సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం ఉదయం హుండ్యాయ్ క్రేటా కారు(TS 08HJ 6665) బీభత్సం సృష్టించింది. హై స్పీడ్‌తో వెళ్తూ ఆటో, రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment