ్చే సోమాజీగూడ, షేక్‌పేట, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్, బోరబండ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ తదితర ఏడు డివిజన్ల పరిధిలో 407 పోలింగ్ బూత్‌లను 139 లొకేషన్లలో ఏర్పాటుచేశారు. ఇందులో 57 పోలింగ్ లొకేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. క్రిటికల్ పోలింగ్ బూత్‌ల పరిధిలో ఉంటున్న రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు ఎక్కువగా దృష్టిపెట్టారు. -
జూబ్లీహిల్స్ నామినేషన్ల స్క్రూటినీ పూర్తి.. మిగిలింది 81 మందే..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills ByPoll) బరిలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతరం, బుధవారం నామినేషన్ల స్క్రూటినీ(Nominations Scrutiny Completed) ప్రక్రియ ముగిసింది. 17 గంటల పాటు జరిగిన వడపోత అనంతరం పోటీలో 81 మంది అభ్యర్థులు మిగిలారు. 135 నామినేషన్లను ఎన్నికల అధికారి ఖరారు చేశారు. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. ఇక, రేపు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఉంది. వీరిలో ఎంత మంది విత్‌డ్రా చేసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. స్క్రూటినీ సందర్బంగా సరైన ఫార్మాట్లో పత్రాలు సమర్పించకపోవడం, వివరాలు అసంపూర్తిగా ఉండటంతో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్ దగ్గరుండి పర్యవేక్షించారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు.ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు విడుదల కానున్నాయి. ఉప ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.ఇది కూడా చదవండి: స్థానికంపై నేడు నిర్ణయం! -
‘జూబ్లీహిల్స్’పై నేడు కేసీఆర్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారపర్వంపై దృష్టి కేంద్రీక రించింది. ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగే ఈ భేటీకి రావాల్సిందిగా పార్టీ అభ్యర్థితోపాటు పార్టీ డివిజన్ ఇన్ చార్జ్‌లు, స్టార్ క్యాంపెయినర్లు, ప్రచారంలో పాల్గొంటున్న కీలక నేతలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ఆహ్వానం అందింది. గురువారం జరిగే భేటీలో పార్టీ ప్రచార వ్యూహం, సమన్వయం, ప్రచార ఎజెండాపై కేసీఆర్ దిశానిర్దే శం చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపఎన్నికలో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంతోపాటు క్షేత్ర స్థాయిలో నెలకొన్న రాజకీయ స్థితిగతులు, ఓటరు మనోగతం తదితరాలపై చర్చించినట్టు సమాచారం. బీఆర్ఎస్ పట్ల ఉన్న సానుకూలతను ఓట్ల రూపంలో మలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో కసరత్తు జరిగినట్టు తెలిసింది.బహిరంగ సభకు విముఖత: ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ప్రచారానికి కేవలం 15 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో విస్తృత ప్రచారానికి అవలంబించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దృష్టి సారించారు. నగరంలో ఉండే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని భారీ సభలు, సమావేశాల జోలికి వెళ్లకుండా డివిజన్ల వారీగా హాల్ మీటింగ్స్, కార్నర్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఓటర్లకు చేరువయ్యేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో పార్టీ బృందాలు ప్రతీ ఇంటిని సందర్శించేలా షెడ్యూల్ రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రచారం చివరిదశలో జరిగే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొనే అవకాశమున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
‘దానం సపోర్ట్ చేస్తే తప్పేంటి?.. కొండా ఫ్యామిలీ వివాదం ముగిసింది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ బహిరంగంగానే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కొండా సురేఖ, కొండా సుస్మిత వివాదం ముగిసిపోయిందని క్లారిటీ ఇచ్చారు.టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మా స్టార్ క్యాంపెయినర్ లిస్టులో దానం నాగేందర్ పేరు ఉంటే తప్పేంటి?. ముసుగులో గుద్దులాటలు అవసరం లేదు.. దానం నాగేందర్ సపోర్ట్ డైరెక్ట్ చేస్తున్నాడు. మా పార్టీకి మద్దతు ఇస్తే తప్పేంటి?. ఫిరాయింపుల అంశాన్ని స్పీకర్ చూసుకుంటారు. జీవన్ రెడ్డి చాలా రోజుల నుంచి అసంతృప్తితో ఉన్నారు. జీవన్ రెడ్డిని త్వరలోనే సెట్ చేస్తాం.కొండా సుస్మిత వ్యాఖ్యలపై కొండా దంపతులు విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మళ్ళీ ఇలాంటివి జరగవని కొండా దంపతులు ముఖ్యమంత్రితో చెప్పారు. కొండా సురేఖ వివాదం ముగిసింది. రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను ఢిల్లీ వెళ్తాం. డీసీసీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ కీలక భేటీ
సాక్షి, ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో(KCR) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో(Jubilee Hills By poll) ప్రచారం, ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నట్టు సమాచారం. తాజా భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.మాజీ మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) బుధవారం ఉదయం ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు చేరుకున్నారు. అనంతరం, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. అలాగే, తాజా రాజకీయ అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇక, రేపు(గురువారం) కేసీఆర్.. జూబ్లీహిల్స్ ఇన్‌చార్జ్‌లతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ప్రచార వ్యూహాలపై వారికి కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. -
Jubilee Hills By Poll: స్వతంత్ర అభ్యర్థిగా వీరబోగ వసంత రాయలు
హైదరాబాద్: నెత్తిమీద మహరాజులు ధరించే టోపీ, ఒంటి మీద కుర్తా, అలనాటి లెగ్గిన్, వంకీలు తిరిగిన బూట్లు, మెడలో రాజహారాలు, చేతులకు కడియాలు, రాజసంగా ఓ చేతిలో కత్తి ధరించి గుర్రపు బగ్గీపై నామినేషన్ వేసేందుకు వచ్చి అందర్నీ ఆకట్టుకున్నాడో ఇండిపెండెంట్ అభ్యర్థి. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ వీరబోగ వసంత రాయలు ప్రజాపతి (వీబీవీఆర్) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారం నియోజకవర్గానికి వచ్చారు. యూసుఫ్‌గూడలోని పోచమ్మబస్తీ నుంచి ఆయన ఈ విధమైన వేషధారణతో గుర్రపు బగ్గీపై వెళ్తుండగా అందరూ మొబైల్ కెమెరాలతో క్లిక్ మనిపించారు. ప్రజాక్షేమమే లక్ష్యమని, సంపాదన ముఖ్యం కాదని అందుకే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పార్టీలకు షాకిస్తూ భారీ సంఖ్యలో నామినేషన్లు
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం నామినేషన్లు వెల్లువెత్తాయి. భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు వచ్చారు. దీంతో, బంజారాహిల్స్ రోడ్డు నంబర్–2లోని షేక్‌పేట మండల కార్యాలయంలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయం కిటకిటలాడింది. ఆఖరి రోజు నాటికి మొత్తం 321 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. బుధవారం తెల్లవారుజాము మూడు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.నామినేషన్ల చివరిరోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. మంగళవారం గంటల నుంచే అభ్యర్థులు క్యూ కట్టారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవగా అభ్యర్థులు భారీగా ఉండటంతో అధికారులు వారికి టోకెన్లు జారీ చేశారు. తొలి 6 రోజుల్లో కేవలం 94 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజు 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల గడువు పూర్తి నాటికి మొత్తం 211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఒక్కో అభ్యర్థి నామినేషన్ సమర్పించేందుకు 15 నిమిషాలు పట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అధికారులతోపాటు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్, రిటర్నింగ్ అధికారి సాయిరాం తదితరులు అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఈసీని బుధవారం వరకు గడువు కోరారు. దీంతో ఈసీ అనుమతి మేరకు టోకెన్లు ఎంత మందికి జారీ చేస్తే వారందరి నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోవాలని.. బుధవారం ఈ ప్రక్రియ కొనసాగించవచ్చని ఈసీ నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఆర్వో కేంద్రం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికకు మొత్తంగా 321 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక నామినేషన్లను అధికారులు ఈరోజు పరిశీలించనున్నారు. ఉపసంహరణకు తుది గడువు 24. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు.ట్రిపుల్ ఆర్ బాధితులు... ప్రతిపాదిత రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో 11 మంది రైతులు సైతం మంగళవారం నామినేషన్లు వేశారు. ఆర్ఆర్ఆర్ వల్ల రోడ్డున పడుతున్నామని మొరపెట్టుకున్నా ప్రభుత్వం వినిపించుకోనందున తమ బాధలు చెప్పుకోవడానికే నామినేషన్లు వేసినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. అలాగే 10 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసిత రైతులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. వారితోపాటు సుమారు 200 మంది భూ నిర్వాసితులు నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి టీజీఐఐసీ పేరిట మార్చిన పట్టా భూములను తిరిగి రైతుల పేరిట నమోదు చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకే నామినేషన్లు వేశామని అభ్యర్థులు తెలిపారు. మరోవైపు.. రిటైరైనా ప్రభుత్వం నుంచి ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదంటూ పలువురు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ 50 మంది మాల మహానాడు నేతలు సైతం నామినేషన్లు వేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి సంఖ్య భారీగా నమోదైంది. -
Hyd: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ గడువు
హైదరాబాద్: నగర పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ గడువు ముగిసింది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించారు అధికారులు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 21వ తేదీ) నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆర్వో కార్యాలయం కాంపౌండ్క భారీగా క్యూకట్టారు స్వతంత్ర్య అభ్యర్థులు. సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ వేసినట్ల తెలుస్తోంది. గేట్ లోపల ఉన్న అభ్యర్థుల నామినేషన్లన మాత్రమే ఆర్వో అధికారి స్వీకరించనున్నారు. గడిచిన 9 రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని(Deepak Reddy) సైతం ఈరోజే నామినేషన్ దాఖలు చేశారు. కాగా, ఊహించిన విధంగా దీపక్ రెడ్డి వైపే.. బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. గత బుధవారం ఉదయం దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక, దీపక్ రెడ్డి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దీపక్‌రెడ్డికి 25వేల ఓట్లు వచ్చాయి.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పక్కా ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలోనూ పార్టీలు ఆచితూచి అడుగులు వేశాయి. ఇక, ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరు ఉండనుంది.ఇదీ చదవండిపార్టీలో నా న్థానం ఏమిటి..? -
కమీషన్ల కోసం మంత్రుల కొట్లాట
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టులు, బిల్లులు మొదలుకొని అన్ని పనుల్లో కమీషన్ల కోసమే మంత్రులు కొట్లాడు కుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సమాధానం చెప్పాల్సిన మంత్రులు, ముఖ్యమంత్రి దాట వేత «ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే రద్దు చేసి హైదరాబాద్ అభివృద్ధిపై రేవంత్ సర్కారు నీళ్లు చల్లిందన్నారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న తన సొంత భూముల కోసం సీఎం రేవంత్ ప్రజల సొమ్మును అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, జూబ్లీహిల్స్ నేత అంజిబాబుతోపాటు వివిధ పార్టీల నాయకులు ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.కసరత్తు చేయకుండానే బీసీ రిజర్వేషన్లు‘ఎలాంటి కసరత్తు చేయకుండానే రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్ బీసీలను మోసం చేసింది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గల్లీలో దొంగ పోరాటాలు చేయకుండా ఢిల్లీలో తమ అధిష్టానాలపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదించేలా చూడాలి. ఢిల్లీలో జరిగే ప్రయత్నాలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పనితీరుకు పరీక్ష. ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్‌లో ఓటర్లు బుద్ధి చెప్పాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.ప్రజలు బాధ పడుతున్నారు.. సబిత: ప్రతీ సందర్భంలో ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారని, దేవుడి పాలన కోల్పోయామని జూబ్లీహిల్స్ ప్రజలు బాధ పడుతున్నారని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో మైనారిటీ ఓటర్లు బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ పోర్టు మెట్రో పనులు ప్రారంభించడంతోపాటు 111 జీవో నుంచి విముక్తి కలిగిస్తామని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రకటించారు.పారా అథ్లెట్ అర్చనకు కేటీఆర్ అండరాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటకు చెందిన పారా అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు కేటీఆర్ అండగా నిలిచారు. కుట్టుపని ద్వారా జీవనోపాధిపొందుతున్న అర్చనకు పారా త్రోబాల్ క్రీడలో ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి 10 వరకు శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ సౌత్ ఏషియన్ చాంపియన్ షిప్లో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది. అర్చన ఆదివారం కేటీఆర్‌ను కలవగా, అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణ సామగ్రిని అందజేశారు. -
బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేసిన విష్ణు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ నేత, పీజేఆర్ తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనే స్వయంగా రిటర్నింగ్ అధికారికి రెండుసెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ విష్ణుతో నామినేషన్ వేయించింది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.అయితే, సునీత నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21న కూడా మాగంటి సునీత మరోసారి భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల స్క్రూటినీలో ఏదైనా తేడా వస్తే విష్ణు బరిలో ఉంటారని తెలుస్తోంది. -
కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ మొదటి దెబ్బ అక్కడే కొట్టబోతుంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ మొదటి దెబ్బ జూబ్లీహిల్స్‌లో కొట్టబోతుందన్న కేటీఆర్.. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడతాం. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దౌర్భాగస్థితిలో ఉన్నాడు. దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలి’’ అంటూ సవాల్ విసిరారు. ‘‘రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. కేసీఆర్ సీఎం కాబోతున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం’’ అంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు. -
Jubilee Hills by poll: 127కు చేరిన నామినేషన్లు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 48 నామినేషన్లు దాఖలయ్యా యి. ఇప్పటివరకు మొత్తం నామినేషన్ల సంఖ్య 127కు చేరింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల సంఖ్య 94కు చేరింది. నామినేషన్లకు ఆదివారం, సోమవారం సెలవు దినాలు కాగా, మంగళ వారం ఒక్కరోజే నామినేషన్లకు తుది గడువు కాగా ఆ రోజు ఎంతమంది వేస్తారనేది చూడాల్సి ఉంది. -
ఎన్నికల వేళ ఆయుధాల డిపాజిట్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక నేపథ్యంలో అనుమతి పొందిన ఆయుధాలను లైసెన్స్‌దారులు తమ సమీప ఠాణాల్లో అప్పగిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం వెపన్ లైసెన్స్ హోల్డర్లు తమ ఆయుధాలను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు వెపన్ లైసెన్స్‌దారులకు గత రెండు నెలల నుంచే ఆయా పోలీస్స్టేషన్ల అధికారులు సమాచారం ఇచ్చారు. వాటిని ఠాణాల్లో గానీ, గుర్తింపు పొందిన సంబంధిత ఆయుధ విక్రయ కేంద్రాల్లో గానీ డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పించారు. శాంతి భద్రతలు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే దిశగా ఎన్నికల సమయంలో తుపాకులను డిపాజిట్ చేయాలనే నిబంధనే ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో దీని పరిధి కిందికి వచ్చే పోలీస్ స్టేషన్లలో లైసెన్స్‌దారులు గత కొద్ది రోజుల నుంచి వాటిని అప్పగిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధి కిందికి పంజగుట్ట, మధురానగర్, బోరబండ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టోలిచౌకి, గోల్కొండ, సనత్‌నగర్ తదితర పోలీస్స్టేషన్లు వస్తాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలోని ఎనిమిది ఠాణాల పరిధిలో 234 లైసెన్స్డ్ తుపాకులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం లైసెన్స్డ్ తుపాకులు తెప్పించుకుని పోలీస్స్టేషన్లలో డిపాజిట్ చేయిస్తున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, రియల్టర్లు ఈ ఆయుధాలను కలిగి ఉన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో తుపాకులు ఉన్నవారు బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉండడంతో ఎన్నికలు అయ్యే వరకు పోలీసులు వాటిని డిపాజిట్ చేసుకోవాలని ఎన్నికల సంఘం నిబంధనలు తెలియజేస్తున్నాయి. ఆయుధ లైసెన్స్ ఉన్నవారి వివరాలను నేషనల్ డేటా బేస్ ఆఫ్ ఆర్మ్స్ లైసెన్స్ వెబ్సైట్లో పొందుపరచడమే కాకుండా లైసెన్స్ కలిగిన ప్రతిఒక్కరికీ ఐడీ నెంబర్ కేటాయించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 234 మంది లైసెన్స్‌దారులకు నోటీసులు జారీ చేసి వారి నుంచి తుపాకులను డిపాజిట్ చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 80 శాతం ఆయుధాలు డిపాజిట్ చేయడం జరిగింది.క్రిమినల్ కేసులు నమోదైతే లైసెన్స్ రద్దు.. ఆయుధ లైసెన్స్ కలిగిన వ్యక్తులపై ఏదైనా సందర్భంలో క్రిమినల్ కేసులు నమోదైతే వారికి ఆయుధ లైసెన్స్‌ను రద్దు చేయనున్నారు. అంతేకాకుండా ఆయుధాన్ని అనవసరంగా ఉపయోగించినా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. అనుమతి పొందిన ప్రాంతం కంటే ఇతర ప్రాంతాల్లో ఆయుధం సంచరించినా లైసెన్స్‌ను రద్దు చేస్తారు. -
నవీన్ యాదవ్ ఆస్తులు రూ.29.66 కోట్లు..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పి.నవీన్‌యాదవ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో కీలకమైన అఫిడవిట్‌ను ఆయన జతపర్చారు. ఈ మేరకు తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. చేతిలో నగదు రూ.4 లక్షలు, భార్య చేతిలో రూ.2 లక్షలు నగదు ఉందని, ఐదు బ్యాంక్ ఖాతాల్లో రూ.37.6 లక్షలు తన పేరు, తన భార్య పేరున రెండు అకౌంట్లలో రూ.10 వేలు నిల్వ ఉన్నట్లు చెప్పారు. రూ. 7 లక్షల విలువైన షేర్లు ఉన్నాయని, తన పేరున స్కోడా కారు, తన భార్య పేరిట హుందాయ్ ఐ10 కారు ఉన్నట్లు తెలిపారు. తన వద్ద 11 తులాల బంగారం, తన భార్య పేరున రెండు కేజీల బంగారం, 15 కిలోల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున 14.39 ఎకరాల వ్యవసాయ భూమి, యూసుఫ్‌గూడలో 860 గజాల ఇంటి స్థలం, భార్య పేరుతో 4.30 ఎకరాల వ్యవసాయ భూమి, 466 గజాల స్థలంలో ఇళ్లు ఉన్నాయన్నారు. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.29.66 కోట్లు తన పేరిట, రూ.5.75 కోట్లు భార్య పేరిట ఉన్నాయన్నారు. తనకు అప్పులు రూ.75 లక్షలు ఉన్నట్లుగా అఫిడవిట్లో పొందుపర్చారు. -
సినీతారల మార్ఫింగ్ ఫొటోలతో ఓటు ముద్రించిన వ్యక్తిపై కేసు
హైదరాబాద్: తయారు చేసి వైరల్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, జీహెచ్ఎంసీ సర్కిల్–19 ఉప కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. గత మూడు రోజులుగా సినీతారలు రకుల్ ప్రీత్‌సింగ్, సమంత రూత్ ప్రభు, తమన్నా భాటియాల ఫొటోలను ముద్రించి నియోజకవర్గ ఓటర్లుగా గుర్తు తెలియని వ్యక్తి వైరల్ చేయడం జరిగింది. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Jubilee Hills Bypoll: పోలింగ్ రోజు సెలవు
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో బోనఫైడ్ ఓటర్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. అలాగే, ఇతర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ జూబ్లీహిల్స్ నివాసిగా ఉండి ఓటరుగా పేరు నమోదు చేసుకున్న ఉద్యోగులకు కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. మరోవైపు జూబ్లీహిల్స్ పరిధిలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటిస్తూ సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల పోలింగ్ రోజున ఈసీ సెలవు ప్రకటించింది. బీహార్‌తో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. మొదటి దశ: నవంబర్ 6, 2025 (గురువారం), ద్వితీయ దశ: నవంబర్ 11, 2025 (మంగళవారం), 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు కూడా నవంబర్ 11, 2025న జరగనున్నాయి. ప్రజాప్రతినిధుల చట్టం, 1951లోని విభాగం 135B ప్రకారం.. వ్యాపారం, వాణిజ్యం, పరిశ్రమ, ఇతర ఏదైనా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి, తాను ఓటు హక్కు కలిగిన నియోజకవర్గంలో పోలింగ్ రోజు ఒక చెల్లింపు సెలవు (Paid Holiday) మంజూరు చేయాలని ఈసీ పేర్కొంది. -
హీరోయిన్ల ఓటరు కార్డులు.. అధికారులు ఏమన్నారంటే..
హైదరాబాద్ : ప్రముఖ హీరోయిన్ల పేర్లు, ఫోటోలు ఉన్న నకిలీ ఓటరు కార్డులు వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్ డివిజన్ల పరిధిల్లో వెలిశాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తమ ఫోన్లలో వచ్చిన ఆయా కార్డులను చూసి విస్తుపోతున్నారు. ప్రముఖ హీరోయిన్లయిన రకుల్ ప్రీత్‌సింగ్, సమంత రూత్ ప్రభు, తమన్నా భాటియాలు వీరంతా ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. వారు నిజంగా మా ప్రాంతాల్లో ఉన్నారా అంటూ ఆరా తీస్తున్నారు.ఈ ఓటరు కార్డులు వైరల్ (Viral) కావడంతో అటుతిరిగి ఇటు తిరిగి అధికారుల దృష్టికి వెళ్ళింది. దాంతో వాటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు ఆయా కార్డులు నకిలీవంటూ తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, సర్కిల్–19 ఉప కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్డులు ముద్రించి ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.78.85 లక్షలు సీజ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా డబ్బులు తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బోరబండ, మధురానగర్, పంజగుట్ట, సనత్‌నగర్, టోలిచౌకి, గోల్కోండ పోలీస్స్టేషన్ల పరిధిలో గత 5 రోజుల నుంచి వేర్వేరు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టి రూ.78.85 లక్షలు సీజ్ చేశారు. రూ.10 లక్షలు.. వెంగళరావునగర్ : అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల నగదును బుధవారం ఎన్నికల పర్యవేక్షణ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు స్వాదీనం చేసుకున్నాయి. అమీర్‌పేట చౌరస్తా, వెంకటగిరి కాలనీ రోడ్డు, మధురానగర్కాలనీతో పాటు తదితర ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో సరైన రసీదులు లేని డబ్బును స్వాదీనం చేసుకున్నారు. రూ.21.21 లక్షలు విడుదల చేసిన జిల్లా గ్రీవెన్స్ కమిటీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల (Jubilee hills by poll) సందర్భంగా అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద స్వా«దీనం చేసుకున్న రూ.21.21 లక్షలను జిల్లా గ్రీవెన్స్ కమిటీ బుధవారం విడుదల చేసింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ కె.మంగతాయారు అధ్యక్షతన గల కమిటీ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో విచారణలు నిర్వహించింది. మొత్తం 5 కేసులకు సంబంధించి సాక్ష్యాధారాలు పరిశీలించింది. ఎన్నికలకు సంబంధం లేని నగదు అని రూఢీ చేసుకున్న తర్వాత స్వాదీనం చేసుకున్న రూ.21,21,600 నగదును విడుదల చేసింది. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ వెంకటేశ్వర్ రెడ్డి, సభ్యులు వసుంధర, శరత్ చంద్ర పాల్గొన్నారు.చదవండి: సీఎం రేవంత్‌పై కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు -
జూబ్లీహిల్స్ ఓట్ చోరీ కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో ఓట్ చోరీపై హైకోర్టు విచారణ చేపట్టింది. బోగస్ ఓట్లు తొలగించాలంటూ మాగంటి సునీత, కేటీఆర్ లంచ్ మోషన్ పిటీషన్లు దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌తో సంబంధం లేనివారు ఓటర్ జాబితాలో చేరారని పిటిషన్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరఫున న్యాయవాది దామా శేషాద్రినాయుడు తన వాదనలు కోర్టుకు వినిపించారు. ‘‘జూబ్లీహిల్స్‌లో 19వందలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయి. 12 వేల మంది బయటి వ్యక్తులకు ఓట్లు ఉన్నాయి. కొంతమందికి రెండు ఓట్లు ఉన్నాయి. డూప్లికేట్ ఓట్లు కూడా నమోదయ్యాయి’’ అని ఆయన కోర్టుకు తెలిపారు.పిటీషనర్లు చీఫ్ ఎలక్ర్టోరల్ అధికారికి ఫిర్యాదు చేశారని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అవినాష్.. కోర్టుకు తెలిపారు. ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ.. 21వ తేదీ వరకు పరిశీలన చేస్తారన్న ఈసీ తరఫు న్యాయవాది.. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారిని సైతం వివరణ అడిగినట్లు తెలిపారు.పిటీషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు.. ఈసీ తరఫు న్యాయవాది వాదనలను సీజే ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. పిటీషనర్ విజ్ఞప్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్న ఈసీ న్యాయవాది వాదనలను హైకోర్టు రికార్డు చేసింది. ఈ పిటీషన్లో ప్రత్యేక ఆదేశాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. -
Jubilee Hills bypoll: ఎగ్జిట్ పోల్స్ నిషేధం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ, ప్రచారం నవంబర్ 6 నుంచి 11 వరకు నిషేధిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఈ నెల 13న జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ మేరకు నవంబర్ 6వ తేదీ ఉదయం 7 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదు, ప్రచురించరాదు, ఎలాంటి మాధ్యమంలోనూ ప్రచారం చేయరాదని పేర్కొన్నారు. ఈ నిషేధం టెలివిజన్, రేడియో, వార్తాపత్రికలు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వంటి అన్ని సమాచార మాధ్యమాలకు వర్తిస్తుంది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారికి ప్రజాప్రతినిధుల చట్టం, 1951లోని 126ఏ సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. అలాగే, పోలింగ్ ముగిసే ముందు 48 గంటల వ్యవధిలో ఎటువంటి ఎన్నికల సంబంధిత విషయాలు, సర్వేలు, అభిప్రాయ సేకరణ ఫలితాలు ఎలక్ట్రానిక్ మీడియా లేదా ఇతర మాధ్యమాల్లో ప్రదర్శించరాదు. మీడియా సంస్థలు, రాజకీయ పారీ్టలు, సోషల్ మీడియా వినియోగదారులు, ఎన్నికల సంబంధిత అన్ని వర్గాలు ఈ మార్గదర్శకాలను కచి్చతంగా పాటించాలని, స్వేచ్ఛా, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల నిర్వహణలో భాగస్వాములుగా నిలవాలని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ విజ్ఞప్తి చేశారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 120మంది నామినేషన్లు..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..!సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే పలు రకాలుగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఎన్నిక ఫలితం భవిష్యత్ సూచిక అనే అభిప్రాయాలున్నాయి. అందుకే వేటికవిగా అన్నివిధాలుగా శక్తియుక్తులు ఒడ్డుతున్నాయి. అధికార యంత్రాంగానికి సైతం ఈ ఉపఎన్నిక పెనుసవాల్‌గా మారింది. సాధారణంగా ఏ ఎన్నికలో అయినా పది మందో, ఇరవై మందో పోటీలో ఉంటారు. కానీ.. ప్రభుత్వంపై వ్యతిరేకతతో వివిధ వర్గాల వారు, అసంతుషు్టలు ఈ ఉపఎన్నికతో తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి ఇండిపెండెంట్లుగా పోటీ చేయడం ద్వారా ప్రజలకు తమ వేదన వెల్లడించడంతో పాటు ప్రభుత్వానికి సెగ తగిలేలా చేయాలనుకుంటున్నారు. ట్రిపుల్ఆర్, ఫార్మాసిటీ, లగచర్ల ప్రాజెక్టుల భూసేకరణ బాధితులు, గ్రూప్–1 అభ్యర్థులు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి మాలలు, తదితర వర్గాలు, గ్రూపులకు చెందిన వారు భారీ సంఖ్యలో ఇండింపెండెంట్లుగా నామినేషన్లు వేసేందుకు ‘జూబ్లీహిల్స్’ను వేదిక చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే బుధవారం వరకు 30 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసేందుకు మరో 120 మందికి పైగా నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయముంది. ఆలోగా ఇంకెంతమంది నామినేషన్లు వేయనున్నారో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. అధికారులకు ఇరకాటం బ్యాలెట్ పేపర్ల కాలం ముగిశాక ఈవీఎంల ద్వారా పోలింగ్ జరుగుతుండటం తెలిసిందే. ఒక ఈవీఎంలో గరిష్టంగా 16 మంది అభ్యర్థులు, గుర్తులకు అవకాశం ఉంది. వీటిల్లో ఒకటి నోటాకు పోను 15 మంది అభ్యర్థులుంటారు. ఎక్కువమంది అభ్యర్థులు బరిలో ఉంటే గతంలో ఒక కంట్రోల్ యూనిట్‌కు నాలుగు బ్యాలెట్ యూనిట్లు జత చేసేవారు. తద్వారా నోటా పోను 63 మంది అభ్యర్థులకు అవకాశం ఉండేది. 2013 తర్వాత నుంచి ఎం3 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. వీటిని ఒక కంట్రోల్ యూనిట్‌కు గరిష్టంగా 24 బ్యాలెట్ యూనిట్లను కనెక్ట్ చేయవచ్చు. నోటా పోను 383 మంది అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. అంతకుమించి అభ్యర్థులు బరిలో మిగిలితే సంప్రదాయ పద్ధతిలో బ్యాలెట్ విధానానికి వెళ్లాల్సి వస్తుంది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు సిద్ధం చేసుకున్నారు. రెండు బ్యాలెట్ యూనిట్లు మించి అవసరం రాకపోవచ్చునని అంచనా వేశారు. కానీ నామినేషన్లు పెరిగితే అదనపు యూనిట్లు సమకూర్చుకోవడం, ర్యాండమైజేషన్ వంటివి చేయాల్సి వస్తుంది. ఓటరు తాను వేసిన ఓటు సరిగ్గా పడిందో లేదో తెలుసుకునే వీవీప్యాట్లను కూడా అదనంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. గతంలో 1996లో నల్లగొండ పార్లమెంట్‌కు 470 మందికి పైగా ఇండిపెండెంట్లు, ఈవీఎంలు వచ్చాక గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి దాదాపు 185 మంది పోటీలో ఉండటం తెలిసిందే. -
అందరికీ సవాలే!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరు గెలిచినా చరిత్రే అవుతుంది. జూబ్లీహిల్స్ గెలుపు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా మారుతుంది. దీంతో గెలుపు కోసం మూడు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత లాగా జూబ్లీహిల్స్ గెలుపు రానున్న రోజుల్లో రచ్చ గెలిచేలా చేస్తుందని భావిస్తున్నాయి.కాంగ్రెస్: విజయం కోసం ప్రణాళికలు అధికార కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు సవాలుగా మారింది. స్థానిక యువనేత, అనుభవం ఉన్న నవీన్‌యాదవ్‌కు టికెట్‌ను ఖరారు చేసింది. ముగ్గురు మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులను ఇక్కడ ప్రచారంలో దింపి కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టినా గ్రేటర్లో మాత్రం ఒక్క సీటు గెలవలేదు. దీంతో ఇక్కడ గెలిస్తే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు దారి మరింత సులువు అవుతుందని భావిస్తోంది. అధికారంలో ఉన్నా గ్రేటర్ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు లేకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రేటర్లో పాగా వేస్తే వచ్చే స్థానిక, అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలం చేకూరుతుందని ప్రణాళికలు చేపడుతుంది.బీఆర్ఎస్: పట్టు నిలుపుకునే యత్నం బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా గ్రేటర్లో మాత్రం తన పట్టును కోల్పోలేదు. అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని గ్రేటర్లో అన్నివర్గాలు తమవైపే ఉన్నాయని చూపించింది. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జరుగుతున్న ఉపఎన్నికల్లో మాగంటి సతీమణి సునీతకు సీటు కేటాయించి సెంటిమెంట్‌తో పాటు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ క్షేత్రస్థాయి బలంతో మరోసారి పాగా వేయాలని చూస్తోంది. కేటీఆర్, హరీష్‌రావులు తప్పక విజయం సాధించాలనే తపనతో ఇక్కడ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రోజూ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే జీహెచ్ఎంసీ పీఠం తప్పక కైవసం చేసుకోవచ్చని అంచనా వేస్తొంది. గ్రేటర్ పీఠాన్ని కొట్టి అన్ని ఎన్నికల్లో బలాన్ని మరింత పెంచుకొని అసెంబ్లీ ఎన్నికల నాటికి రాటుదేలి మూడోసారి తెలంగాణలో అధికారాన్ని పొందాలని చూస్తుంది.బీజేపీ: వ్యూహం మారింది.. లేటుగా అయినా లేటెస్ట్ అంటూ..బీజేపీ జూబ్లీహిల్స్‌లో మరోసారి లంకల దీపక్‌రెడ్డికి ఛాన్స్ ఇచి్చంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన దీపక్‌రెడ్డి 26 వేల ఓట్లను సాధించారు. దీంతో బీజేపీ ఇప్పుడు తన వ్యూహాలను మార్చింది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్‌లో ఓ వర్గం ఓట్లు రెండు పార్టీలు పంచుకుంటాయని, మరోవర్గం, సెటిలర్లు, కాలనీ, కమ్యూనిటీ ఓట్లు తప్పక వస్తాయని, అనూహ్యంగా రేసులో ముందుండి గెలుస్తామని ధీమాగా ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకోకుండా గట్టి పోటీతో 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఇక్కడ గెలిస్తే గ్రేటర్ పీఠం తప్పక తమదేనని బీజేపీ కూడా భావిస్తోంది. పార్టీ అధ్యక్షుడు రాంచంద్రరావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తమ వ్యూహాలను ఎవరికీ తెలియకుండా గుంభనంగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. -
మాగంటి సునీత ఆస్తులివే..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేయగా..తన ఆస్తుల వివరాలు అఫిడవిట్లో పొందుపరిచారు. ఈ మేరకు ఆమె వద్ద 4097 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే చేతిలో నగదు 38,800 రూపాయల నగదు ఉండగా మూడు బ్యాంకు ఖాతాల్లో కలిసి సుమారు 32 లక్షలు, బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారు వెండి ఆభరణాలు మొత్తం కలిపి 6,18,54,274 రూపాయలు ఉన్నట్టు పేర్కొన్నారు. ముగ్గురు పిల్లల పేరిట షేర్లు, ఆభరణాల విలువ సుమారు రూ.4.62 కోట్లుగా పేర్కొన్నారు. సిరాస్తులు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 34 లో ఓ ప్లాటు, గోపనపల్లిలో ఓ ప్లాటు ఉన్నట్లు, వీటి మొత్తం విలువ 6.11 కోట్ల రూపాయలు, పిల్లల పేరిట 8 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా సునీత పేరిట రూ.4.44 కోట్లు అప్పు ఉండగా, పిల్లల పేరుపై ఆరు కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆమెపై ఎన్నికల నియామావళి ఉల్లంఘించినందుకు గతవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. -
జూబ్లీహిల్స్ ఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Jubilee Hills Elections) ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడింది. లంకల దీపక్ రెడ్డిని(Deepak Reddy) తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఊహించిన విధంగా దీపక్ రెడ్డి వైపే.. బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. తాజాగా బుధవారం ఉదయం దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక, దీపక్ రెడ్డి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దీపక్‌రెడ్డికి 25వేల ఓట్లు వచ్చాయి.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పక్కా ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలోనూ పార్టీలు ఆచితూచి అడుగులు వేశాయి. ఇక, ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరు ఉండనుంది. -
కేసీఆర్ రీఎంట్రీకి ఇదే మొదటి మెట్టు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తమకు మంచి రోజులు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఓటమి తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాగంటి సునీత గోపినాథ్ నామినేషన్ దాఖలు చేయడానికి బయల్దేరే ముందు తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ మాకు మంచి రోజులు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో అన్ని పనులు ఆగిపోయాయి. హైడ్రా పేరిట శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. కాబట్టి ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం.. .. గులాబీ దండు జైతయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం అవుతుంది. కేసీఆర్ పునరాగమనానికి ఇదే తొలి మెట్టు. ప్రజల దీవెనలు బీఆర్ఎస్కే ఉంటాయని ఆశిస్తున్నాం. మాగంటి సునీత గెలుపునకు బీఆర్ఎస్ సమిష్టిగా కృషి చేస్తుంది అని కేటీఆర్ అన్నారు.నామినేషన్ వేసిన సునీతజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ షేక్‌పేట ఎమ్మార్వో ఆఫీస్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమె వెంట కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితరులు ఉన్నారు. పదేళ్ల అభివృద్ధికి, రెండేళ్ల అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని, బీఆర్ఎస్ గెలిస్తే బుల్డోజర్ అరాచకాలకు పుల్‌స్టాప్ పడ్డట్లేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: వీడిన సస్పెన్స్.. బీజేపీ అభ్యర్థి ఎవరంటే..? -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో సల్మాన్‌ఖాన్..!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పక్షాల మైనారిటీ ఓటు బ్యాంక్‌కు గండి పడనుందా? అంటే అవుననే రాజకీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నియోజక వర్గంలో మైనారిటీ ఓట్లు కీలకం. మొత్తం ఓట్లలో 24 శాతానికిపైగా మైనారిటీ ఓటర్లు గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపనున్నారు. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు మజ్లిస్ పార్టీకి మైనారిటీల్లో గట్టి పట్టు ఉంది. ఈసారి మజ్లిస్ ఉప ఎన్నికల బరికి దూరం పాటిస్తూ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌కు మైనారిటీ ఓటు బ్యాంక్‌తో పాటు మజ్లిస్ ఓటు బ్యాంక్ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక బీఆర్ఎస్ మైనారిటీ ఓటు బ్యాంక్‌పై ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల బరిలో సోషల్ వర్కర్ సల్మాన్‌ఖాన్ ఎన్నికల బరిలో దిగుతుండటంతో ప్రధాన ప్రక్షాల మైనారిటీ ఓటు బ్యాంక్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. స్థానికుడైన సల్మాన్ క్రౌడ్ ఫండింగ్‌తో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుండటంతో నిరుపేద మైనారిటీల్లో గట్టి పట్టు ఉంది. యువత ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. సల్మాన్ ఎన్నికల బరిలో ఉంటే మొత్తం మీద 20 శాతంపైగా కుటుంబాలు అతని వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మైనారిటీ ఓటర్లు 96 వేలపైనే జూబ్లీహిల్ నియోజకవర్గంలో మొత్తం 3.98 లక్షల ఓటర్లు ఉండగా అందులో 96 వేలపైగా మైనారిటీ ఓటర్లు ఉన్నారు. దీంతో మైనారిటీ ఓటర్లే గెలుపు ఓటములను నిర్ణయించే శక్తిగా మారారు. మజ్లిస్ పార్టీ గతంలో పాగా వేసేందుకు ప్రయతి్నంచింది. మొదటి సారి 2014 ఎన్నికలలో నవీన్ యాదవ్‌ను బరిలో దింపగా 41,656 ఓట్లు దక్కించుకొని స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్తో దోస్తీ కారణంగా పోటీకి దూరం పాటించడంతో నవీన్ యాదవ్ పారీ్టకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18,817 ఓట్లు వచ్చాయి.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కార్పొరేటర్‌ను ఎన్నికల బరిలో దింపినా.. పెద్దగా ప్రభావం చూపలేదు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్దిగా భారత క్రికెటర్ దిగ్గజం అజహరుద్దీన్ ఎన్నికల బరిలో దిగడంతో మైనారిటీ ఓట్లు చీలిపోయాయి. బీఆర్ఎస్కు మైనారిటీ ఓటు బ్యాంక్ కలిసి రావడంతో ఎన్నికల్లో గట్టెక్కగలిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలో మజ్లిస్ నుంచి పోటీ చేసిన నవీన్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈసారి మజ్లిస్ ఎన్నికల బరికి దూరం పాటిస్తూ కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం ఉన్నా.. సోషల్ వర్కర్ సల్మాన్ ఎన్నికల బరిలో దిగడం మింగుడు పడని అంశంగా తయారైంది. -
Jubilee Hills Bypoll: అదృష్టం కలిసి రావాలని..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా అభ్యర్థులు నమ్మే స్వాములు, పంచాంగ కర్తలు వారి జాతకం, నక్షత్రం ప్రకారం ఏ రోజు, ఏ సమయంలో వేస్తే అదృష్టం వరిస్తుందో తెలుసుకొని నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఆయా స్వామీజీలు, పంచాంగకర్తలు, జ్యోతిషులు బిజీబిజీగా మారి వారికి తగు సలహాలు, సూచనలు, ఏదైనా సమస్య ఉండే దానికి చేయాల్సిన పరిహారాలు కూడా చెబుతున్నారు. కొందరు నేతలు మా అభ్యర్థే గెలవాలని పూజలు, హోమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు వందల దాకా నామినేషన్లు పడే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి రెండు రోజుల్లోనే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడం విశేషం. అయితే.. 16, 17, 18 తేదీల్లో దశమి, ఏకాదశి, ద్వాదశి మంచి రోజులు కావడంతో ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు అధికంగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ నెల 17న నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ బుధవారం కొందరు నేతలతో కలిసి నామమాత్రపు నామినేషన్ వేసి, 18వ తేదీలోపు పార్టీ క్రియాశీల నేతలతో కలిసి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
జూబ్లీహిల్స్ ఓట్ చోరీపై నేడు హైకోర్టుకు..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైన నకిలీ ఓటర్లను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. డూప్లికేట్ ఓటర్ల నమోదు ద్వారా అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా విశ్వసనీయత ప్రశ్నార్థకమైన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలన్నారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. ఓట్ చోరీకి సంబంధించిన రుజువులను తమ పార్టీ కార్యకర్తల సహకారంతో రెండు రోజుల వ్యవధిలోనే ప్రజల ముందు పెట్టామన్నారు. అయినా ఎన్నికల కమిషన్ ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఓటరు జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలపై మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాము రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసి 24 గంటలు దాటినా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బుధవారం హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. అసాధారణంగా ఓట్లు పెరిగాయ్.. ‘తెలంగాణ ఓట్ చోరీ అంశంపై రాహుల్ గాంధీ స్పందించాలి. బిహార్‌లో ఓటు చోరీ జరిగితే తెలంగాణలో ఓట్ల చోరీ ద్వారా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోంది. రాహుల్ గాంధీ రాజ్యాంగం ప్రతులను చేతిలో పట్టుకొని అన్ని రాష్ట్రాల్లో నీతి సూక్తులు వల్లె వేస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని యత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కింది అధికారులతో కుమ్మక్కైన అంశాన్ని రాహుల్ గాంధీ పరిగణనలోకి తీసుకొని ఇక్కడ జరిగిన దొంగ ఓట్ల అంశంపై స్పందించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా 23వేల ఓట్లు పెరిగాయని ఎన్నికల సంఘం చెబుతోంది. మరో 12వేల ఓట్లు తొలగించామని చెబుతున్నా అసాధారణంగా ఓట్లు పెరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన వ్యక్తి అక్రమంగా ఓటరు ఐడీ కార్డులను పంపిణీ చేయడంపై ఎన్నికల సంఘం కేసు కూడా నమోదు చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్‌కు మూడు ఓట్లు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఎన్నికల అక్రమాల కోసం కిందిస్థాయి అధికారులను కాంగ్రెస్ ఉపయోగించుకుందనే అనుమానం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికి మూడు ఓట్లు ఉన్న తర్వాత స్వేచ్ఛగా ఎన్నిక జరుగుతుందని ఎలా అనుకోవాలి. ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ భగ్గుమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతుంది? తెలంగాణ, జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి నియోజకవర్గంలో వేలుపెట్టడం మీకు అలవాటు. నా జిల్లాను సర్వనాశనం చేసి నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. మీరు కూడా ఏదో ఒకరోజు బయటకు వెళ్లడం పక్కా’’ అంటూ రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.కాగా, అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై పడింది. రాష్ట్ర రాజధానిలోని అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో ఉపఎన్నిక ఆసక్తిగా మారింది. ఎన్నికల బరికి ప్రధాన రాజకీయ పక్షాలతోపాటు చిన్నా చితక పార్టీలు, సామాజిక వేత్తలు, నిరసనకారులు పెద్ద ఎత్తున ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నిరసన గళం తలనొప్పిగా తయారైంది. కుల, నిరుద్యోగ సంఘాలతో పాటు బాధితులు పెద్ద సంఖ్యలో నామినేషన్ల వేసేందుకు సిద్ధమవడం కలకలం రేపుతోంది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత రెండో ఉపఎన్నిక కావడంతో జూబ్లీహిల్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మంకంగా తీసుకొని ముందస్తుగానే ముగ్గురు మంత్రులు, 18 మంది కార్పొరేషన్లు చైర్మన్లను రంగంలోకి దింపారు. గత రెండు మాసాల్లో సుమారు రూ.15 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయతి్నంచారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేసి బీసీ కార్డు ప్రయోగించి యువ నాయకుడు నవీన్ యాదవ్‌ను ఎన్నికల బరిలో దింపింది. టికెట్ ఆశించిన సీనియర్లు అసంతృప్తికి గురి కావడంతో మంత్రులను రంగంలోకి దింపి బుజ్జగించడంలో సఫలీకృతమైంది. తాజాగా నిరసనగళం ఆందోళన కలిగిస్తోంది. -
ఒకే ఇంట్లో 42 ఓట్లు
హైదరాబాద్: యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణానగర్‌లో ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను ఎన్నికల అధికారులు కొట్టివేశారు. శ్రీకృష్ణానగర్‌లోని బి–బ్లాక్‌లో ఉన్న 8–3–231/బి/160 నెంబర్‌గల సంస్కృతి ఎవెన్యూ అపార్ట్‌మెంట్‌ను సోమవారం ఎన్నికల అధికారులు సందర్శించారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఖైరతాబాద్ తహశీల్దార్ ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో పలువురు బీఎల్ఓలు సోమవారం విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఆ ఇంట్లో రామకృష్ణ, ప్రసన్న, సుబ్బరత్నమ్మ అనే ముగ్గురు మాత్రమే ఓటర్లు ఉంటున్నారు. అయితే మిగిలిన 39 మంది మాత్రం అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లారు. సిని పరిశ్రమకు చెందిన వారుగా గుర్తించిన అధికారులు అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లి వారి వివరాలు ఆరా తీశారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టŠస్లో వారు విధులు నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం వారు నివసిస్తున్న ఇంటి నెంబర్‌తో మరో ఓటును కూడా పొందారా అనే క్రమంలో విచారించగా ఇంకో ఓటు లేదని నిర్థరణకు వచ్చారు. తమ ఓటు అదే ఇంటి నెంబర్లో ఉంటుందని, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేశామని అధికారులకు తెలియజేశారు. గత 20 ఏళ్లుగా ఇక్కడే ఓట్లు వేస్తున్నట్లుగా తెలిపారను. కాగా ఇల్లు ఖాళీ చేసిన వారి ఓట్లను వారి అనుమతి లేకుండా తొలగించే హక్కు బీఎల్ఓలకు లేని కారణంగా వాటిని తొలగించలేదని, 43 ఓటర్లను గుర్తించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. -
Jubilee Hills by Election: బీఆర్ఎస్ దూకుడు!
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. మొదటి రోజైన సోమవారం ప్రధాన రాజకీయపారీ్టలేవీ నామినేషన్లు దాఖలు చేయలేదు. పోలింగ్‌కు నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రచారాల్లో మునిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతోనే ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. దీంతో, తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా తిరిగి నిలబెట్టకోవడమే కాక, రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది తామేనని, కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించడం లేదని చెప్పేందుకు ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే తలంపులో బీఆర్ఎస్ ఉంది. గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే తమ అభ్యర్థిగా అందరి కంటే ముందే ప్రకటించిన బీఆర్ఎస్, ఇప్పటికే డివిజన్ల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించగా, తాజాగా సోమవారం రహ్మత్‌నగర్‌లో పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. గెలుపు ఇప్పటికే ఖాయమైందని, ఎక్కువ మెజార్టీ పొందడమే ముందున్న లక్ష్యమని కార్యకర్తలను ప్రోత్సహించారు. అనంతరం కేటీఆర్, అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో భారీ యెత్తున దొంగ ఓట్లు చేర్చిందంటూ ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ఓవైపు పార్టీ సీనియర్ నేతలను కలుస్తున్నారు. మరోవైపు బస్తీల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని వివిధ నియోజకవర్గాల్లోని వారి సహకారం కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ, ఫహీం ఖురేషి తదితరులను కలిసి ఎన్నికలో సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరో ప్రకటించకపోవడంతో బహిరంగంగా ప్రచార కార్యక్రమాలేవీ లేనప్పటికీ, లోపాయికారీగా వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల తొలిరోజు దృశ్యాలిలా ఉండగా, మూడు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశాక ప్రచార కార్యక్రమాలు ముమ్మరం కానున్నాయి. -
పట్టుకోసం బీఆర్ఎస్.. పాగా వేయాలని కాంగ్రెస్..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరి దృష్టి ఇప్పుడు ఈ నియోజకవర్గం పైనే నిలిచింది. అధికార కాంగ్రెస్ పారీ్టకి ఈ ఉప ఎన్నికలో గెలుపు సవాల్‌గా మారగా, ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ అదే స్థాయిలో పావులు కదుపుతోంది. ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పారీ్టలు తమ అభ్యర్థులను బరిలోకి దించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా, ఇంకా బీజేపీ అభ్యరి్థని ప్రకటించకపోవడంతో ప్రచారంలో వెనకబడి ఉంది. ఈఉప ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్లకు నువ్వా..నేనా..! అన్నట్లుగా మారడంతో విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారం వేడెక్కుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కాగా సానుభూతితో గెలవాలని బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యరి్థగా గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను రంగంలోకి దింపింది. ఇక స్థానికుడు, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పటికే పలుమార్లు పోటీ చేసిన అనుభవం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ యువనేత వి.నవీన్యాదవ్ను అభ్యరి్థగా ప్రకటించింది. నేడో రేపో భారతీయ జనతా పార్టీ లంకాల దీపక్‌రెడ్డిని తమ అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు 80,549 (43.9 శాతం)ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు 64,212 (35 శాతం) ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి 25,866 (14.1 శాతం) ఓట్లు, ఎంఐఎం అభ్యరి్ధగా పోటీ చేసిన మహ్మద్ రాషేద్ పరాజుద్దీన్కు 7,848 (4.2 శాతం) ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 1,83,312 ఓట్లు పోలయ్యాయి. నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంటుందా..? కాంగ్రెస్‌దే పై‘చేయి’ అవుతుందా? అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే దృష్టి సారించారు. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నవీన్.. 2014 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్‌యాదవ్‌కు 41,656 ఓట్లు రాగా రెండో స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన మాగంటి గోపీనాథ్ పైనే పోటీ చేశారు. తాజాగా మూడోసారి మాగంటి భార్యతో పోటీ పడుతున్నారు. -
ఢిల్లీ కాంగ్రెస్‌కు సెగ తగలాలి: కేటీఆర్
రహమత్‌నగర్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు నడిపించే కాంగ్రెస్ పార్టీకి, ప్రజల మేలు కాంక్షించే కారు పార్టీకి మధ్యే ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ కావాలో, హైడ్రా పేరుతో సామాన్య ప్రజల ఇళ్లను కూల్చేయడమే ఎజెండాగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు సెగ తగిలేలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇవ్వాలని కోరారు. రహమత్‌నగర్ డివిజన్ క్వారీ మైదానంలో సోమవారం ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ నగరాన్ని ‘హైడ్రా’బాద్‌గా మార్చి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అభివృద్ధిని దెబ్బతీసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ఓట్చోరీ అంటుంటే.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీయే ఓట్‌చోరీకి పాల్పడిందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో 20 వేల దొంగ ఓట్లను చేర్చిందని ఆరోపించారు. ఇదే మోకా.. బీఆర్ఎస్ కార్యకర్తల కసి, పట్టుదల, తపన పార్టీ విజయానికి నాంది కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంతో ఉన్నవారు సీఎం రేవంత్‌రెడ్డిని తిట్టరాని తిట్లు తిడుతున్నారు. ధోకా తిన్న తెలంగాణకు ఇవాళ మోకా వచి్చంది. ప్రతి ఇంటికి వెళ్లి నిజం చెప్పాలి. గులాబీ జెండా రెపరెపలాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయిన ప్రతి ఒక్కరినీ కలిసి బాకీ కార్డులు పంచాలి’అని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ వృద్ధులకు రూ.48 వేలు, పెళ్లి అయిన ఆడబిడ్డలకు తులం బంగారం, మహాలక్ష్మి కింద మహిళలకు రూ.40 వేల చొప్పున బాకీ ఉందని అన్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అందులో కనీసం 5 శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో కొడితేనే ఆరు గ్యారంటీలు వస్తాయి ఆటో డ్రైవర్లు మొదలుకొని బస్ డ్రైవర్ల వరకు అందరి చూపు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల వైపే ఉందని కేటీఆర్ అన్నారు. ‘ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డులు పెడతామన్నారు. ఇంతవరకు అతీగతీ లేదు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టడమా? ఎంతో మంది నిరుపేదలను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు కళ్లు బైర్లు కమ్మేలా కొడితేనే 6 గ్యారంటీలు వస్తాయి. కాంగ్రెస్ గెలిస్తే ఏమీ ఇవ్వకున్నా గెలిచామని, ప్రజలు తనకే ఓట్లు వేస్తారని సీఎం రేవంత్ అనుకుంటారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. గలీజ్ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని, ఇంత దివాళాకోరు సీఎంను ఎక్కడా చూడలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. సునీత గెలుపు ఖాయం: హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖాన వైద్యులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ‘అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని కాంగ్రెస్ నాయకులు వాగ్దానం చేశారు. ఏళ్లు గడుస్తున్నా నెరవేర్చలేదు. ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలుపు ఖాయమే. భారీ మెజారిటీ కోసమే మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన దివంగత మాగంటి గోపీనాథ్.. నియోజకవర్గ అభివృద్ధితో తనకంటు ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయన ఆశయాలు నేరవేర్చాలన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలన్నా బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి’అని హరీశ్‌రావు కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, నేతలు వద్దిరాజు రవిచంద్ర, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కౌషిక్ రెడ్డి, వేములు ప్రశాంత్‌రెడ్డి, ముఠా గోపాల్, మల్లారెడ్డి, వివేకానంద్‌గౌడ్, సుధీర్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, దాసోజు శ్రవణ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, శ్రీనివాస్‌గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, దాస్యం విజయ్ భాస్కర్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సునీత కంటతడి.. ఓదార్చిన సబిత ఎస్పీఆర్ హిల్స్‌లో సోమవారం నిర్వహించిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి, దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో తన భర్తను తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా వేదికపై ఉన్న నాయకులు మౌనంగా ఉండిపోయారు. పక్కనే ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సునీతను ఓదార్చారు. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు(Jubilee Hills By Elections ) సంబంధించి సోమవారం ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు. నామినేషన్ల స్వీకరణకు అంతా సిద్ధం.. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆర్వో కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లపై ఆర్వో, ఏఆర్ఓలతో సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఈఎస్ఐ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి సాయిరాంకు సూచించారు. -
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచే పార్టీ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మూడు పేర్లను ముందు పెట్టుకుని చర్చించిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ.. అందులో ఒక పేరును ఖరారు చేసినట్టు సమాచారం. ప్రధానంగా పోటీలో ఉన్న దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలతల్లో ఒకరి పేరును ఖరారుచేసినట్లు తెలుస్తోంది. బిహార్ సహా జూబ్లీహిల్స్ అభ్యరి్థత్వాలపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన కమిటీ ఆదివారం సమావేశమైంది.ఈ భేటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఇప్పటికే అధిష్టానం పెద్దలకు నివేదిక అందించారు. దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలతల పేర్లతోనే ఆ నివేదిక అందింది. కమిటీ దీపక్‌రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు. అభ్యరి్థని సోమవారం ప్రకటించే అవకాశం ఉందని కె.లక్ష్మణ్ చెప్పారు. -
మీకు తెలుసా?: జూబ్లీహిల్స్‌లో 80 శాతం బస్తీలే..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే సంపన్నులు, బడాబాబులు ఉండే నియోజకవర్గం అని చాలా మంది అనుకుంటారు. కానీ జూబ్లీహిల్స్‌లో, బంజారాహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి రావన్న సంగతి తెలియదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. మైసూర్పాక్లో మైసూర్ లేనట్టే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ఉండదు. 20 శాతం కాలనీలు, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఉంటే 80 శాతం బస్తీలే ఉంటాయి. పేద, మధ్యతరగతి వర్గాలే అధికం. కేవలం శ్రీనగర్ కాలనీ, మధురానగర్ కాలనీ ప్రాంతాలు, రాజీవ్‌నగర్ కాలనీ, సారథినగర్ సొసైటీ, కళ్యాణ్‌నగర్, మోతీనగర్‌లో కొంత ప్రాంతం కాలనీలు ఉండగా, బ్రిగేడ్ గేటెడ్ కమ్యూనిటీ, కల్పతరు, వాసవి బృందావన్, జనప్రియ అపార్ట్మెంట్స్ లాంటి కమ్యూనిటీలు ఉన్నాయి. అధికంగా మైనారిటీలు మెజారిటీ ఉండగా తదుపరి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ఓసీలు ఉన్నారు. కాగా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెరైటీగా ఆరున్నర డివిజన్లు ఉన్నాయి. ఎర్రగడ్డ, బోరబండ, రహమత్‌నగర్, షేక్‌పేట, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్ ప్రధానంగా ఉండగా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డి గూడ, శ్రీనగర్ కాలనీ ఉంటాయి. జూబ్లీహిల్స్‌లో జూబ్లీహిల్స్ లేనట్లు నియోజకవర్గంలో వెరైటీగా ఆరున్నర డివిజన్లు ఉండటం కూడా ఓ విచిత్రమే. – శ్రీనగర్‌కాలనీ -
జూబ్లీహిల్స్ బరిలో కీర్తిరెడ్డి లేదా దీపక్‌రెడ్డి!
సాక్షి, న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో బీజేపీ నుంచి జూటూరు కీర్తిరెడ్డి, లంకల దీపక్‌రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేసి జూటూరు కీర్తిరెడ్డి, లంకల దీపక్‌రెడ్డి, డాక్టర్ పద్మ, మాధవీలత, ఆలపాటి లక్ష్మీనారాయణ పేర్లతో ఓ జాబితాను రూపొందించింది.శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఢిల్లీలో పార్టీ పెద్దలు బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్‌కు ఆ జాబితాను అందచేశారు. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తమ అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ కుల, బల సమీకరణాల ఆధా రంగా అభ్యర్థిని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. కీర్తిరెడ్డి, లంకల దీపక్‌రెడ్డిలు పార్టీలో చురుగ్గా ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక్కరిని జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం రెండు రోజుల్లో ప్రకటించనుంది. -
ఏమి‘టీ’ విచిత్రం! చాయ్ రూ.5.. కాఫీ రూ.6..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్థులు చేసే ఖర్చు రూ.కోట్లలో ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల నిబంధనల మేరకు మాత్రం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి రూ. 40 లక్షలు మించరాదు. అభ్యర్థులు తాము ఎంతమొత్తంలో ఖర్చు చేసినా లెక్క మాత్రం అంతకు లోబడే ఉండాలి. అందుకుగాను అభ్యర్థులు తమ పార్టీ కార్యకర్తలకు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవారికి , ప్రజలను ఆకట్టుకునేందుకు చాటుమాటుగా పంచే నగదు, కానుకలకు ఎలాగూ లెక్కలుండవు. కానీ.. ప్రచారంలో పాల్గొనే వారికి ఇచ్చే టీ, కాఫీలు, భోజనాలు, ప్రచారంలో వినియోగించేందుకు కొనుగోలు చేసే, అద్దెకు తీసుకునే వస్తువులు, సరుకులు మాత్రం దాచలేరు. వ్యయపరిమితి మించకుండా ఉండేందుకు అభ్యర్థులు ఎలాగూ తక్కువ ఖర్చు చూపిస్తారు కాబట్టి, కనీసం టీ, కాఫీల వంటివాటికైనా వారు ఎక్కువ తిప్పలు పడి ఖర్చులు దాచనవసరం లేకుండా తక్కువ వ్యయాన్నే ఎన్నికల అధికారులు ఖరారు చేశారు. అన్నింటి ధరలు కాదు గానీ కొన్నింటికి మాత్రం ఏడేళ్ల నాటి ధరలే ఇంకా ఉండటం విశేషం. అసెంబ్లీ అభ్యర్థుల వ్యయ పరిమితి గతంలో రూ. 28 లక్షలుగా ఉండేది. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని రూ.40 లక్షలకు పెంచారు. అయినప్పటికీ కొన్నింటి ధరలు మాత్రం అలాగే ఖరారు చేయడం విచిత్రం. అంటే అభ్యర్థులు ఎక్కువ ఖర్చు చేసినప్పటికీ.. తక్కువగా చూపించేందుకు అవకాశం ఇచ్చారన్న మాట! 2018 నాటి ధరలే.. గ్రేటర్ నగరంలో ఎక్కడైనా రూ.5కే కప్పు టీ దొరుకుతుందా? ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకునే ధరల పట్టికలో మాత్రం టీ (చిన్నకప్పు) ధర రూ. 5గానే ఖరారు చేశారు. కాఫీ చిన్న కప్పు ధర రూ.6గా ఖరారు చేశారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు సైతం ఇవే ధరలున్నాయి. నగరంలో రోడ్డు పక్క చాయ్‌వాలా వద్ద కూడా ఇంత తక్కువ ధర ఉండదు. 200 మి.లీ. వాటర్ బాటిల్ ధర 2018లో, 2023లో, ఇప్పుడు కూడా రూ.6గానే చూపారు. నాలుగు ఇడ్లీల ధరలు, రెండు వడల ధరలు సైతం అప్పుడు, ఇప్పుడు రూ.20గానే ఉన్నాయి. ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలు, అభిమానులకు ఆహార పదార్థాలు అందజేయాల్సి ఉంటుంది కాబట్టి వాటివల్లే ఎక్కువ వ్యయం కాకుండా ఉండేందుకు వీటి ధరలు పెంచలేదేమో ? ఆహార పదార్థాలతోపాటు కొనుగోలు చేసే ఆయా ఐటమ్లలోనూ, అద్దెలకు తీసుకునే సామాన్లు, వాహనాలు, టెంట్లు , తదితరమైన వాటిల్లోనూ పాత ధరలకు, ప్రస్తుత ధరలకు కొన్నింట్లో తేడాలున్నా, కొన్ని అలాగే ఉన్నాయి. చిన్న క్లాత్ బ్యానర్ గతంలో రూ.30 మాత్రమే ఉండగా, వాస్తవ ధరలకనుగుణంగా ప్రస్తుతం రూ.140 ఖరారు చేశారు. అలాగే.. పెద్ద బ్యానర్ గతంలో రూ. 55– 71 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.180కి పెరిగింది. ప్రస్తుత ధరలుప్రస్తుతం కండువా రూ. 25, పులిహోర రూ.40, చికెన్ బిర్యానీ రూ.170, ఫొటో గ్రాఫర్‌కు రోజుకు రూ.1500, వీడియోగ్రాఫర్‌కు రూ.1800, చిన్న పూల దండ రూ.100, పెద్ద పూలదండ రూ.250, ఆరు సీట్ల వరకు మోటార్ క్యాబ్ అద్దె రోజుకు రూ.1430గా ఉన్నాయి. మొత్తం 80 రకాల వస్తువులు, సామగ్రి, ఆహార పదార్థాలకు హాళ్లు, వాహనాల అద్దెలకు రేట్లు ఖరారు చేశారు. జాబితాలో లేని వాటికి అభ్యర్థులు సమరి్పంచే ఓచర్లను సంబంధిత అధికారులు çపరిశీలిస్తారు. -
బీఆర్ఎస్కు మా బలమేంటో చూపిస్తాం: నవీన్ యాదవ్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Telangana Election) ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ సెంటిమెంట్‌తో రాజకీయం చేస్తోందని విమర్శించారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. కాంగ్రెస్ బలమేంటో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చూపిస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్(Naveen Yadav) తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. ఎన్నికల్లో నన్ను ఎదుర్కోనే ధైర్యం లేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాపై తప్పుడు కేసులు పెడుతున్నాయి. ఓటర్ కార్డుల కేసులో నిర్ధోషిగా తేలుతాను. బీసీ బిడ్డను అయినా అందరివాడిని. టికెట్ కోసం ప్రయత్నించిన అందరిని కలుపుకుని పోతాను. రూ.180 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది.. ఇంకా చేస్తాం. బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు ఇక్కపై చెల్లవు కాంగ్రెస్ బలమేంటో ఉప ఎన్నికల్లో తెలుస్తుంది. మా బలం చూపిస్తాం అని చెప్పుకొచ్చారు. -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్‌కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఇవాల నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో నవీన్ వైపే సీఎం రేవంత్‌రెడ్డి మొగ్గు చూపింనట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేస్‌లో నుంచి తప్పుకున్నట్లు బొంతు రామ్మోహన్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని.. ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం పనిచేస్తానంటూ బొంతు రామ్మోహన్ తెలిపారు.అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్‌లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికను గెలుచుకున్న ఆ పార్టీ.. జూబ్లీహిల్స్‌లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, పేర్లను పరిశీలించారు.. అయితే సీఎం రేవంత్ నవీన్ వైపే ఆసక్తి చూపించినట్లు తెలిసింది. -
జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ కీలక నేత నవీన్ యాదవ్‌పై(Naveen Yadav) క్రిమినల్ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ ఓటరు కార్డులను పంపిణీ చేయడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ(Election Code) ఆయనపై కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల షెడ్యూల్ సోమవారం విదులైన విషయం తెలిసిందే. కాగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో నియోజకవర్గ పరిధిలో ఓటర్లకు నవీన్ యాదవ్ ఓటరు కార్డులను పంపిణీ చేశారు. దీంతో ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై అధికారులు సీరియస్ అయ్యారు.అనంతరం, దీన్ని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావిస్తూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నవీన్ యాదవ్‌పై బీఎన్ఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 170,171,174 ప్రజాప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్నారు. ఇక, తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. -
ఉప ఎన్నికకు సై
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రసవత్తర రాజకీయ పోరుకు తెరలేచింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు దీనిపై దృష్టి కేంద్రీకరించాయి. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండేందుకే ఎక్కువ అవకాశం ఉంది. సిట్టింగ్ పార్టీ బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ బరిలో ఉండే అవకాశాలున్నాయి. అయితే అభ్యర్థుల ఎంపిక, ఎంఐఎం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ లెక్కలు మారతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంటోన్మెంట్‌ను కైవసం చేసుకున్నట్టే.. అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్‌లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికను గెలుచుకున్న ఆ పార్టీ.. జూబ్లీహిల్స్‌లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. ఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యరి్థని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ యాదవ్‌ల పేర్లను పరిశీలిస్తోంది. అయి తే ఏఐసీసీకి పంపిన జాబితాలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేరు ఉండటం గమనార్హం. రేసులో ‘కారు’జోరు నియోజకవర్గంలో ఉన్న పార్టీ సంస్థాగత బలంతో పాటు, మాగంటి గోపీనాథ్ కుటు ంబంపై ఉన్న సానుభూతి, ప్రభుత్వంపై ఉన్న ఎంతో కొంత వ్యతిరేకత సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేలా చేస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను అభ్యర్థిగా ఇప్పటికే ఖరారు చేయడం ద్వారా మిగిలిన పక్షాల కంటే ముందంజలో ఉంది.పార్టీ సీనియర్ నేతలతో పలు దఫాలుగా భేటీ అయిన కేసీఆర్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. తాజాగా షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో మంగళవారం ఎర్రవల్లి నివాసంలో కీలక భేటీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుమారు నెల రోజుల నుంచే పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేసే పనిలో ఉన్నా రు. ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేసే ందుకు ఆరు డివిజన్లకు పార్టీ ఇన్చార్జిలను ఇప్పటికే నియమించారు. హైదరాబాద్‌లో సత్తా చాటేందుకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో సత్తా చాటేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని, హిందూత్వ ఎజెండాతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్ఎస్ బలహీనతలను ఆసరాగా చేసుకుని జూబ్లీహిల్స్‌పై కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు ఆశపడుతున్నారు. ఈ పార్టీ టికెట్ కోసం గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకెల దీపక్‌రెడ్డితో పాటు, అట్లూరి రామకృష్ణ, జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, బండా రు విజయలక్ష్మీ, సినీనటి జయసుధ, ఆకుల విజయ పోటీ పడుతున్నారు.ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యరి్థని ప్రకటించనున్నట్టు సమాచారం. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో జూబ్లీహిల్స్ ఉండడంతో ఈ ఎన్నిక ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎంఐఎం కార్యాచరణపై మాత్రం ఇంతవరకు స్పష్టత రావడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణమైన మజ్లిస్ ఈసారి ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సీపీఐ, సీపీఎం, జనసమితిలు అధికార కాంగ్రెస్ వైపే నిలబడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: బిహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 13 నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 వరుకు గడువు ఇచ్చింది. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌ను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దించిన బీఆర్ఎస్.. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000 కాగా, జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి పురుషులకు 924 మహిళలుగా ఉంది. ఈ జాబితాలో 6,106 మంది యువ ఓటర్లు (18–19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు), అలాగే 1,891 మంది వికలాంగులు ఉన్నారు.వీరిలో 519 మంది చూపు కోల్పోయిన వారు, 667 మంది కదలికల లోపం ఉన్న వారు, 311 మంది వినికిడి/మాట లోపం కలిగిన వారు, మిగతా 722 మంది ఇతర కేటగిరీలకు చెందినవారు. విదేశీ ఓటర్లు 95 మంది ఉన్నారు. సెప్టెంబర్ 2న విడుదలైన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. నిరంతర సవరణల తరువాత 6,976 మంది కొత్తగా చేర్చబడ్డారు, 663 మంది తొలగించబడ్డారు. దీంతో మొత్తం సంఖ్య 3,98,982కి చేరింది. సేవా ఓటర్లను కలుపుకుని తుది సంఖ్య 3,99,000గా నమోదైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. -
మళ్లీ తెరపైకి అజహరుద్దీన్!?
సాక్షి,సిటీబ్యూరో/బంజారాహిల్స్: అధికార కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక ఉత్కంఠ రేపుతోంది. ముగ్గురు మంత్రులను రంగంలోకి దింపి అభివృద్ధి మంత్రం జపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సీటు కోసం తీవ్రపోటీ ఉండటంతో అభ్యర్థి ఎంపిక కత్తిమీద సాముగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన అజహరుద్దీన్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చగా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి బరి నుంచి తప్పించింది. తాజాగా ఆశావహుల జాబితా తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్న సమయంలో.. తిరిగి అజహరుద్దీన్ పేరు తెరపైకి రావడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గవర్నర్ కోటా నాన్ పొలిటికల్ కేటగిరీ కింద అజహరుద్దీన్‌ను ఎంపిక చేసినప్పటికీ.. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎంపీగా ఎన్నిక కావడంతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేసి ఉండటంతో న్యాయపరమై చిక్కులతో పదవికి గండం తప్పదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆయనకు కూడా ఆ అనుమానం వెంటాడుతోంది. మరోవైపు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా శనివారం బంజారాహిల్స్‌లోని అజహరుద్దీన్ నివాసానికి మైనారిటీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పోటీ చేయాలంటూ పట్టుబట్టారు. వారం రోజులుగా కార్యకర్తల ఒత్తిళ్లు పెరుగుతుండటంతో ఆయన రెండు మూడు రోజులుగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే తలంపుతో ఉన్నట్లు తెలుస్తోంది. రంగంలోకి మీనాక్షీ నటరాజన్ తాజా రాజకీయ పరిణామాలతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ రంగంలోకి దిగారు. అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అధికార పక్షం కావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, యువనేత నవీన్ యాదవ్‌లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ అంజన్ కుమార్ మాత్రం తనకు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టు పడుతున్నారు. ఇప్పటికే ఉప ఎన్నికకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ బాధ్యతలను ఇన్చార్జి మంత్రులకు అప్పగించారు. మజ్లిస్ కలిసి వస్తున్నందుకు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కలిసి వస్తుండటంతో కాంగ్రెస్‌కు విజయావకాశాలపై ధీమా మరింత పెరిగింది. ఇప్పటికే ముగ్గురు రాష్ట్ర మంత్రులు, 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు రంగంలో దిగి అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రతి కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చేవిధంగా ప్రయతి్నస్తున్నారు. నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు అధికంగానే ఉన్నారు. తాజాగా మజ్లిస్ కూడా ఉప ఎన్నికల బరి నుంచి దూరం పాటిస్తున్నట్లు, కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమైనట్లు పరోక్షంగా సంకేతాలు ఇచి్చంది. ఆశావహుల్లో మరింత ఆసక్తి పెరిగింది. దీంతో టికెట్ కోసం పోటీ తీవ్రంగా మారింది. ఎమ్మెల్సీ పదవికి ఎంపికైనప్పటికీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే హైదరాబాద్ మైనారిటీ కోటాలో మంత్రి పదవీ దక్కవచ్చని అజహరుద్దీన్ కూడా యూ టర్న్ తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
జూబ్లీహిల్స్ బైపోల్: కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరంటే..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను (Jubilee Hills Bypoll) అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఈ విషయంలో చాలా ముందుంది. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ప్రకటించింది. కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రచారం కూడా ముమ్మరంగా చేసుకుంటోంది. కాంగ్రెస్ దాదాపుగా మహమ్మద్ అజారుద్దీన్‌ను ఖరారు చేసినట్లే చేసి.. ఎమ్మెల్సీకి నామినేట్ చేస్తూ ట్విస్ట్ ఇచ్చింది. ఇక బీజేపీ సరైన అభ్యర్థినే ఎన్నుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. ఇప్పటికే హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో అభ్యర్థుల పరిశీలన జరిగింది. ఇవాళ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో జరిగిన జూమ్ మీటింగ్‌లోనూ ఈ ఉప ఎన్నిక అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఇక.. రేసులో ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని త్వరలోనే పీసీసీకి సమర్పించబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అన్నీ కుదిరితే.. ఈ నెల 6వ తేదీన పీసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది(Jubilee Hills Congress Candidate). ఇక ఈ లిస్టులో లోకల్ యంగ్ లీడర్ నవీన్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. అనూహ్యంగా రెహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేరు వచ్చి చేరినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే గత గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గ్రాండ్ విక్టరీకి కారణమైన మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా తెర మీదకు రావడం గమనార్హం. మరోవైపు.. బీజేపీ పార్టీ కూడా ఆపరేషన్ జూబ్లీహిల్స్‌ను ముమ్మరం చేసింది(Jubilee Hills BJP Candidate). ఇందుకోసం త్రీమెన్ కమిటీ వేసింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, అడ్వకేట్ కోమల ఆంజనేయులుకు చోటు కల్పించారు. వీళ్లు గ్రౌండ్ లెవల్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా అతిత్వరలో అభ్యర్థిని ఖరారు చేస్తారని సమాచారం. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన లంకా దీపక్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, పీవీ మనవడు ఎన్వీ సుభాష్, సామాజిక కార్యకర్త మాధవీలత, డాక్టర్ పద్మ విప్పర్తి, కీర్తి రెడ్డి.. ఇలా పలు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆ రెండు పార్టీలు వారం, పదిరోజుల్లో అభ్యర్థిపై స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.


