Terrible Road Accident At Hyderabad Gachibowli - Sakshi
Sakshi News home page

గచ్చిబౌలిలో కారు బీభత్సం.. హైస్పీడ్‌లో ఫుట్‌పాత్‌పై బోల్తాపడి..

Published Fri, Mar 18 2022 6:40 PM | Last Updated on Fri, Mar 18 2022 7:34 PM

Terrible Road Accident At Hyderabad Gachibowli - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో గురువారం జరిగిన జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాద ఘటన మరువక ముందే నగరంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం గచ్చిబౌలిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ యువకుడు హై స్పీడ్‌లో కారు నడిపి హల్‌ చల్‌ చేశాడు. 

వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన రాహుల్‌ అనే వ్యక్తి అధిక వేగంతో కారును నడిపాడు. ఈ క‍్రమంలో ఎల్లా హోటల్‌ వద్ద కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ఓ మహిళను ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరోవైపు కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ మహిళ చనిపోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, రాహుల్‌ మద్యం సేవించి కారును డ్రైవ్‌ చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement