స్కూల్ కోసం ధర్నా
హైదరాబాద్ : తమ స్కూల్‌ను కూల్చేయడంపై విద్యార్థులు స్పందించారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నంబరు 22లో ఫుట్‌పాత్‌పై తడికెలు కట్టి మురికివాడలోని పిల్లలకు ఓ స్వచ్ఛంద సంస్థ విద్యను అందిస్తుంది. అయితే జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవల ఆ స్కూల్‌ను కూల్చేశారు.
దాంతో సదరు విద్యార్థులకు ప్రస్తుతం చదువుకునేందుకు ఇబ్బంది వచ్చిపడింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు తెలిపేందుకు తల్లిదండ్రులతో కలసి వచ్చారు. విద్యార్థులంతా 'వి వాంట్ స్కూల్ బ్యాక్' అంటూ ప్లకార్డుల పట్టి నిరసన తెలిపారు. తల్లిదండ్రులతో కలసి సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.