Jubliee check post
-
జాబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం ఉదయం హుండ్యాయ్ క్రేటా కారు(TS 08HJ 6665) బీభత్సం సృష్టించింది. హై స్పీడ్‌తో వెళ్తూ ఆటో, రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. -
మద్యం మత్తులో పోలీసులను దుర్భాషలాడిన యువతులు
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద శనివారం అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఢిల్లీ యువతులు పోలీసులను దుర్భాషలాడారు. దీనిని చిత్రీకరిస్తున్న మీడియాపై దాడికి యత్నించారు. ఈ తనిఖీల్లో తాగి వాహనాలు నడుపుతున్న 105 మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. 42 కార్లు, 61 బైకులను సీజ్ చేశారు. -
‘జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్’లో ఆక్రమణల తొలగింపు!
బంజారాహిల్స్ (హైదరాబాద్): నగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్ ఈ చౌరస్తాలో పర్యటించి రహదారులు, ట్రాఫిక్‌ను పరిశీలించారు. జూబ్లీహిల్స్ చౌరస్తాలో పెట్రోల్‌బంక్‌ను ఆనుకొని మలుపు వద్ద ఉన్న స్థలాన్ని రోడ్డుకోసం వినియోగించాలని సోమేష్‌కుమార్ ఆదేశించారు. అయితే, ఈ స్థలం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని అధికారులు చెప్పగా... ముందు ఈ స్థలాన్ని రోడ్డు విస్తరణ కోసం స్వాధీనం చేసుకుని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు ఈ స్థలంలో ఆక్రమణలు తొలగించారు. దీంతో ఇక్కడ ట్రాఫిక్ సజావుగా సాగడానికి మార్గం సుగమం అయింది. ఇప్పటికే ఇక్కడ మెట్రో పనులు జరుగుతుండగా... త్వరలో ఫై్ల ఓవర్ల నిర్మాణం కూడా ప్రారంభం కానుంది.